Remove ads
సాహిత్య అకాడెమీ పురస్కృత పంజాబీ రచయిత From Wikipedia, the free encyclopedia
జియాని గుర్ముఖ్ సింగ్ ముసాఫిర్ (జనవరి 15, 1899 – జనవరి 18, 1976) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, పంజాబీ రచయిత, కవి. ఈయన నవంబర్ 1, 1966 నుండి మార్చి 8, 1967 వరకు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.[2]
Honorable Jathedar జియాని గుర్ముఖ్ సింగ్ ముసాఫిర్ | |
---|---|
ਇੱਜ਼ਤਦਾਰ ਜਥੇਦਾਰ ਗਿਆਨੀ ਗੁਰਮੁੱਖ ਸਿੰਘ ਮੁਸਾਫ਼ਰ | |
అకల్ తఖ్త్ యొక్క 16 వ జతేదార్ | |
In office 1930–1931 | |
అంతకు ముందు వారు | తేజ సింగ్ అకర్పురి |
తరువాత వారు | వాశాఖా సింగ్ దదేహర్ |
పదవ పంజాబ్ ముఖ్యమంత్రి | |
In office నవంబర్ 11, 1966 – మార్చి 8, 1967 | |
అంతకు ముందు వారు | రాష్ట్రపతి పాలన |
తరువాత వారు | గుర్నమ్ సింగ్ |
లోక్‌సభ సభ్యుడు | |
In office 1952–1966 | |
తరువాత వారు | యజ్ఞ దత్ శర్మ |
నియోజకవర్గం | అమృత్సర్ |
రాజ్యసభ సభ్యుడు | |
In office 1968–1976[1] | |
నియోజకవర్గం | పంజాబ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | గుర్ముఖ్ సింగ్ 1899 జనవరి 15 అధ్వాల్, పంజాబ్ ప్రావిన్స్ (బ్రిటిష్ ఇండియా), బ్రిటిష్ ఇండియా, ప్రస్తుతం పాకిస్తాన్ |
మరణం | 1976 జనవరి 18 77) ఢిల్లీ, భారతదేశం | (వయసు
జాతీయత | సిక్కు భారతీయుడు |
రాజకీయ పార్టీ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | రంజిత్ కౌర్ |
ఈయన 1899, జనవరి 15 న బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని కాంప్బెల్పూర్ (అటాక్) జిల్లాలో ఉన్న అధ్వాల్లో (ప్రస్తుతం పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని రావల్పిండి జిల్లా) జన్మించాడు. ఈయన తన గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. తరువాత ఉన్నత చదువుల కోసం రావల్పిండి వెళ్ళాడు. ఈయన 1918 లో కల్లార్‌లోని ఖల్సా హైస్కూల్లో నాలుగు సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. ఈ సమయంలోనే ఈయనకు జియాని అనే వచ్చింది. 1922 లో తన ఉపాధ్యాయ వృత్తిని వదలి గురుద్వారా సంస్కరణ కోసం ఆకాలి ఆందోళనలో పాల్గొన్నాడు. 1922 లో గురు కా బాగ్ ఆందోళనలో పాల్గొన్నందుకు గాను జైలు శిక్షను కూడా అనుభవించాడు.
ఈయన 1920 నుంచి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈయన 1930 లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని అరెస్టు చేయబడ్డాడు. ఈయన మార్చి 12, 1930 నుండి మార్చి 5, 1931 వరకు సిక్కులకు మత అధికారం యొక్క కేంద్ర స్థానమైన అకాల్ తఖ్త్ అధిపతిగా ఉన్నాడు. ఈయన శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ కార్యదర్శిగా, శిరోమణి అకాలీదళ్ ప్రధాన కార్యదర్శిగా కొంతకాలం పనిచేశాడు. 1949 లో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాడు. ఈయన అమృత్సర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1952, 1957, 1962 లో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఈయన 1966 లో లోక్‌సభ కు రాజీనామా చేసి, పునర్వ్యవస్థీకరణ తర్వాత పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు. ఈయన 1967 లో అమృత్సర్ నియోజకవర్గం నుండి విధానసభ ఎన్నికల్లో పోటీ చేయగా ఇందులో ఓడిపోయాడు. ఈయన 1968 నుండి 1974 వరకు రాజ్యసభ సభ్యుడుగా ఉన్నాడు.
ఈయన కవి, రచయితగా అనేక రచనలు ప్రచురించాడు. ఇందులో సబర్ డి బాన్, ప్రేమ్ బాన్, జీవాన్ పాండ్, ముస్ద్ఫారిద్న్, టుట్టే ఖంబ్, కద్వే సునేహే, సహజ్ సుమెల్, వఖర్డ్ వఖర్డ్ కాట్ర్డ్ కాట్ర్డ్, డువూర్ నెర్హే కవిత సంకలనాలు ఉన్నాయి. ఇవేకాక ఎనిమిది చిన్న కథలు వఖ్న్ డుమా, అహ్లేన్ డి బొట్, కంధ్ద్న్ బోల్ పైడ్న్; సత్ల్ జాన్వారీ; అల్లాహ్ వాలే, గుత్దర్, సభ అచ్హ్ద్, సాస్త్ టాంష్ద్ ఉన్నాయి. నాలుగు జీవిత చరిత్ర రచనలు వెఖిద్ సునీద్ జిడిండి, వెఖిద్ సునీద్ నెహ్రూ, బాగ్ల్ జమైల్, వ్త్విన్ సాది డి షాహిద్ ఉన్నాయి. ఈయన 1954 లో స్టాక్‌హోమ్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశాలలో, 1961లో టోక్యోలో జరిగిన భారత రచయితలకు ప్రాతినిధ్యం వహించాడు. ఈయన మోహన్‌దాస్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూలతో తనకున్న అనుబంధాన్ని అతను రెండు వేర్వేరు సంపుటాలలో రచించాడు- వెఖ్యా సూర్య గాంధీ (నాకు తెలిసిన గాంధీ), "వేఖ్యా సూర్య నెహ్రూ" (నెహ్రూ నాకు తెలిసినట్లు) లో తెలిపాడు.
ఈయన మరణానంతరం 1976లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఇతను రచించిన ఉర్వర్ పర్ అనే చిన్న కథా సంకలనానికి 1978లో పంజాబీలో సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఈయన 1954 స్టాక్‌హోమ్‌లో జరిగిన అంతర్జాతీయ శాంతి సమావేశానికి, 1965లో హెల్సింకిలో జరిగిన ప్రపంచ శాంతి సమావేశానికి, 1969లో బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ శాంతి సమావేశానికి భారత ప్రతినిధుల సభ్యుడుగా ఉన్నాడు. జపాన్‌లో జరిగిన ప్రపంచ ప్రగతిశీల రచయితల సమావేశానికి భారత ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించాడు. 1961లో, 1965లో బాకులో జరిగిన ఇండియన్ రైటర్స్ ఆఫ్రో-ఏషియన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.