జిరిబం

మణిపూర్ రాష్ట్రంలోని జిరిబం జిల్లా ముఖ్య పట్టణం, From Wikipedia, the free encyclopedia

జిరిబం, మణిపూర్ రాష్ట్రంలోని జిరిబం జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కేంద్రం. ఇది మున్సిపల్ కౌన్సిల్ గా కూడా ఏర్పడింది. మణిపూర్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఇదీ ఒకటి. అస్సాంలోని కచార్ జిల్లా జిల్లాకు పక్కన మణిపూర్ రాష్ట్ర పశ్చిమ సరిహద్దులో ఈ పట్టణం ఉంది. దీనిని మణిపూర్ రాష్ట్ర పశ్చిమ ద్వారం అని కూడా పిలుస్తారు. జిరిబం పట్టణంలో మీటీలు, బెంగాలీలు, రోంగ్మీలు, హమరులు, పైట్ మొదలైన తెగలు నివసిస్తున్నాయి.[1] జిరిబంలో మైటీ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు.

త్వరిత వాస్తవాలు జిరిబం, దేశం ...
జిరిబం
పట్టణం
Thumb
జిరిబం
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
Thumb
జిరిబం
జిరిబం (India)
Coordinates: 24.80°N 93.12°E / 24.80; 93.12
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
జిల్లాజిరిబం
జనాభా
 (2011)
  Total7,343
భాషలు
  అధికారికమీటీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఎంఎన్
మూసివేయి

చరిత్ర

బ్రిటిష్ వలసరాజ్యాల కాలంలో జిరిబం చరిత్రను నమోదు చేయడం ప్రారంభమైంది. 19వ శతాబ్దం ప్రారంభంలో అనేక తెగలు, సమూహాలు జిరి నది వెంబడి ఉన్న ఈ ప్రాంతానికి వలస వచ్చాయి. ఆ కాలంలో జిరిబం ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. 1891 నుండి 1941 వరకు ఈ ప్రాంతాన్ని మీడింగు చురాచంద్ అనే మహారాజు పాలించాడు. రాజ్య సింహాసనాన్ని అధిరోహించిన సమయంలో మైనర్ అయిన రాజుకు, పరిపాలనలో సహాయం చేయడానికి 1907లో మణిపూర్ రాష్ట్ర దర్బార్ స్థాపించబడింది. తరువాత 1941 నుండి 1955 వరకు చురాచంద్ కుమారుడు మహారాజా బోధ్‌చంద్ర సింగ్ ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు.

యునైటెడ్ కింగ్‌డమ్ నుండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1949, సెప్టెంబరు 2న భారత ప్రభుత్వానికి, మణిపూర్ మహారాజా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 1949, అక్టోబరు 15న మణిపూర్ ప్రాంతం భారతదేశంలో విలీనం చేయబడింది. 1956 కేంద్ర భూభాగాల చట్టం అమల్లోకి వచ్చిన తరువాత, మణిపూర్ కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటిగా మారింది. ఇంఫాల్ నగరం రాష్ట్ర రాజధానిగా ప్రకటించబడింది.[2]

2017లో బెంగాలీ వర్గానికి చెందిన ఆశాబ్ ఉద్దీన్, మణిపూర్ శాసనసభ ఎన్నికల అభ్యర్థిగా పోటిచేసి గెలిచాడు. ఇతడు, జిరిబం మైనారిటీ సమాజం నుండి ఎన్నికైన మొదటి శాసనసభ్యుడు.[3]

భౌగోళికం

జిరిబం పట్టణం 24.80°N 93.12°E / 24.80; 93.12 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[4]

వాతావరణం

జిరిబం పట్టణంలో తేమతో కూడిన ఉప ఉష్ణమండలం వాతావరణం ఉంటుంది. శీతాకాలం, దీర్ఘకాల వేసవికాలంలో భారీ వర్షపాతం కలిగి ఉంటుంది. శీతాకాలంలో కొన్ని ప్రాంతాలలో హిమపాతం కూడా వస్తుంది. భారతదేశంలో చాలా ప్రాంతాల మాదిరిగా, జిరిబం శక్తివంతమైన వర్షాకాలానికి లోబడి ఉంటుంది.

నైరుతి రుతుపవనాల ప్రత్యక్ష ప్రభావం ఉండడం వల్ల రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలతో పోలిస్తే ఇక్కడ వర్షపాతం సమృద్ధిగా ఉంటుంది. వార్షిక వర్షపాతంలో 20-30 శాతం మే నెలలో వర్షాకాలం ముందు కురుస్తుంది. జూన్ రెండవ వారం నుండి సెప్టెంబరు వరకు 60-70 శాతం వర్షపాతం ఉంటుంది. వర్షాకాలంలో సగటు వర్షపాతం 1,000 నుండి 1,600 మి.మీ. (39.4 నుండి 63.0 అంగుళాలు) ఉంటుంది.

ఇక్కడ మితమైన వేడి ఉష్ణోగ్రతతో తేమగా ఉంటుంది. మే, జూన్ నెలల్లో వేడిగా ఉంటుంది. ఇక్కడ మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 °C (104 °F) వద్ద నమోదయ్యాయి. సెప్టెంబరు నుండి నవంబరు వరకు వచ్చే శరదృతువులో ఇక్కడి ఉష్ణోగ్రత చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. డిసెంబరు రెండవవారం నుండి జనవరి రెండవవారం సగం వరకు ఉష్ణోగ్రతలు 2.78 °C (37.00 °F) కన్నా తక్కువగా ఉంటాయి.

జనాభా

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, జిరిబం పట్టణంలో 6,426 జనాభా ఉంది. ఈ జనాభాలో 49 శాతం మంది పురుషులు, 51 శాతం మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత 73 శాతం కాగా, ఇది జాతీయ సగటు 59.5 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 80 శాతం కాగా, స్త్రీల అక్షరాస్యత 66 శాతం ఉంది. మొత్తం జనాభాలో 13 శాతం మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[5]

రాజకీయాలు

జిరిబం పట్టణం, ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.[6]

ఈ ప్రాంతంలో, చుట్టుపక్కల వైద్య, విద్యా, వాణిజ్య సౌకర్యాలు ఉన్నాయి. 2001 భారత జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 80 శాతం మంది వ్యవసాయేతర పనులు చేస్తున్నారు. జనాభాలో 20 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇది ఇతర రంగాల కంటే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తోంది.

రవాణా

జిరిబం పట్టణంలోని రైల్వే స్టేషను మణిపూర్ రాష్ట్రంలో ఏర్పాటుచేయబడిన మొదటి రైల్వే స్టేషను. ఈ స్టేషను నుండి సిల్చార్ పట్టణానికి రైలు సౌకర్యం ఉంది. 111 కిలోమీటర్లు ఉన్న జిరిబం-తుపుల్-ఇంఫాల్ రైల్వే లైన్ ద్వారా జిరిబం పట్టణం, ఇంఫాల్ నగరానికి కలుపబడింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి ముఖ్యమైన రైళ్ళను ప్రారంభించిన తరువాత, ఈ మార్గం గుండా సూపర్ ఫాస్ట్ రైళ్ళు కూడా వెళుతున్నాయి.[7]

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.