From Wikipedia, the free encyclopedia
జీవశాస్త్రం, రసాయన శాస్త్రం రెండింటి కలయికతో ఏర్పడినదే జీవ రసాయన శాస్త్రం. దీనిని ఆంగ్లంలో బయోకెమిస్ట్రీ ("biochemistry") అంటారు.
జీవుల శరీరంలో మాత్రమే తయారయ్యే రసాయనాలు జీవరసాయనాలు. వీటిని కృత్రిమంగా తయారు చేయగలిగినప్పటికీ, సహజంగా ప్రకృతిలో జీవుల శరీరంలో మాత్రమే తయారవుతాయి. భూమిపై జీవం ఆవిర్భవానికి ముందు జీవరసాయనాలు ఆవిర్భవించాయి. ఆ తర్వాత వీటి మధ్య పరస్పర చర్యల ద్వారా కణం లాంటి నిర్మాణం ఏర్పడి జీవం ఆవిర్భవించింది. జీవుల శరీరంలోని ప్రధాన జీవరసాయనాలు - పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, కేంద్రకామ్లాలు, విటమిన్లు.
Seamless Wikipedia browsing. On steroids.