From Wikipedia, the free encyclopedia
తగ్గేదే లే 2022లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస రాజు దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, అనన్య సేన్‌గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 అక్టోబర్ 14న విడుదలచేసి[1], సినిమాను నవంబర్ 4న విడుదల చేశారు.[2]
తగ్గేదే లే | |
---|---|
దర్శకత్వం | శ్రీనివాస రాజు |
కథ | శ్రీనివాస రాజు |
నిర్మాత | భద్ర ప్రొడక్షన్స్ |
తారాగణం | నవీన్ చంద్ర దివ్యా పిళ్లై అనన్య సేన్‌గుప్తా నైనా గంగూలీ |
ఛాయాగ్రహణం | వెంకట్ ప్రసాద్ |
కూర్పు | గ్యారీ బిహెచ్ |
సంగీతం | చరణ్ అర్జున్ |
నిర్మాణ సంస్థ | భద్ర ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 4 నవంబరు 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన ఈశ్వర్ (నవీన్ చంద్ర) తన మేనత్త కుమార్తె దేవి (దివ్యా పిళ్ళై)ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో లిజి (అనన్యా సేన్ గుప్తా)ను చూసి ఈశ్వర్ షాక్ అవుతాడు. లిజిని చూసి ఈశ్వర్ ఎందుకు షాక్ అవుతాడు ? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తరువాత అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి అనేదే మిగతా సినిమా కథ.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.