Remove ads
కర్ణాటక లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో చిక్కబళ్ళాపూర్ జిల్లా ఒకటి. చిక్కబళ్ళాపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.2007లో కోలార్ జిల్లాలోని గౌరిబిద్నూర్, బగెపల్లి, చికబల్లపూర్, సిద్లగట్ట, చింతామణి తాలూకాలను వేరుచేసి చిక్కబళ్ళాపూర్ జిల్లా రూపొందించబడింది. నార్త్ సౌత్ సిక్స్ లైన్ జాతీయరహదారి - 7, తూర్పు - పడమర రహదారి - 58 జిల్లా గుండా పయనిస్తున్నాయి. బెంగుళూరు నుండి చిక్కబళ్ళాపూర్, దొడ్డగంజూర్, శ్రీనివాసపూర్, కోలార్ వరకు రైలు మార్గం ఉంది.
పట్టణాలు ముద్దెనహళ్ళి ప్రఖ్యాత ఇంజనీర్, స్టేట్స్‌మన్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యా జన్మస్థలం. ఇక్కడ సత్యసాయిబాబా విశ్వవిద్యాలయం (కనివెనారాయణపురా) ఉంది.
మరిగౌడ పురాణం అనుసరించి " అవంతిమాలా కుమారుడు బైరిగౌడ ఒకరోజు వేటకొరకు కొడిమంచన హళ్ళి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ వేటకుక్కల ఎదురుగా ధైర్యంగా నిలిచిన ఒక కుందేలును గమనించాడు. అది చూసి ఆశ్చర్యచకితుడైన రాజప్రతినిధి తన కుమారుడితో ఇక్కడి ప్రజల ధైర్యసాహసాలకు ఇది సంకేతం అని చెప్పడు. తరువాత విజయనగ చక్రవర్తి అనుమతితో అక్కడ ఒక కోటను, పట్టణం నిర్మించాడు. అది తరువాత చిక్కబళ్ళాపూర్ పట్టణంగా అభివృద్ధి చెందింది. బైచిగౌడ పాలనా సమయంలో మైసూరు ఆధీనంలో ఉన్న ఈ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 1762 లో చిక్కప్పనాయకా పాలనా సమయంలో ఈ పట్టణం మూడు మాసాలకాలం హైదర్ అలీ ఆధీనంలో ఉంది. హైదర్ ఆలీ సైన్యాలను చిక్కబళ్ళాపూర్ పట్టణం నుండి వెనుతీయడానికి చిక్కాప్పనాయకా 5లక్షల పకోడాలు ఇచ్చాడు.
చిక్కప్పనాయకా తరువాత గూటీకి సంబంధించిన మౌరాయ సాహాయంతో తన అధికారాన్ని తిరిగి పొదడానికి ప్రయత్నించాడు. ఆయన చిక్కప్పనాయకాతో నంది హిల్స్ వద్ద తలదాచుకున్నాడు. వెంటనే హైదర్ అలీ చిక్కబళ్ళాపూర్ను స్వాధీనం చేసుకుని చిక్కప్పనాయకాను ఖైదు చేసాడు. లార్డ్ కార్న్‌వాల్స్ జోక్యంతో చిక్కబళ్ళాపూర్ నారాయణగౌడాకు స్వాధీనం చేయబడింది. చిక్కబళ్ళాపూర్‌కు 18 కి.మీ దూరంలో ఉన్న పెరెసంద్ర శివాలయాన్ని సందర్శించాడని లార్డ్ కార్న్ వాల్స్ దర్శించాడని కొన్ని ఆధారాలు తెలియజేస్తున్నాయి. తరువాత విషయం తెలుసుకున్న టిప్పు సుల్తాన్ చిక్కబళ్ళాపూర్ మీద ఆధిపత్యాన్ని కోరాడు. బ్రిటిష్, టిప్పు సుల్తాన్‌కు చిక్కబళ్ళాపూర్ కొరకు జరిగిన యుద్ధం తరువాత టిప్పు సుల్తాన్ అపజయం అనుసరించి బ్రిటిష్ నంది హిల్స్‌ను స్వాధీనం చేసుకుని చిక్కబళ్ళాపూర్ పాలన నారయణగౌడాకు వదిలిపెట్టింది.తరువాత తిరిగి టిప్పు, బ్రిటిష్ ప్రభుత్వానికి మద్య జరిగిన యుద్ధంలో నారయణగౌడా చిక్కబళ్ళాపూర్ మీద ఆధిక్యాన్ని కోల్పోయాడు. తరువాత టిప్పు సుల్తాన్ బ్రిటిష్ ప్రభుత్వం చేతిలో ఓడిన తరువాత చిక్కబళ్ళాపూర్ మైసూరు పాలకులైన ఉడయార్ల ఆధీనంలోకి మారింది. తరువాత కర్ణాటక రాష్ట్రంలో భాగంగా మారింది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,254,377, [1] |
ఇది దాదాపు. | ట్రినిడాడ్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | న్యూ హాంప్‌షైర్ నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 385 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 9.17%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 2981 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | 968:1000, [1] |
అక్షరాస్యత శాతం. | 70.08%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.