ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి.సి.ఇ గ్రూపులో దోభీ ముస్లిం, ముస్లిం దోభీ, ధోబి ముసల్మాన్, తురక చాకలి, తురక చాకల, తురుక సాకలి, తురక వన్నార్, చాకల, సాకలా, చాకలా, ముస్లిమ్ రజకులు పేర్లతో పిలువబడుతున్నారు[1]. తురక చాకలి కులస్తులు ఆకివీడులో నేటికీ ఉన్నారు. ఉర్దూ మాట్లాడుతారు. మసీదుకు వెళతారు. చాకలి పని చేస్తారు. చాకలివాళ్ళతో వివాహ సంబందాలు కూడా కలిగి ఉంటారు. ముస్లింల సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను వెనుకబడిన తరగతుల జాబితాలో ప్రస్తుతం ఉన్న ఎ, బి, సి, డి వర్గాలకు అదనంగా ఇ” కేటగిరీగా చేర్చారు. దీనికి ప్రభుత్వ ఉత్తర్వు G.O.Ms.No. 23, వెనుకబడిన తరగతుల సంక్షేమం (సి 2), 7 జూలై, 2007 వెలువడింది.[2]

మూలాలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.