From Wikipedia, the free encyclopedia
చుట్టాలున్నారు జాగ్రత్త 1980 లో వచ్చిన సినిమా. బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కృష్ణ, శ్రీదేవి నటించారు . హత్యకు పాల్పడిన వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిజమైన హంతకులను కనుగొనడంలో అతనికి సహాయపడే అతనిలాగే ఉండే వ్యక్తి గురించి ఉంటుంది. ఈ చిత్రం 1980 ఆగస్టు 8న విడుదలై వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఇది తమిళంలో పోక్కిరి రాజా (1982) గా, హిందీలో మావాలి(1983)గా పునర్నిర్మించారు.
చుట్టాలున్నారు జాగ్రత్త (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.వి. ప్రసాద్ |
తారాగణం | కృష్ణ, శ్రీదేవి, రావు గోపాలరావు |
సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
నిర్మాణ సంస్థ | అమృతా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఒక పారిశ్రామికవేత్త కుమార్తె, పారిశ్రామికవేత్త కర్మాగారంలోని మేనేజరూ ప్రేమలో పడతారు. పారిశ్రామికవేత్త యొక్క అత్యాశ బంధువు తన కొడుక్కు ఆ అమ్మాయినిచ్చి పెళ్ళి చెయ్యాలని అనుకుంటాడు. ఆ తండ్రీ కొడుకులు పారిశ్రామికవేత్తను హత్య చేస్తారు. నేరాన్ని ఫ్యాక్టరీ మేనేజరుపై వేస్తారు జైలులో, అతను తనలాగే ఉన్న వ్యక్తిని కలుస్తాడు. వారిద్దరూ కలిసి నిజమైన హంతకులను చట్టానికి పట్టిస్తారు.
సౌండ్‌ట్రాక్‌ను ఎంఎస్ విశ్వనాథన్ స్వరపరిచారు.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.