చల్లా వెంకట్రామ్ రెడ్డి

From Wikipedia, the free encyclopedia

చల్లా వెంకట్రామిరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అలంపూర్ నియోజకవర్గం నుండి 2004లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2] ఆయన 2022 డిసెంబర్ 9న భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[3]

త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
చల్లా వెంకట్రామిరెడ్డి

ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చి 2023 - 29 మార్చి 2029
ముందు రావుల రవీంద్రనాథ్ రెడ్డి
తరువాత వి.ఎం. అబ్రహం
నియోజకవర్గం శాసనసభ సభ్యులు కోటా

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - 2009
నియోజకవర్గం అలంపూర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1970
పుల్లూరు, ఉండవెల్లి మండలం, జోగులాంబ గద్వాల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు నిర్మల, చల్లా రాంభూపాల్ రెడ్డి
బంధువులు నీలం సంజీవరెడ్డి (తాత)
వృత్తి రాజకీయ నాయకుడు
మూసివేయి

రాజకీయ జీవితం

చల్లా వెంకట్రామిరెడ్డి భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి మనవడు (కూతురి కుమారుడు). ఆయన తన సొంత గ్రామమైన పుల్లూరు సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 2004లో అలంపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] చల్లా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. ఆ తర్వాత వైఎస్సార్‌ పార్టీలో చేరి, అలంపూర్‌ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ 2022 డిసెంబర్ 9న భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[5]

తెలంగాణ శాసనమండలికి మార్చి 2023లో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పేరును మార్చి 7న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా[6] ఆయన 9న నామినేషన్ దాఖలు చేశాడు.[7] 16 మార్చి నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముగియడంతో బరిలో ఎవరు లేకపోడడంతో చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించి ఆయనకు ధ్రువీకరణ పత్రాలు అందజేశాడు.[8]

చల్లా వెంకట్రామిరెడ్డి 2023 మార్చి 31న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[9]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.