Remove ads
అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఛంగ్లంగ్ జిల్లా, భారతదేశం, అరుణాచల ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో చంగ్లంగ్ జిల్లా ఒకటి.[2] 2011 గణాంకాలను అనుసరించి రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలో రెండవదిగా ఇది గుర్తింపు పొందింది. మొదటి స్థానంలో పపుమ్ పరే జిల్లా ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో లోహిత్, దక్షిణ సరిహద్దులో తిరప్ జిల్లాలు ఉన్నాయి.
ఛంగ్లంగ్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | ఛంగ్లంగ్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,662 కి.మీ2 (1,800 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 1,47,951[1] (2,011) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 61.9%[1] |
• లింగ నిష్పత్తి | 914[1] |
Website | అధికారిక జాలస్థలి |
1987 నవంబరు 14 న తిరప్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేయుటద్వాలా చంగ్లంగ్ జిల్లా రూపుదిద్దుకుంది.[3]
చంగ్లంగ్ జిల్లా వైశాల్యం 4,662చ.కి.మీ.[4] జిల్లా వైశాల్యపరంగా ఇండోనేషియాలోని లంబోక్ ద్వీపం వైశాల్యంతో సమానం.[5] ఈ జిల్లా అత్యధిక వర్షపాతం కలిగి ఉన్న ప్రాంతంలో ఉంది.ఈ ప్రాంతం వృక్ష, జంతు సంపదలో సుసంపన్నమై ఉంది. జిల్లాలో మైదానాలు, ఎగువభూములు ఉన్నాయి. అత్యధికమైన మైదానాలున్న వ్యాలీ డిహింగ్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో వరదలు అధికంగా వస్తుంటాయి.
ప్రాంతీయ వాసులకు డీహింగ్ వద్ద పుష్కలంగా చేపలు లభిస్తుంటాయి. ఇక్కడ లభించే మంచినీటి చేపలకు సమీపంలో ఉన్న తింసుకి, డూమ్ డూమా, డిగ్బొయి, డిబ్రూఘర్ వంటి నగరాలలో గిరాకీ అధికం.
జిల్లా 4 ఉపవిభాగాలుగా విభజించబడింది.[6]
పరిపాలనను సులభతరం చేయడానికి, చాంగ్లాంగ్ జిల్లా 17 సర్కిల్లుగా విభజించబడింది (తాలూకా/తహసిల్/తహశీల్) ఇవి ఉప-జిల్లాలను సూచించే పరిపాలనా విభాగాలు. సర్కిల్లు బహుళ గ్రామాలు, కొన్ని పట్టణాలను కలిగి ఉంటాయి.[6][7]
జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి:- బోర్డంస, మియావొ, నంపాంగ్, దక్షిణ చంగ్లంగ్, ఉత్తర చంగ్లంగ్.
లోక్సభ నియోజకవర్గాలు
ఈ జిల్లా అరుణాచల్ తూర్పు లోక్సభ నియోజకవర్గంలోభాగంగా ఉంది.[8]
ఈ ప్రాంతంలో చక్కని రహదారి వసతి ఉంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ నిర్మించిన రోడ్డు మార్గం కొన్ని దశాబ్ధాలుగా ప్రజల ప్రయాణాలకు వసతి కల్పిస్తుంది.
సంవత్సరం | జనాభా | ±% p.a. |
---|---|---|
1961 | 18,227 | — |
1971 | 41,474 | +8.57% |
1981 | 62,211 | +4.14% |
1991 | 95,530 | +4.38% |
2001 | 1,25,422 | +2.76% |
2011 | 1,48,226 | +1.68% |
ఆధారం:[9] |
2011 జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లోని చాంగ్లాంగ్ జిల్లాలో మొత్తం జనాభా 148,226. వీరిలో 76,948 మంది పురుషులు, 71,278 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో మొత్తం 29,521 కుటుంబాలు ఉన్నాయి. చాంగ్లాంగ్ జిల్లా సగటు లింగ నిష్పత్తి 926. మొత్తం జనాభాలో 13% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 87% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 84.9% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 55.8%. అలాగే చాంగ్లాంగ్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 803 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 946.
చాంగ్లాంగ్ జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 25869, ఇది మొత్తం జనాభాలో 17% మంది ఉన్నారు. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల మగ పిల్లలు 13075, ఆడ పిల్లలు 12794 ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి 979, ఇది చాంగ్లాంగ్ జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (926) కంటే ఎక్కువ. మొత్తం అక్షరాస్యత రేటు 59.8%. చాంగ్లాంగ్ జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 57.22%. స్త్రీల అక్షరాస్యత రేటు 40.89%.
చంగ్లంగ్ జిల్లాలో వాడుకలో ఉన్న సినో- టిబెటన్ భాష అంతరించిపోతున్న భాషలలో ఒకటిగా గుర్తించబడింది. ఈ భాషను 30,000 మంది మాట్లాడుతున్నారు.[10] చంగ్లంగ్ జిల్లాలో అత్యధికంగా గిరిజన ప్రజలు ఉన్నారు. వీరిలో తుత్స, తంగ్స, నొక్టే, చక్మ, సింగ్పొ, లింసు ప్రజలు ప్రధానులు. వీరంతా టిబెటన్ సంతతి ప్రజలు., [11] హజాంగ్, బొడో. మియావొ వద్ద టిబెటన్ ప్రజాసమూహాలు కేంద్రీకృతమై ఉన్నారు. వీరు 1976లో ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. వీరి సంఖ్య దాదాపు 2,200 ఉన్నారు.[12]
చంగ్లంగ్ జిల్లాలో చూడదగిన ప్రదేశాలలో జైరాంపూర్ లోఉన్న రెండవ ప్రపంచ యుద్ధం సమాధులు, ఇండో-మాయన్మార్ సరిహద్దు పట్టణం నంపాంగ్, పగసౌపాస్ ప్రధానమైనవి. ఇతరప్రదేశాలలో తాయీలు, సింపో ప్రజల సుసంపన్నమైన సంస్కృతి ప్రతిబింబించే బోడంస ముఖ్యమైంది.
అరుణాచల్ ప్రదేశ్లో ఈప్రాంతం ప్రాముఖ్యత కలిగిఉన్నా ఇక్కడ ఆసుపత్రులు అందుబాటులో లేవు. అస్సాంలో మంచి ఆసుపత్రి సేవలు లభించడం పెద్ద సవాలుగా ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.