ఛతర్‌పూర్
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
ఛతర్‌పూర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్‌పూర్ జిల్లాలోని పట్టణం. ఇది ఛతర్‌పూర్ జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలన పురపాలకసంఘం నిర్వహిస్తుంది.
ఛతర్‌పూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 24.63°N 79.5°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | ఛతర్‌పూర్ |
Founded by | మహారాజా ఛత్రసాల్ |
Named for | మహారాజా ఛత్రసాల్ |
విస్తీర్ణం | |
• Total | 78 కి.మీ2 (30 చ. మై) |
Elevation | 305 మీ (1,001 అ.) |
జనాభా | |
• Total | 1,42,476 |
• జనసాంద్రత | 2,554/కి.మీ2 (6,610/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ, బుందేల్‌ఖండీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 471001 |
టెలిఫోన్ కోడ్ | 07682 |
Vehicle registration | MP-16 |
లింగనిష్పత్తి | 920 ♂/♀ |
చరిత్ర
ఛతర్‌పూర్ 1785 లో ప్రశాంత్ బరోలా నాయకుడు చత్రసాల్ పేరు మీదుగా స్థాపించారు. ఛత్రసాల్ బుందేల్ఖండ్ స్వాతంత్ర్యాన్ని సముపార్జించినవాడు. ఈ పట్టణంలో అతడి సమాధి ఉంది. 1785 వరకు ఈ రాజ్యాన్ని అతని వారసులు పాలించారు. ఆ సమయంలో రాజపుత్ర పొన్వర్ వంశీకులు ఛతర్‌పూర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 1806 లో బ్రిటిష్ రాజ్, ఈ రాజ్యాన్ని కున్వర్ సోనే సింగ్ పొన్వర్ [1] కు ఇచ్చింది. రాజ్యసంక్రమణ సిద్ధాంతం ప్రకారం, ప్రత్యక్ష వారసులు లేని కారణంగా 1854 లో ఛతర్‌పూర్, బ్రిటిషు వారి హస్తగతం కావలసి ఉండగా వారు దాన్ని జగత్ రాజ్‌కు ప్రదానం చేశారు. పొన్వర్ రాజులు 2,900 చ.కి.మీ. ఈ సంస్థానాన్ని పరిపాలించారు. 1901 లో ఈ సంస్థాన జనాభా 1,56,139. ఇది మధ్య భారతదేశంలోని బుందేల్‌ఖండ్ ఏజెన్సీలో భాగం.
1901 లో ఛతర్‌పూర్ పట్టణ జనాభా 10,029. ఒక ఉన్నత పాఠశాల ఉంది. ఈ రాజ్యంలో బ్రిటిషు వారి కంటోన్మెంటు నౌగాంగ్ కూడా ఉంది .
రాజులు
- 1785-1816 కున్వర్ సోన్ షా (మ .1816)
- 1816–1854 పార్తాబ్ సింగ్ (మ. 1854)
- 1854–1867 జఘత్ సింగ్ (జ .1846 - డి. 1867)
- 1867–1895 విశ్వనాథ్ సింగ్ (జ .1866 - మ .1932)
మహారాజులు
- (1649 మే 4 - 1731 డిసెంబరు 20) మహారాజా ఛత్రసాల్
- 1895-1932 విశ్వనాథ్ సింగ్ (జ .1866 - మ .1932)
- 1932-1947 భవానీ సింగ్ (జ .1921 - డి. 2006) [2]
భౌగోళికం
ఛతర్‌పూర్ 24.9°N 79.6°E వద్ద [3] సముద్ర మట్టం నుండి 305 మీటర్ల ఎత్తున ఉంది. ఇది మధ్యప్రదేశ్ ఈశాన్య సరిహద్దులో ఉంది. ఇది ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ నుండి 133 కి.మీ. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నుండి 233 కి.మీ. దూరంలో ఉంది
వాతావరణం
చతర్‌పూర్‌లో వేడి వేసవి, కొంత చల్లటి రుతుపవనాలు, చల్లని శీతాకాలాలతో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ( కొప్పెన్ క్లైమేట్ వర్గీకరణ Cwa ) ఉంది. వర్షాకాలంలో జూన్ నుండి సెప్టెంబరు వరకు భారీ వర్షాలు కురుస్తాయి.
శీతోష్ణస్థితి డేటా - Chhatarpur | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 32.3 (90.1) |
35.0 (95.0) |
39.1 (102.4) |
42.8 (109.0) |
45.0 (113.0) |
47.0 (116.6) |
40.0 (104.0) |
35.3 (95.5) |
38.1 (100.6) |
36.0 (96.8) |
34.6 (94.3) |
30.6 (87.1) |
47.0 (116.6) |
సగటు అధిక °C (°F) | 24.5 (76.1) |
26.7 (80.1) |
32.2 (90.0) |
37.8 (100.0) |
40.6 (105.1) |
37.2 (99.0) |
30.2 (86.4) |
28.6 (83.5) |
30.4 (86.7) |
31.6 (88.9) |
28.7 (83.7) |
25.1 (77.2) |
31.1 (88.1) |
రోజువారీ సగటు °C (°F) | 17.3 (63.1) |
19.9 (67.8) |
25.3 (77.5) |
30.6 (87.1) |
33.5 (92.3) |
31.4 (88.5) |
26.7 (80.1) |
25.6 (78.1) |
26.3 (79.3) |
25.9 (78.6) |
22.4 (72.3) |
18.3 (64.9) |
25.3 (77.5) |
సగటు అల్ప °C (°F) | 10.2 (50.4) |
13.0 (55.4) |
18.3 (64.9) |
23.3 (73.9) |
26.3 (79.3) |
25.4 (77.7) |
23.2 (73.8) |
22.5 (72.5) |
22.1 (71.8) |
20.2 (68.4) |
16.0 (60.8) |
11.5 (52.7) |
19.3 (66.8) |
అత్యల్ప రికార్డు °C (°F) | 1.0 (33.8) |
4.9 (40.8) |
9.8 (49.6) |
14.3 (57.7) |
18.3 (64.9) |
18.1 (64.6) |
19.9 (67.8) |
16.6 (61.9) |
17.0 (62.6) |
12.1 (53.8) |
9.1 (48.4) |
1.2 (34.2) |
1.0 (33.8) |
సగటు అవపాతం mm (inches) | 25 (1.0) |
10 (0.4) |
9 (0.4) |
3 (0.1) |
5 (0.2) |
92 (3.6) |
321 (12.6) |
400 (15.7) |
179 (7.0) |
27 (1.1) |
13 (0.5) |
10 (0.4) |
1,094 (43) |
సగటు వర్షపాతపు రోజులు | 2.3 | 2.3 | 0.8 | 0.2 | 1.9 | 9.6 | 16.5 | 19.7 | 10.0 | 2.2 | 0.9 | 1.2 | 67.6 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) | 49 | 43 | 32 | 25 | 29 | 55 | 81 | 86 | 75 | 52 | 43 | 49 | 52 |
Source: NOAA (1971-1990)[4] |
జనాభా వివరాలు
2011 జనగణ ప్రకారం,[5] ఛతర్‌పూర్ జనాభా 1,47 669. జనాభాలో పురుషులు 53%, మహిళలు 47%. ఛతర్‌పూర్ సగటు అక్షరాస్యత 69%, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ; పురుషుల అక్షరాస్యత 75%, స్త్రీల అక్షరాస్యత 62%. జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
రవాణా
ఛతర్‌పూర్‌కు రోడ్డు, రైల్వే సౌకర్యాలున్నాయి. ఛతర్‌పూర్ స్టేషన్ 2017 లో ప్రారంభమైంది. ఛతర్‌పూర్‌లో మహారాజా ఛత్రసాల్ స్టేషన్ ఛతర్‌పూర్ అనే రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుండి ఝాన్సీ, భోపాల్, ఇండోర్, ఉజ్జయినిలకు నేరుగా రైళ్లు ఉన్నాయి. సమీప రైల్వే స్టేషన్లు ఖజురాహో (45 కి.మీ.), లలిత్‌పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ (135 కి.మీ.) హర్పాల్పూర్ (55 కి.మీ.) ఝాన్సీ (125 కి.మీ.), మౌరానిపూర్ (65 కి.మీ.), సత్నా (140 కి.మీ.). సమీప విమానాశ్రయం ఖాజురాహో సివిల్ ఏరోడ్రోమ్, 45 కి.మీ దూరంలో ఉంది [6]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.