From Wikipedia, the free encyclopedia
ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ (శాసనసభ) నియోజకవర్గాలలో చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. తూర్పు ఆదిలాబాదు భాగంలో కల ఈ నియోజకవర్గం జిల్లా రాజకీయాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడ నుండి విజయం సాధించిన ఇద్దరు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందినారు. తెలుగుదేశం పార్టీకి చెందిన బోడ జనార్థన్ ఇక్కడ నుండి వరుసగా 4 సార్లు గెలుపొందినాడు. 2004లో వరుసగా ఐదవసారి బరిలోకి దిగి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి కుమారుడు జి.వినోద్ చేతిలో ఓడిపోయాడు. మరో ఆరు శాసనసభ నియోజకవర్గలతో పాటు పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఈ నియోజకవర్గం 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. ఈ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 1,48,412.
2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం చెన్నూర్ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. ఇది వరకు ఉన్న వేమనపల్లి మండలం ప్రస్తుతం బెల్లంపల్లి నియోజకవర్గంలో కలిసింది.
తూర్పున ప్రాణహిత నది, దక్షణముగా గోదావరి నది ఉన్న ఈ నియోజకవర్గం ప్రకృతి సంపదకు ప్రసిద్ధి. ఆదిలాబాదు జిల్లా తూర్పు భాగంలో ఈ నియోజకవర్గం ఉంది. తూర్పున మహారాష్ట్ర రాష్ట్రం సరిహద్దుగా ఉండగా, దక్షిణాన కరీంనగర్ జిల్లా సరిహద్దుగా ఉంది. పశ్చిమాన, ఉత్తరాన అదిలాబాదు జిల్లాకే చెందిన మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలు సరిహద్దులుగా ఉన్నాయి.
సంవత్సరం | గెలుపొందిన సభ్యుడు | పార్టీ | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ |
---|---|---|---|---|
1962 | కోదాటి రాజమల్లు | కాంగ్రెస్ పార్టీ | చంద్రయ్య | ఇండిపెండెంట్ |
1967 | కోదాటి రాజమల్లు | కాంగ్రెస్ పార్టీ | రాజమల్లయ్య | ఇండిపెండెంట్ |
1972 | కోదాటి రాజమల్లు | కాంగ్రెస్ పార్టీ | ఏకగ్రీవ ఎన్నిక | |
1978 | సి.నారాయణ | కాంగ్రెస్ పార్టీ | వి.ప్రభాకర్ | జనతా పార్టీ |
1983 | సొత్కు సంజీవరావు | తెలుగుదేశం పార్టీ | కె.దేవకి దేవి | కాంగ్రెస్ పార్టీ |
1985 | బోడ జనార్థన్ | తెలుగుదేశం పార్టీ | కె.దేవకి దేవి | కాంగ్రెస్ పార్టీ |
1989 | బోడ జనార్థన్ | తెలుగుదేశం పార్టీ | కోదాటి ప్రదీప్ | కాంగ్రెస్ పార్టీ |
1994 | బోడ జనార్థన్ | తెలుగుదేశం పార్టీ | సొత్కు సంజీవరావు | కాంగ్రెస్ పార్టీ |
1999 | బోడ జనార్థన్ | తెలుగుదేశం పార్టీ | జి.వినోద్ | కాంగ్రెస్ పార్టీ |
2004 | జి.వినోద్ | కాంగ్రెస్ పార్టీ | బోడ జనార్థన్ | తెలుగుదేశం పార్టీ |
2009 | నల్లాల ఓదేలు | తెలంగాణ రాష్ట్ర సమితి | జి.వినోద్ | కాంగ్రెస్ పార్టీ |
2014 | నల్లాల ఓదేలు | తెలంగాణ రాష్ట్ర సమితి | జి.వినోద్ | కాంగ్రెస్ పార్టీ |
2018 | బాల్క సుమన్ | తెలంగాణ రాష్ట్ర సమితి | బోర్లకుంట వెంకటేశ్ నేత | కాంగ్రెస్ పార్టీ |
2023[1] | జి. వివేకానంద్ | కాంగ్రెస్ పార్టీ | బాల్క సుమన్ | భారత రాష్ట్ర సమితి |
2004 శాసనసభ ఎన్నికలలో చెన్నూర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి జి.వినోద్ సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడ జనార్థన్ పై 36781 ఓట్ల మెజారిటితో గెలుపొందినాడు. జి.వినోద్ 77240 ఓట్లు సాధించగా, బోడ జనార్థన్ 40459 ఓట్లు పొందినాడు.
|
|
|
1999లో బోడ జనార్థన్ వరుసగా నాలుగవ సారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయగా జి.వినోద్ కామ్గ్రెస్ తరఫున పోటీ చేశాడు. బోడ జనార్థన్ 42.57% ఓట్లు పొంది 4వ సారి విజయం సాధించగా, జి.వినోద్ 36.14% ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు. సి.పి.ఐ. 16.72% ఓట్లతో మూడవ స్థానం పొందినది.
1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బోడ జనార్థన్ వరుసగా మూడవ సారి బరిలోకి దిగగా, 65.78% ఓట్లతో భారీ ఆధిక్యతతో సమీప ప్రత్యర్థి ఎస్.సంజీవరావుపై విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 2.47% ఓట్లు పొందగా, బహుజన్ సమాజ్ పార్టీ 2.7% ఓట్లు పొందినది.
2023 లో మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజక వర్గం లో అసెంబ్లీ ఎన్నికలు 30 నవంబర్ 2023 లో జరిగినాయి.ఫలితము 3 డిసెంబర్ 2023 న ఫలితాలు వెలువడినాయి.ఈ నియోజక వర్గంలో ప్రధనంగా మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ , భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి ఈ ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరి సాగింది. చివరికు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేకానంద్ 37,525 ఓట్ల మెజారిటీతో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి బాల్క సుమన్ పై విజయం సాధించారు.చెన్నూర్ నియోజక వర్గంలో మొత్తం రౌండ్లో వారీగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కౌంటింగ్ నిర్వహించారు.మొత్తం 15 మంది అభ్యర్థులు పోటిలో ఉండగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేకానంద్ కు 87,541 ఓట్లు 57.51% , భారత రాష్ట్ర సమితి అభ్యర్థి బాల్క సుమన్ కు 50,026 ఓట్లు 32,86%, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దుర్గం ఆశోక్ కు 3,375 ఓట్లు 2.22 ,నోటాకు 1,792 ఓట్లు 1,18% వచ్చాయి.భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేకానంద్ 37,515 ఓట్లు మెజారిటీతో ఘన విజయం సాధించాడు.చెన్నూర్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా గెలుపు పత్రం అందుకున్నాడు[2].
క్రమసంఖ్య | అభ్యర్థి పేరు | అభ్యర్థి పార్టీ | సాధించిన ఓట్లు | శాతం |
---|---|---|---|---|
1 | గడ్డం వివేకానంద్ | భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ | 87,541 | 57,51% |
2 | బాల్క సుమన్ | భారత రాష్ట్ర సమితి పార్టీ | 50,026 | 32,86% |
3 | దుర్గం ఆశోక్ | భారతీయ జనతా పార్టీ | 3,375 | 2,22% |
4 | నోటా | నోటా | 1,792 | 1.18% |
5 | అసంపల్లి సంపత్ కుమార్ | ఇండిపెండింట్ పార్టీ | 1,444 | 0.95% |
6 | దాసరపు శ్రీనివాస్ | బీఎస్ పి | 1,398 | 0.66% |
7 | నందిపాటి రాజు | డిహెచ్ ఎస్ పి | 948 | 0.62% |
ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలే ప్రధాన పక్షాలుగా ఉన్నాయి. మూడవ పార్టీ అంతగా బలపడలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం ఆ పార్టీ ఈ నియోజకవర్గంలో మంచి ఉనికిని చూపింది. 1983 తరువాత ఇప్పటి వరకు జరిగిన 6 శాసనసభ ఎన్నికలలో 5 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా, 2004లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు జరిగిన 10 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు చెరో ఐదు సార్లు విజయం సాధించాయి.[3] తెలుగుదేశం పార్టీకి చెందిన బోడ జనార్థన్ ఇక్కడి నుండి 4 సార్లు విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన కోదాటి రాములు మూడు సార్లు గెలుపొందినాడు.2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ రంగంలో ఉండటంతో మూడు ప్రధాన పార్టీల మధ్య బలమైన పోటీ జరిగే అవకాశముంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.