From Wikipedia, the free encyclopedia
ట్రిస్టన్ స్టబ్స్ (జననం 2000 ఆగస్టు 14) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు. అతను 2022 జూన్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ రంగప్రవేశం చేసాడు[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | కేప్ టౌన్, దక్షిణాఫ్రికా | 2000 ఆగస్టు 14|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | Big ET | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్‌మెన్, వికెట్‌కీపర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక వన్డే (క్యాప్ 148) | 2023 మార్చి 18 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 95) | 2022 జూన్ 9 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 సెప్టెంబరు 1 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019/20–present | ఈస్టర్న్ ప్రావిన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022–present | Manchester Originals | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | Jaffna Kings | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023-present | Sunrisers Eastern Cape | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 3 నవంబర్ 2022 |
స్టబ్స్ 2019–20 CSA 3-రోజుల ప్రొవిన్షియల్ కప్‌లో తూర్పు ప్రావిన్స్ తరపున 2020 జనవరి 16న ఫస్ట్-క్లాస్ ఆత మొదలుపెట్టాడు.[2] అతను 2019–20 CSA ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో తూర్పు ప్రావిన్స్ కోసం 2020 ఫిబ్రవరి 16న తన లిస్ట్ A రంగప్రవేశం చేశాడు. [3] 2020–21 CSA T20 ఛాలెంజ్‌లో వారియర్స్ కోసం 2021 ఫిబ్రవరి 21న తన తొలి ట్వంటీ20 ఆడాడు. [4] 2021 ఏప్రిల్‌లో అతను, దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు తూర్పు ప్రావిన్స్ జట్టులో ఎంపికయ్యాడు. [5]
స్టబ్స్‌కు డచ్ పాస్‌పోర్ట్ కూడా ఉంది. 2021లో డచ్ టాప్క్లాస్సేలో క్లబ్ క్రికెట్ ఆడేందుకు ఎక్సెల్సియర్ '20తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. [6]
2022 మేలో, ముంబై ఇండియన్స్ 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కోసం తమ జట్టులో స్టబ్స్‌ను చేర్చుకుంది. గాయం కారణంగా అవుట్ అయిన టైమల్ మిల్స్ స్థానంలో అతను చేరాడు.[7] అదే నెలలో, స్టబ్స్ భారతదేశంతో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఎంపికయ్యాడు, [8] అది అతని తొలి అంతర్జాతీయ పిలుపు. [9] తన తొట్టతొలి T20I ని 2022 జూన్ 9న, దక్షిణాఫ్రికా తరపున భారత జట్టుతో ఆడాడు. [10]
2022 జూలైలో, అతను లంక ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ కోసం జాఫ్నా కింగ్స్ కు సంతకం చేసాడు. [11]
2023 మార్చిలో, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ (ODI) జట్టులో స్టబ్స్‌ని తీసుకున్నారు. [12] అతను 2023 మార్చి 18న సిరీస్‌లోని రెండవ వన్డేలో తన తొలి వన్డే ఆడాడు.[13]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.