జగదల్‌పూర్
From Wikipedia, the free encyclopedia
జగదల్‌పుర్ దక్షిణ చతీస్‌గడ్‌లోని ఒక పట్టణం, చారిత్రక బస్తర్ జిల్లా యొక్క కేంద్రం. ఈ పట్టణం బ్రిటిష్ పాలనలోని బస్తర్ సంస్థానం యొక్క రాజధాని.
?జగదల్‌పుర్ ఛత్తీస్‌గఢ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 19.07°N 82.03°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 552 మీ (1,811 అడుగులు) |
జిల్లా (లు) | బస్తర్ జిల్లా జిల్లా |
జనాభా | 1,03,687 (2001 నాటికి) |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • UN/LOCODE • వాహనం |
• 494001 • +07782 • I • CG-17 |
పర్యాటన
ఈ పట్టణానికి ఉత్తరాన 30 కిలో మీటర్ల దూరాన చిత్రకూట జలపాతములు ఉన్నాయి. దక్షిణాన 35 కిలో మీటర్ల దూరాన కాంగేర్ లోయ జాతీయ అరణ్యం ఉంది. కాంగేర్ లోయ జాతీయ అరణ్యంలో తీరత్‌గఢ్ జలపాతములు, కుటుంసర్ గుహలు, కైలాస గుహలు ఉన్నాయి.
రవాణా
జగదల్‌పుర్ నుంచి రాయగడ, విజయనగరంల మీదుగా భుబనేశ్వర్ వెళ్ళే హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్, అరకు లోయ మీదుగా వెళ్ళే కిరండూల్-విశాఖపట్నం పాసింజర్ బండ్లు ఉన్నాయి.
చరిత్ర
బస్తర్ రాజవంశానికి చాళుక్య & కాకతీయ వంశాల మూలాలు ఉన్నాయి. కాకతి ప్రతాప రుద్రుడు ముహమ్మదీయుల చేతిలో ఓడిపోయిన తరువాత అతని సోదరుడు అన్నమదేవుడు ఇంద్రావతి నదీ తీరానికి పారిపోయి అక్కడ గోండ్ రాజ వంశాల ఆశ్రయంతో ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఆ రాజ్యమే బస్తర్ ప్రాంతం. అతని వంశస్తులే బ్రిటిష్ ప్రభుత్వం కింద బస్తర్ సంస్థానాధీశులుగా పనిచేశారు. బస్తర్ రాజ వంశస్తులలో ఒకరైన ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనుల పక్షాన పోరాడి పోలీస్ కాల్పుల్లో చనిపోయాడు.
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.