Remove ads
From Wikipedia, the free encyclopedia
చంద్రగుప్త మౌర్యుడు (మౌర్యుడు) (సంస్కృతం: चन्द्रगुप्त मौर्य) మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. ఆయన తన తల్లి ముర పేరు మీదుగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్త మౌర్యుడు భారతదేశం మొత్తం ఒక రాజ్యంగా పరిపాలించడంలో సఫలీకృతుడైనాడు. చంద్ర గుప్తుడు మొట్ట మొదటిసారిగా భారతదేశమంతటినీ ఏకం చేసి నిజమైన చక్రవర్తి అనిపించుకున్నాడు. గ్రీకు లేదా లాటిన్ సాహిత్యంలో చంద్రగుప్తుని శాండ్రోకుప్టసు అని వ్యవహరిస్తారు.
చంద్రగుప్త మౌర్యుడు (పాలన: సాధారణ యుగానికి ముందు . 321 - సాధారణ యుగానికి ముందు . 297) ప్రాచీన భారతదేశాన్ని పాలించాడు. ఆయన భారత ఉపఖండంలో ఇప్పటివరకు అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకదాన్ని నిర్మించి తరువాత జైన వర్గాల ఆధారంగా ఆయన అన్నింటినీ త్యజించి జైన సన్యాసి అయ్యాడు. చంద్రగుప్త జైన మతాన్ని స్వీకరించి మొదట తన సంపద, శక్తిని త్యజించడం ద్వారా, జైన సన్యాసి ఆచార్య భద్రాబాహుతో కలిసి వెళ్లి, ఉపవాసం ద్వారా మరణాన్ని శాంతియుతంగా స్వాగతించే కర్మను నిర్వహించడాని చారిత్రక జైన గ్రంథాలు పేర్కొన్నాయి.[note 1] చంద్రగుప్తుడి జీవితం, విజయాలు పురాతన హిందూ, బౌద్ధ, గ్రీకు గ్రంథాల ద్వారా లభిస్తున్నప్పటికీ జైన గ్రంథాల వివరాలు గణనీయంగా మారుతాయి.[2] మెగాస్టీనెసు చంద్రగుప్త మౌర్యుడి రాజసభలో గ్రీకు రాయబారిగా 4 సంవత్సరాలు పనిచేశాడు.
వివిధ ఇతిహాసాల ఆధారంగా చంద్రగుప్తుడు తన ముఖ్యమంత్రి చాణక్య (కౌటిల్య అని కూడా పిలుస్తారు) సలహాతో ఒక కొత్తసామ్రాజ్యాన్ని సృష్టించి స్టాట్క్రాఫ్టు సూత్రాలను వర్తింపజేశాడు. తరువాత మౌర్యచంద్రగుప్తుడు గొప్ప సైన్యాన్ని నిర్మించి తన సామ్రాజ్య సరిహద్దులను విస్తరించాడు. చంద్రగుప్తుడు గ్రీకువీరుడైన మొదటి సెల్యూకసు నికేటరు భారతీయ సాట్రాపీలలోకి విస్తరించడానికి వివాహ కూటమిని ఏర్పరుచుకున్నాడు. చంద్రగుప్తుడి సామ్రాజ్యం దాదాపు భారత ఉపఖండం అంతటా విస్తరించి ఉంది. దక్షిణాది ప్రాంతాలు (ప్రస్తుత తమిళనాడు, కేరళ), కళింగ (ప్రస్తుత ఒడిశా) మినహా. భారతదేశంలో ఎక్కువ భాగాన్ని ఏకం చేసిన తరువాత చంద్రగుప్తుడు, చాణక్యుడు పెద్ద ఆర్థిక, రాజకీయ సంస్కరణలను ఆమోదించారు. పాటలీపుత్ర (ఇప్పుడు పాట్నా)ను రాజధానిగా చేసుకుని చంద్రగుప్తుడు బలమైన కేంద్ర పరిపాలనను స్థాపించాడు. చంద్రగుప్తుడి భారతదేశం సమర్థవంతమైన అత్యంత వ్యవస్థీకృత నిర్మాణాన్ని కలిగి ఉంది. సామ్రాజ్యం నీటిపారుదల, దేవాలయాలు, గనులు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలను నిర్మించింది. ఇది బలమైన ఆర్థిక వ్యవస్థకు దారితీసింది. చంద్రగుప్తుడి పాలనలో, ఆయన రాజవంశం సమయంలో బౌద్ధమతం, జైన మతం, అజీవకా బ్రాహ్మణిజం సంప్రదాయాలు ప్రాముఖ్యతను సంతరించుకుని భారతదేశంలో అనేక మతాలు అభివృద్ధి చెందాయి.[3] కర్ణాకటలోని శ్రావణబేలగోలలోని చంద్రగిరి కొండపై చంద్రగుప్త మౌర్యుని స్మారకం ఉంది.
చంద్రగుప్తుని పూర్వీకుల గురించి కొద్దిగా కూడా కచ్చితమైన సమాచారం లేదు. వివిధ చరిత్రకారులు వివిధ రకాలైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. చాలామంది భారతీయ చరిత్రకారులు చంద్రగుప్తుడ. సాహిత్యం ప్రకారం చంద్రగుప్తుడు నెమళ్ళను పెంచేవారి (సంస్కృతం: మయూర పోషక) చేతిలో పెంచబడ్డాడు కాబట్టి మౌర్య వంశానికి ఆ పేరు వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు. బౌద్ధ సంప్రదాయము, జైన సంప్రదాయములు రెండూ ఈ నెమలి (మయూర) శబ్దానికీ, మౌర్య శబ్దానికి సంబంధం ఉన్నట్లు నిరూపిస్తున్నాయి.
వివిధ వనరులు చంద్రగుప్త వంశపారంపర్యత, ప్రారంభ జీవితం గురించి వేర్వేరు ఆధారాలు అందిస్తాయి.[4] బౌద్ధమత సంప్రదాయ గ్రంథాల వంటి ఇతర గ్రంథాలు చంద్రగుప్తుడిని గొప్ప క్షత్రియ మూలం కలవాడని వివరిస్తుంది. గౌతమ బుద్ధుని శాక్య వంశానికి చెందిన ఒక శాఖ అయిన మోరియా వంశానికి చెందిన వంశీకుడిగా అతన్ని వర్ణించారు.[5] కోసల రాజు విదుదాభా దాడి తరువాత మోరియా వారి పూర్వీకుల రాజ్యాన్ని విడిచి వెళ్ళి నెమళ్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో స్థిరపడ్డాడు. నెమళ్ళు (పాలి భాషలో "మోరా") నివసించిన ప్రాంతంలో నివసించినందున వారు "మోరియాలు" అని పిలువబడ్డారు. మహా-బోధి-వంసా మోరియా రాజధానిని మోరియా-నగరా అని, దిఘ-నికాయ ఈ ప్రాంతానికి పిప్పలి-వనా అని పేరు పెట్టారు. [6] ఈ పురాణ వైవిధ్యం బర్మా గ్రంథాలలో ప్రస్తావించబడింది. అడ్జతాతతు (బహుశా అజతాశత్రు) ఊచకోత నుండి తప్పించుకున్న వైశాలి యువరాజులకు మోరియా-నగరా పుర్వీకతను ఆపాదించాడు.[7]
జైన సంప్రదాయ గ్రంథం పారిషిష్టపార్వనులో చంద్రగుప్తుడి తల్లి రాజుకు చెందిన నెమళ్ళను పెంచడంలో ప్రసిద్ధి చెందిన ఒక సమాజ అధిపతి కుమార్తె అని నమోదు చేయబడింది.[6] చంద్రగుప్తుడు " సేవకవృత్తికి చెందిన జీవితంలో జన్మించినప్పటికీ చక్రవర్తి పదవిని ఆశించమని ప్రేరేపించబడ్డాడు" అని జస్టిను పేర్కొన్నాడు.[8] కొన్ని పురాణ గ్రంథాలలో మౌర్యాలను అధికంగా శూద్రులు, అన్యాయులు (శూద్ర-ప్రార్థస్తవ్-ఓధర్మికా) గా వర్ణించారు.[9]మార్కండేయ పురాణం వాటిని అసురులుగా ముద్రవేస్తుంది. బౌద్ధమతం, జైన మతం పట్ల మౌర్య రాజుల మొగ్గు దీనికి కారణమని ఇటువంటి ప్రతికూల చిత్రణలు చెప్పవచ్చు.[10] కథసరిత్సగర, బృహతు-కథ-మంజారి గ్రంథాలలో నమోదు చేయబడిన కాశ్మీరీ సంప్రదాయ గ్రంథాల ఆధారంగా చంద్రగుప్తుడు పూర్వంలో-నందుడి కుమారుడు.[5]
అయినప్పటికీ చరిత్రకారుడు ముఖర్జీ ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ, నాటకంలో "వృషల" అనే పదాన్ని చంద్రగుప్తుడి శత్రువులు మాత్రమే ఉపయోగిస్తారని వాదించారు; నాటకంలోని మరొక భాగం "వృషాల"ను "రాజులలో అత్యుత్తమమైనది" అని అర్ధం. నాటకంలోని అనేక వాక్యాలలో దీనిని చాణక్య ప్రేమపూర్వక పదంగా ఉపయోగిస్తారు. నాటకంలో "కులా-హినా" అనే పదాన్ని చంద్రగుప్తుడు వినయపూర్వకమైన "క్షత్రియా" నేపథ్యం నుండి వచ్చాడని అర్ధం అని ముఖర్జీ వాదించాడు. ముద్రారాక్షసం చాలా తరువాతి మూలం అని అందువల్ల తక్కువ విశ్వసనీయతగా పరిగణించాలని కూడా ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు నందులను తక్కువ-స్థాయి పుట్టుకతో ముద్రించిన మునుపటి మూలాల (పురాణాలు వంటివి) కాకుండా ముద్రరాక్ష నందులు "విశిష్టమైన వంశ శూద్రులు" అని పేర్కొన్నారు.
ముద్రరాక్షసం మీద 18 వ శతాబ్దపు వ్యాఖ్యాత ధుండిరాజా చంద్రగుప్త మౌర్యుడు అనే రాజు కుమారుడని పేర్కొన్నాడు. మౌర్యుడు సరవత-సిద్ధి అనేరాజు చిన్న భార్య రాణి ముర కుమారుడు. ముర "వృషల" కుమార్తె. తొమ్మిది మంది నంద రాజులు కూడా సరవత-సిద్ధి కుమారులు, కానీ వారు వారు రాజు పెద్దభార్య రాణి సునంద (క్షత్రియకాంత) కుమారులు.[11] రాజ్య సైన్యాన్ని నడిపించడానికి సరవత-సిద్ధి తన నంద కుమారులను అధిగమించి మౌర్యుడిని ఎన్నుకున్నాడు. కాని నందకుమారులు చంద్రగుప్తుడిని మినహాయించి మౌర్యుడిని, ఆయన కుమారులు అందరినీ హత్య చేశారు. చంద్రగుప్తుడు తప్పించుకుని వెళ్ళి నందాల శత్రువు అయ్యాడు. [12]
గ్రీకు రచయిత ఫైలార్కసు (సాధారణ యుగం ముందు/BCE. 3 వ శతాబ్దం) (ఎథీనియసు ఉదహరించబడ్డాడు) చంద్రగుప్తుడిని "సాండ్రోకోప్టోసు" అని పేర్కొన్నాడు. తరువాతి గ్రీకో-రోమను రచయితలు స్ట్రాబో, అరియను, జస్టిను (సుమారు 2 వ శతాబ్దం) ఆయనను "సాండ్రోకోటసు" అని పేర్కొన్నారు. [13]గ్రీకు, లాటిను వృత్తాంతాలలో చంద్రగుప్తుడు సాండ్రాకోట్టోసు, ఆండ్రోకోటసు అని పేర్కొనబడింది. (Greek: Ανδροκόττος).[14][15]
ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకంలో రాజు చంద్రగుప్తుడిని "చందా-సిరి" (చంద్ర-శ్రీ), "పియాడంసనా" (ప్రియ దర్శనం), వృషాల పేర్కొనబడ్డాడు.[13] పియాడంసనా ఆయన మనవడు అశోకుడు పియాదాసికి సమానం.[16] సాంప్రదాయేతర వ్యక్తులను సూచించడానికి భారతీయ పురాణాలలో, న్యాయ గ్రంథాలలో "వృషల" అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఒక సిద్ధాంతం ప్రకారం ఇది గ్రీకు రాజ శీర్షిక బాసిలియసు నుండి ఉద్భవించి ఉండవచ్చు. కానీ దీనికి కచ్చితమైన ఆధారాలు లేవు: భారతీయ వనరులు దీనిని అనేక రాజకుంటుంబానికి చెందని వారికి, ముఖ్యంగా సంచరిస్తున్న గురువులకు, సన్యాసులకు వర్తిస్తాయి.[17]
చంద్రగుప్తుని యవ్వనం గురించి ఏ సమాచారమూ అందుబాటులో లేదు. ఇప్పుడు తెలిసిన సమాచారమంతా తరువాతి సంస్కృత, గ్రీకు, లాటిన్ రచనల ఆధారంగా సేకరించినవే.
భారతీయుల సాంప్రదాయం ప్రకారం తక్షశిల విశ్వవిద్యాలయం లో ఆచార్యుడైన చాణక్యుడు అనే గురువుకు అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర సమయంలో తూర్పు భారతదేశానికి చెందిన మగధ సామ్రాజ్యంలో దొరికాడని చెపుతారు. ఒక కథ ప్రకారం చంద్రగుప్తుడు చిన్న పిల్లవాడిగా ఉన్నపుడు వారి ఆటలలో చంద్రగుప్తుడు రాజుగా వ్యవహరించేవాడు. ఈ కథల్లో నేరాలు చేసేవారికి శిక్షలు వేసి న్యాయం జరిపించేవాడు. చాణక్యుడు చంద్రగుప్తుని తెలివితేటలనూ ధర్మ సూక్ష్మతనూ చూసి అచ్చెరువొందాడు. చంద్రగుప్తుడి తల్లితో అతడిని తక్షశిల విద్యాలయానికి పంపించమని కోరాడు. అందుకు ఆమె అంగీకరించడంతో అతడు అక్కడే విద్యనభ్యసించాడు. వీరు కూడా చంద్రగుప్తుని పూర్వీకులు రాజుగారి దాసీలకు పుట్టిన వారనీ, అతని తల్లి ముర పేరు మీదగానే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపన చేశాడని నమ్ముతున్నారు.
సింహళ బౌద్ధ సంప్రదాయగ్రంధాల ఆధారంగా మోరియా వంశానికి అధిపతి అయిన చంద్రగుప్తుడు తండ్రి ఆయన తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు యుద్ధంలో మరణించాడు. అతని తల్లి తన సోదరుల రక్షణలో పుప్పా-పురా (పుష్ప-పురా, "ఫ్లవర్ సిటీ") నగరానికి పారిపోయింది. ఈ నగరాన్ని పాటలీపుత్రగా గుర్తించారు. దీనిని కుసుమ-పురా అని కూడా పిలుస్తారు (దీని అర్థం "పూల నగరం" అని కూడా అర్ధం). ఆయన భద్రత కోసం, చంద్రగుప్తుడి మామలు ఆయనను ఒక పశువులశాలకు తరలించారు. అక్కడ ఆయన ఒక పశువులకాపరిగా జీవించాడు. చంద్రగుప్తుడు పెరుగుతున్న సమయంలో పశువులకాపరి చంద్రగుప్తుడిని ఒక వేటగాడికి విక్రయించాడు. వేటగాడు చంద్రగుప్తుడిని పశువులను పోషించడానికి నియమించాడు.[18][7]
జస్టిను అభిప్రాయం ఆధారంగా చంద్రగుప్తుడు ("సాండ్రోకోటసు") తన అగౌరవ ప్రవర్తనతో నందరాజును ("నండ్రం" లేదా "నండ్రసు") కించపరిచాడు. దీని కారణంగా రాజు అతన్ని చంపమని ఆదేశించాడు.[8] చంద్రగుప్తుడు తప్పించుకుని తిరుగుబాటుదారుడయ్యాడు.[19] జస్టిను రచనల ఆధారంగా కొన్ని ప్రారంభ ముద్రిత సంచికలు "అలెగ్జాండ్రం"కు బదులుగా " నడ్రం " ను తప్పుగా పేర్కొన్నాయి; ఈ లోపం ఫిలాలజిస్టు జె.డబల్యూ మెక్‌క్రిండిలె 1893 అనువాదంలో సరిదిద్దబడింది. 20 వ శతాబ్దంలో చరిత్రకారులు హేం చంద్ర రాయచౌదరి, ఆర్. సి. మజుందార్ "అలెగ్జాండ్రం" సరైన పఠనం అని విశ్వసించారు. జస్టిను చంద్రగుప్తా, అలెగ్జాండరు ది గ్రేటు ("అలెగ్జాండ్రం") మధ్య జరిగిన సమావేశాన్ని సూచిస్తున్నారని సిద్ధాంతీకరించారు. అయినప్పటికీ ఇది తప్పు: మునుపటి శతాబ్దంలో చరిత్రకారుడు ఆల్ఫ్రెడు వాను గుట్ష్మిడు చేసిన పరిశోధనలో "నాండ్రం" అనేది బహుళ వ్రాతప్రతులు మద్దతు ఇవ్వబడిన సరైన పఠనం అని తేలింది: ఒకే లోపభూయిష్ట వ్రాతప్రతులు మాత్రమే "అలెగ్జాండ్రం" గురించి ప్రస్తావించాయి.[20]
జస్టిను చంద్రగుప్తుడు, జంతువులతో సంబంధం ఉన్న పలు సంఘటనల గురించి ప్రస్తావించాడు. మొదటి సంఘటనలో నంద్రం నుండి తప్పించుకున్న తరువాత చంద్రగుప్తుడు నిద్రపోతున్నప్పుడు ఒక పెద్ద సింహం ఆయన వద్దకు వచ్చి ఆయనను మెల్లగా నాలుకతో నాకి మేల్కొల్పిం తరువాత వెళ్లిపోయింది. రెండవ సంఘటనలో చంద్రగుప్తుడు అలెగ్జాండర సైనికులతో యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక పెద్ద అడవి ఏనుగు అతని వద్దకు వచ్చి మచ్చిక చేసుకుని యుద్ధంలో అతనికి మార్గనిర్దేశం చేసింది.[21] రేచౌదరి అభిప్రాయం ఆధారంగా ఈ కథనాలు జస్టిను బౌద్ధ ఇతిహాసాల గురించి తెలుసుకున్నాయని సూచిస్తున్నాయి. ఇందులో చంద్రగుప్తుడు వేటగాడుతో ఉన్న అనుబంధాన్ని పేర్కొన్నాడు.[7]
నంద రాజవంశాన్ని పడగొట్టడంలో చంద్రగుప్తుని గురువు చాణక్య ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడని పురాతన భారతీయ వర్గాలు సూచిస్తున్నాయి.[22] బౌద్ధ సంప్రదాయ గ్రంథాల ఆధారంగా చాణక్యుడు ("తక్షశిల") కు చెందినవాడు. ఆయన అభ్యాసకుడుగా పాటలీపుత్రకు వచ్చాడు.[23] పాటలీపుత్ర రాజు " రాజు ధన నంద " తన వికారమైన శారీరక రూపానికి అవమానించాడు. బదులుగా చాణుక్యుడు నంద రాజవంశాన్ని నాశనం చేస్తానని ప్రమాణం చేశాడు. [24] తదనంతరం ఆయన చంద్రగుప్తుడిని చూడటం జరిగింది. ఆయన ఇతర అబ్బాయిలతో ఆడుకునే సమయంలో రాజుగా నటించేవాడు. ఈ ఆటలో భాగంగా చంద్రగుప్తుడు హాస్యభరితమైన రాజసభలను నిర్వహించి అక్కడ ఆయన తీర్పులు ఇచ్చేవాడు. ఈ హాస్యభరితమైన కోర్టులలో చాణక్యుడిని చంద్రగుప్తుడిని చూసి ఆయన నాయకత్వ లక్షణాలకు ముగ్ధుడయ్యాడు. తరువాత చంద్రగుప్తుడి తండ్రి వేటగాడైన పెంపుడు-తండ్రికి 1,000 కార్షపానాలు (నాణేలు) చెల్లించి ఆయనను కొన్నాడు. తరువాత ఆయన చంద్రగుప్తుడిని తక్షశిలకు తీసుకువెళ్ళాడు. ఇది విద్యాభ్యాసానికి అత్యంత ప్రసిద్ధి చెందింది. అది బాలుడికి 8-9 సంవత్సరాలు సమస్త విద్యలను ఇచ్చింది.[18] రాజు అవమానించినట్లు భావించిన చాణుక్యుడు నందరాజవంశాన్ని నాశనం చేస్తానని ప్రమాణం చేశాడని ముద్రాక్షసంలో పేర్కొన్నాడు.[24] గ్రీకో-రోమను రచయిత ప్లూటార్కు తన " లైఫ్ ఆఫ్ అలెగ్జాండరు "లో చంద్రగుప్తుడు ("ఆండ్రాకోటసు") అలెగ్జాండరును యువకుడిగా తరువాత నందరాజు అంతగా ప్రజాదరణ పొందలేదని ప్రకటించాడు. అలెగ్జాండరు భారతదేశాన్ని సులభంగా జయించగలడు.[19][25]
చంద్రగుప్తుడు జన్మించినసమయం గురించి పురాతన గ్రంథాలలో ఏదీ ప్రస్తావించలేదు. భారతదేశం మీద దాడి చేసిన సమయంలో (సాధారణ యుగానికి ముందు/BCE 326-325) అలెగ్జాండరును చూసినసమయంలో ఆయన యువకుడని ప్లూటార్కు పేర్కొన్నాడు కనుక ఆయన సి.సాధారణ యుగానికి ముందు/BCE. 350 లో జన్మించాడని భావిస్తున్నారు. [26] చరిత్రకారులు ఇర్ఫాను హబీబు, వివేకానంద చంద్రగుప్త పాలనను సి. సాధారణ యుగానికి ముందు/BCE . 322-298.[22]గ్రీకో-రోమను గ్రంథాల ఆధారంగా అలెగ్జాండరు భారతదేశం మీద దాడి చేసిన కొద్దికాలానికే చంద్రగుప్తుడు అధికారంలోకి వచ్చాడు. అలెగ్జాండరు మరణం తరువాత (సా.శ 323) అలెగ్జాండరు సాత్రపీలమీద దాడి చేశాడు. ఇప్ససు యుద్ధానికి (సాధారణ యుగానికి ముందు/BCE. 301) ముందు మొదటి సెలూకసు నికాటరు చంద్రగుప్తాతో ఒక ఒప్పందాన్ని ముగించాడని కూడా ఈ గ్రంథాలు పేర్కొన్నాయి.[27] ఈ గ్రంథాలు చంద్రగుప్తుడి పాలన ముగింపును సూచించలేదు. కాని భారతీయ సంప్రదాయగ్రంధాలు చంద్రగుప్తకు 24 సంవత్సరాల పాలన చేసాడని సూచిస్తున్నాయి.[28]
బౌద్ధ సంప్రదాయ గ్రంథాలు చంద్రగుప్త అధిరోహణ గౌతమ బుద్ధుని మరణం తరువాత 162 సంవత్సరాల నాటిదని సూచిస్తుంది. బుద్ధుని మరణం సాధారణ యుగానికి ముందు/BCE 544 లో (శ్రీలంక సంప్రదాయ గ్రంథాల ఆధారంగా) సాధారణ యుగానికి ముందు/BCE.486 లో (కాంటోనీసు సంప్రదాయ గ్రంథాల ఆధారంగా) జరిగింది. ఈ విధంగా బౌద్ధ సంప్రదాయ గ్రంథాల ఆధారంగా చంద్రగుప్తుడు సాధారణ యుగానికి ముందు/BCE 382 లేదా సాధారణ యుగానికి ముందు/BCE 324 లో సింహాసనాన్ని అధిష్టించాడు. చారిత్రక ఆధారాలు సాధారణ యుగానికి ముందు/BCE 382 తేదీకి మద్దతు ఇవ్వవు. కాని సాధారణ యుగానికి ముందు/BCE సమకాలీన గ్రీకో-రోమను గ్రంథాలలో ఇచ్చిన తేదీలతో సాధారణ యుగానికి ముందు/BCE 324 తేదీని రాజీ చేయవచ్చు.[29]
హేమచంద్ర పరిష్ఠపార్వను, భద్రేశ్వర కహవళి వంటి జైన రచయితల 12 వ శతాబ్దపు గ్రంథాల ఆధారంగా మహావీరుడు మరణించిన 155 సంవత్సరాల తరువాత చంద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్టించాడు. 14 వ శతాబ్దపు జైన రచయిత మెరుతుంగా తన విచారశ్రేణిలో మహావీర మరణించిన 215 సంవత్సరాల తరువాత ఆరోహణ జరిగిందని పేర్కొన్న ఇతర వనరులను సూచిస్తుంది. మెరుతుంగా కాలక్రమం ఆధారంగా ఈ తేదీ సాధారణ యుగానికి ముందు/BCE 313 కు అనుగుణంగా ఉంటుంది. అయినప్పటికీ మహావీరుడు మరణించిన తేదీ కూడా చర్చనీయాంశంగా ఉంది. జైన రచయితలలో ఏకాభిప్రాయం లేకపోవడం కారణంగా మెరుతుంగా తేదీల కచ్చితత్వం మీద సందేహాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ తేదీ బౌద్ధ సంప్రదాయంతో రాజీపడదు.[29]
Chandragupta Maurya was the founder of the Maurya Empire in ancient India.[30][31]
బౌద్ధమత గ్రంథాలు మహావంశ భాష్యం ఆధారంగా తక్షశిలలో చంద్రగుప్తుడి విద్య పూర్తయిన తరువాత చంద్రగుప్తుడు, చాణక్యుడు వివిధ ప్రాంతాల నుండి సైనికులను సేకరించడం ద్వారా సైన్యాన్ని పెంచారు. చాణక్యుడు, చంద్రగుప్తుడిని ఈ సైన్యానికి నాయకుడిగా చేసాడు.[32] లోహం (ధాతు-వడ) ద్వారా పొందిన సంపదను ఉపయోగించి ఈ సైన్యాన్ని పెంచారని జైన గ్రంథం పారిష్ఠపర్వను పేర్కొంది.[33] జస్టిను ఆధారంగా చంద్రగుప్తుడికి 6 లక్షల (6,00,000) సైనికులు ఉన్నారు.[34] ఆయన అలెగ్జాండరు నుండి తప్పించుకున్న తరువాత సాయుధ వ్యక్తుల సంఘాన్ని ఏర్పాటు చేశాడు. కొన్ని ఆధునిక అనువాదాలు ఈ పురుషులను దొంగలుగా వర్ణించాయి. కాని జస్టిను ఉపయోగించిన అసలు వ్యక్తీకరణ కిరాయి సైనికుడు, వేటగాడు లేదా బందిపోటు అని అర్ధం.[35]
సాధారణ యుగానికి ముందు/BCE 322 లో చంద్రగుప్త సైన్యం నంద రాజధాని పాటలీపుత్రను జయించింది.[8] పాటలీపుత్రలో చంద్రగుప్తుడి పోరాటం గురించిన చారిత్రాత్మకంగా విశ్వసించతగిన ఆధారాలు అందుబాటులో లేవు. శతాబ్దాల తరువాత వ్రాసిన ఇతిహాసాలు అస్థిరంగా ఉన్నాయి. మిలిందపాన్హా వంటి బౌద్ధ గ్రంథాల ఆధారంగా మగధను దుష్ట నందరాజవంశం పాలించింది. చాణక్యుడి సలహాతో చంద్రగుప్తుడు ధర్మాన్ని పునరుద్ధరించడానికి సులభంగా జయించాడు.[36].[37] హిందూ, జైన గ్రంథాల ఆధారంగా నంద రాజవంశం బాగా శిక్షణ పొందిన శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉన్నందున ఈ పోరాటం తీవ్రరూపం దాల్చింది. చంద్రగుప్తా, చాణక్యులు మొదట పొత్తులతో బలీయమైన సైన్యాన్ని నిర్మించారు. [38][37]
మహావంశ భాష్యం ఆధారంగా చంద్రగుప్తా సైన్యం సరిహద్దు ప్రాంతంలోని గ్రామాలను దోచుకుని తరువాత నందా రాజధాని వైపు వెళ్ళింది, కాని ఓడిపోయింది. ఒక మహిళ పిల్లవాడిని ఆహారం మధ్యలో మాత్రమే తినడం, అంచులను వదిలివేయడం చూసిన తల్లి " సరిహద్దు ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ముందు రాజధాని మీద దాడి చేయడానికి ప్రయత్నించిన చంద్రగుప్తుడిలా చేస్తున్నావని " పిల్లవాడిని మందలించడం విని తన తప్పును గ్రహించిన చంద్రగుప్తుడు నందా సామ్రాజ్యం సరిహద్దు వద్ద ఒక కొత్త పోరాటం ప్రారంభించాడు. నందా రాజధానికి వెళ్ళే ముందు క్రమంగా వివిధ సరిహద్దు భూభాగాలను జయించాడు. అయినప్పటికీ స్వాధీనం చేసుకున్న భూభాగాల మీద పాలనను పటిష్ఠం చేయకపోవడం పొరపాటు చేసాడు. దీని పాలకులు అధికారాన్ని తిరిగి పొంది అతని సైన్యం వెనుక భాగంలో దాడి చేసారు.[39] ఆయన స్వాధీనం చేసుకున్న భూభాగాల్లో దండులను ఏర్పాటు చేయడం ద్వారా తన వ్యూహాన్ని మెరుగుపరిచాడు. చివరికి నందా రాజధాని పాటలీపుత్రను ముట్టడించి అక్కడ ఆయన ధనా నంద రాజును చంపాడు. [40]
పారిష్టపర్వనులో పేర్కొన్న ఇదే పురాణం ఆధారంగా చాణుక్యుడు, చంద్రగుప్తుడు నంద రాజ్యంమీద దాడి చేసారని నిర్ధారించాడు. వేడి ఆహారం మధ్యలో వేలు తగలబెట్టిన పిల్లలలాగా అంచుల నుండి తినకుండా అని పిల్లవాడిని మందలించిన తల్లిని చూసి చాణక్యుడు ఙానం తెచ్చుకుని హిమావత్కుట రాజు పర్వతకుడితో పొత్తు పెట్టుకున్నాడు. తరువాత చంద్రగుప్తుడు, చాణక్య సైన్యం క్రమంగా నంద భూభాగాలను స్వాధీనం చేసుకున్నాడు. చివరికి నందరాజధాని పాటలీపుత్ర మీద దాడి చేసింది. నందరాజు ఓడిపోయినప్పటికీ ఆయన ఇద్దరు భార్యలు, కుమార్తెతో పాటలీపుత్రలో సజీవంగా ఉంచడానికి అనుమతించాడు.[41] ఆయన కుమార్తె చంద్రగుప్తుడిని ప్రేమించి, ఆయనను వివాహం చేసుకుంది.[6]
మిలిండా ప్రశ్నలలో ఆక్రమణ సమయంలో నందా సైన్యాధ్యక్షుడుగా భద్రసాల ఉన్నాడని పేర్కొన్నాడు.[42]
ముద్రారాక్షసంలో ఈ విజయం కల్పితంగా ఉంది. దీనిలో చంద్రగుప్తుడు మొదట పంజాబును సొంతం చేసుకున్నాడని, తరువాత చాణక్యుడు సలహా మేరకు పర్వతక అనే స్థానిక రాజుతో పొత్తు పెట్టుకుని నంద సామ్రాజ్యం మీద దాడి చేయడానికి ముందుకు సాగాడని చెబుతారు. [43] ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుండి కిరాయి సైనికుల సహాయంతో, గెరిల్లా యుద్ధ పద్ధతులను ఉపయోగించడం ద్వారా చంద్రగుప్తుడు మగధ రాజధాని కుసుమపుర (ఇప్పుడు పాట్నా) ను ముట్టడించాడు. [42][44] చరిత్రకారుడు పి. కె. భట్టాచార్య, మగధ ప్రారంభ ఏకీకరణ తరువాత భూభాగాలను క్రమంగా స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ సామ్రాజ్యం నిర్మించబడిందని పేర్కొంది.[45]
నందరాజవంశం ముగియడంతో, గంగా మైదానాల వనరులను స్వాధీనం చేసుకోవడానికి చంద్రగుప్తుడు చాణక్యుడు వ్యూహాలను ఉపయోగించాడు.[46] ఒక సామ్రాజ్యాన్ని విస్తరించడానికి, సంఘటితం చేయడానికి, చంద్రగుప్తుడు రాజ్పుతానాలోని సింహాపుర రాజు, కళింగ రాజు (ఆధునిక ఒడిశా) తో పొత్తు పెట్టుకొని ఉండవచ్చు.[47]
అలెగ్జాండరు ది గ్రేటు భారత పోరాటానికి నాయకత్వం వహించిన గ్రీకులు సాధారణ యుగానికి ముందు/BCE 327-325 కాలంలో వాయవ్య భారతదేశం మీద దాడి చేశారు. అలెగ్జాండరు సాధారణ యుగానికి ముందు/BCE 325 లో భారతదేశాన్ని విడిచిపెట్టాడు. కొత్తగా స్వాధీనం చేసుకున్న భూభాగాల నియంత్రణను గ్రీకు గవర్నర్లు, సామంతులకు విడిచిపెట్టాడు.[48]
భారతీయ వ్రాతపూర్వక ఆధారాలు చంద్రగుప్తాకు గ్రీకుల పట్ల ఉన్న శత్రుత్వం గురించి ప్రస్తావించలేదు (భారతీయ సాహిత్యంలో "యవనులు"): నందరాజును తన ప్రధాన ప్రత్యర్థిగా మాత్రమే పేర్కొన్నారు. అయినా జస్టిను చంద్రగుప్తుడిని వాయవ్య భారతదేశంలో అలెగ్జాండరు వారసుల ప్రత్యర్థిగా పేర్కొన్నాడు.[22] అలెగ్జాండరు మరణం తరువాత భారతీయులు ఆయన గవర్నరులను చంపి గ్రీకు పాలన నుండి భారతదేశ స్వేచ్ఛను సాధించిన నాయకుడు సాండ్రోకోటసు (చంద్రగుప్తాతో గుర్తించబడ్డాడు) అని జస్టిను పేర్కొన్నాడు. [8]సాధారణ యుగానికి ముందు/BCE 323-321 నాటికి అలెగ్జాండరు తిరోగమనం జరిగిన కొద్ది సంవత్సరాలలో చంద్రగుప్తుడి సైన్యం వాయవ్య ఉపఖండంలోని గ్రీకు పాలిత నగరాలలో కొన్నింటిని ఓడించింది.[49]అలెగ్జాండరు గవర్నర్లలో ఇద్దరైన నికానోరు, ఫిలిప్లను చంద్రగుప్తుడి కిరాయి సైనికులు హత్య చేసి ఉండవచ్చు.[50][8] ఆయన బహుశా అలెగ్జాండరు సాత్రపీలతో పోరాడాడు. సాధారణ యుగానికి ముందు/BCE 317 నాటికి యుడెమసుతో సహా కొంతమంది పాలకులు ఈ భూభాగాన్ని విడిచిపెట్టాడు; సాధారణ యుగానికి ముందు/BCE 316 లో బాబిలోనుకు బయలుదేరే వరకు పీతాను సింధు నదికి సమీపంలో ఉన్న నగరాలను పరిపాలించాడు.
అలెగ్జాండరు సాధారణ యుగానికి ముందు/BCE 312 లో బాబిలోను రాజధానితో సెలూసిదు రాజ్యాన్ని స్థాపించాడు. ఆసియాలో అలెగ్జాండరు పూర్వ సామ్రాజ్యాన్ని చాలావరకు అలెగ్జాండరు సైన్యాధ్యక్షుడు మొదటి సెల్యూకసు నికాటరు స్వాధీనం చేసుకున్నాడు. తూర్పు భూభాగాలను బాక్ట్రియా, సింధు వరకు ఉన్న భూభాగాలను స్వంత అధికారం కింద ఉంచాడు. [51][52] సాధారణ యుగానికి ముందు/BCE 305 లో ఆయన చంద్రగుప్తుడిని [53] (గ్రీకు సాండ్రోకోటసులో) తో విభేదించాడు:
పొరుగు దేశాల కోసం ఎల్లప్పుడూ వేచి ఉంటూ ఆయుధాలతో బలంగా, కౌన్సిలుతో ఆయన మెసొపొటేమియా, అర్మేనియా, 'సెల్యూసిదు' కప్పడోసియా, పెర్సిసు, పార్థియా, బాక్ట్రియా, అరేబియా, టాపురియా, సోగ్డియా, అరాచోసియా, హిర్కానియా, అలెగ్జాండరు స్వాధీనం చేసుకున్న ప్రక్కన ఉన్న ఇతర ప్రాంతాలను సొంతం చేసుకోవడం ద్వారా ఆయన సామ్రాజ్య సరిహద్దులు (అలెగ్జాండరు తరువాత) ఆసియాలో విస్తృతంగా ఉన్నాయి. ఫ్రిజియా నుండి సింధు వరకు మొత్తం ప్రాంతం సెలూకస్కు లోబడి ఉంది. ఆయన సింధును దాటి, భారతీయుల రాజు సాండ్రోకోటసు (చంద్రగుప్త మౌర్యుడు) తో యుద్ధం చేసి వారు ఒకరితో ఒకరు సంధి చేసుకుని, వివాహ సంబంధాన్ని కుదుర్చుకునే వరకు ఆ ప్రవాహం ఒడ్డున నివసించాడు. ఈ దోపిడీలలో కొన్ని ఆంటిగోనసు మరణానికి ముందు, తరువాత జరిగాయి.
ఆర్. సి. మజుందారు, డి. డి. కోసాంబి అభిప్రాయం ఆధారంగా సింధుకు పశ్చిమాన ఉన్న పెద్ద భూభాగాలను చంద్రగుప్తాకు అప్పగించిన సెలూకసు బలహీనపడినట్లు తెలుస్తుంది. మౌర్య సామ్రాజ్యం అరాచోసియా (కందహారు), గెడ్రోసియా (బలూచిస్తాను), పరోపమిసాడే (గాంధార) లను తన సామ్రాజ్యంలో చేర్చింది.[54][55][a]
స్ట్రాబో అభిప్రాయం శాంతి ఒప్పందాన్ని లాంఛనప్రాయంగా చేయడానికి చంద్రగుప్తుడు సెలూకసుతో వైవాహిక ఒప్పందంలో నిమగ్నమయ్యాడు: [58]
గతంలో పర్షియన్లకు చెందిన సింధు వెంట ఉన్న కొన్ని దేశాలను భారతీయులు ఆక్రమించారు: అలెగ్జాండరు స్వాధీనత కోల్పోయిన తరువాత సెల్యూకసు అక్కడ తన సొంత స్థావరాలను స్థాపించాడు. వివాహ ఒప్పందం (ఎపిగామియా, గ్రీక్: Ἐπιγαμία) పర్యవసానంగా సెలూకసు నికాటరు వాటిని సాండ్రోకోటసుకు ఇచ్చి దానికి బదులుగా ఐదు వందల ఏనుగులను అందుకున్నాడు.
—స్ట్రాబో 15.2.1(9)[59]
నిశ్చితార్థ ఒప్పందం వివరాలు తెలియవు.[60] సెల్యూకసు గురించి లభించే విస్తృతమైన వనరులలో భారతీయ యువరాణి గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. కనుక వైవాహిక కూటమి వేరే విధంగా సాగిందని భావిస్తున్నారు. చంద్రగుప్తా లేదా అతని కుమారుడు బిందుసారా రాజవంశ పొత్తులను ఏర్పరుచుకునే సమకాలీన గ్రీకు విధానానికి అనుగుణంగా ఒక సెలూసిదు యువరాణులను వివాహం చేసుకున్నారు.[61] భారతీయ పురాణ మూలాలు భవిష్య పురాణానికి చెందిన ప్రతిసర్గ పర్వం, చంద్రగుప్తుడికి గ్రీకు ("యవన") యువరాణి, సెలూకసు కుమార్తెతో జరిగిన వివాహం గురించి వివరించింది.[62] ప్రారంభ మౌర్య వంశవృక్షాన్ని ఈ మూలం కచ్చితంగా వివరిస్తుంది:
చంద్రగుప్తుడు పౌసస (యవన రాజు) రాజు సులువా కుమార్తెను వివాహం చేసుకున్నాడు.[63] అందువలన ఆయన బౌద్ధులను, యవనులను కలిపి 60 సంవత్సరాలు పాలించాడు. ఆయన బిందుసారుడికి జన్మనిచ్చాడు. తండ్రి పాలించినంత కాలం బిందుసారుడు కూడా సామ్రాజ్యాన్ని పాలించాడు. అతని కుమారుడు అశోకుడు.(ప్రతిసర్గ పర్వం)[64][65][62]
బదులుగా చంద్రగుప్తుడు సెల్యూకసుకు 500 యుద్ధ ఏనుగులను పంపాడు. ఇది ఇప్ససు యుద్ధంలో సెల్యూకసు విజయంలో కీలక పాత్ర పోషించింది.[66][58][67][68] ఈ ఒప్పందంతో సెల్యూకసు మెగాస్టీనెసును రాయబారిగా చంద్రగుప్తుడి వద్దకు పంపించాడు. తరువాత ఆంటియోకోసు పాట్నాలోని మౌర్య రాజ్యసభకు డీమాకోసును రాయబారిగా చంద్రగుప్తుడి కుమారుడు బిందుసార వద్దకు పంపాడు.[69]
సెల్యూకసు నికేటరు వంటి గ్రీకు పాలకులు ఆయనతో యుద్ధాన్ని నివారించారు. బదులుగా వివాహ కూటమిలోకి ప్రవేశించి వెనక్కితగ్గి పర్షియాలోకి వెళ్ళారు.[70] గ్రీకు వర్గాల సమాచారం ఆధారంగా ఇద్దరు పాలకులు స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ బహుమతులను మార్పిడి చేసుకున్నారు. వారి ఒప్పందాన్ని అనుసరించి చంద్రగుప్తుడు వివిధ కామోద్దీపనలను సెలూకసుకు పంపారని శాస్త్రీయ వర్గాలు చెబుతున్నాయి:[61]
థియోఫ్రాస్టసు ప్రజలను మరింత రంజింపజేయడంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు. ఫిలార్కసు ఆయనను ధృవీకరిస్తూ భారతీయుల రాజు సాండ్రాకోటసు సెల్యూకసుకు పంపిన కొన్ని బహుమతుల గురించి ప్రస్తావించాడు; అవి అద్భుతమైన ప్రేమను ఉత్పత్తి చేయడంలో మనోజ్ఞతను కలిగి ఉంటాయి. మరికొన్ని దీనికి విరుద్ధంగా ప్రేమను బహిష్కరించడం గురించి వివరించాయి. నౌక్రాటిసు ఎథీనియన్లు, "ది డీప్నోసోఫిస్ట్సు" బుక్ I, అధ్యాయం 32.[61][71]
సింధు నదికి పశ్చిమాన సెల్యూకసు భూభాగాలను స్వాధీనం చేసుకున్న తరువాత చంద్రగుప్త ఉత్తర భారత ఉపఖండంలో బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్న విస్తారమైన సామ్రాజ్యాన్ని కలిగి ఉంది. చంద్రగుప్తుడు తన సామ్రాజ్యాన్ని వింధ్య శ్రేణి అవరోధం దాటి దక్కను పీఠభూమికి దక్షిణ దిశగా విస్తరించడం ప్రారంభించాడు.[8] ఆయన విజయాలు పూర్తిచేసిన సమయానికి చంద్రగుప్తుడు సామ్రాజ్యం ఉపఖండంలో చాలాభాగం విస్తరించింది.[72] దక్షిణాన "మోరియా" యుద్ధాన్ని తమిళ రచన అహనానురులో మూడుసార్లు, పురనానూరులో ఒకసారి సూచించబడింది. ఈ గ్రంథాల ప్రకారం, మోరియా సైన్యం రథాలు రాళ్ళ ద్వారా కత్తిరించబడ్డాయి. సాధారణ యుగానికి ముందు/BCE 5 వ శతాబ్దంలో ఈ గ్రంథాలు చంద్రగుప్త మౌర్యుని లేదా దక్కను ప్రాంతంలోని మోరియాలను సూచిస్తాయా అనేది అస్పష్టంగా ఉంది.[73]
చంద్రగుప్త సైన్యం పెద్దది, బాగా శిక్షణ పొందింది, ఆయన సలహాదారు చాణక్యుడు సూచించిన విధంగా సైనికులకు జీతభత్యాలను ప్రభుత్వం నేరుగా చెల్లించింది. గ్రీకు రచనల ఆధారంగా లక్షలాది మంది సైనికులు ఉన్నట్లు అంచనా వేయబడింది.[74] ఉదాహరణకు ఆయన సైన్యంలో 4,00,000 మంది సైనికులు ఉన్నారని ప్రస్తావించబడింది. స్ట్రాబో అభిప్రాయం ఆధారంగా "మెగాస్టనీసు శాండ్రోకోటసు శిబిరంలో ఉన్నాడు. ఇందులో 4,00,000 మంది సైనికులు ఉన్నారు".[75] మెగాస్టీసు రచన నుండి వచ్చిన ప్లినీ ది ఎల్డరు, 6,00,000 పదాతిదళాలు, 30,000 అశ్వికదళాలు, 9,000 యుద్ధ ఏనుగులు ఉన్నట్లు నివేదించారు.[76] చంద్రగుప్తా సైన్యంలో సాకాలు, యవనాలు (గ్రీకులు), కిరాటాలు, కంభోజులు, పారశీకులు, బహ్లికులు ఉన్నారని ముద్రరాక్షసం పేర్కొన్నది. [77] భారతదేశం మొత్తాన్ని ఆక్రమించే సమయానికి చంద్రగుప్తుడి సైన్యం 6,00,000 సంఖ్యలో ఉంటుందని ప్లూటార్కు, ప్లినీ ది ఎల్డరు అంచనా వేశారు.[45] ప్లినీ, ప్లూటార్కు కూడా తూర్పున నందా ఆర్మీ బలాన్ని 200,000 పదాతిదళం, 80,000 అశ్వికదళం, 8,000 రథాలు, 6,000 యుద్ధ ఏనుగులుగా అంచనా వేశారు. ఈ అంచనాలు మౌర్యరాజసభలోని సెలూసిదు రాయబారి మెగాస్టీసు మునుపటి అంచనాల మీద ఆధారపడి ఉన్నాయి. [78]
సాధారణ యుగానికి ముందు/BCE 320 లో పూర్వ నంద భూభాగాల మీద నియంత్రణ సాధించిన తరువాతి సంవత్సరాలలో చంద్రగుప్తుడు ఉత్తర భారతదేశం మీద తన పాలనను పటిష్ఠం చేసినట్లు తెలుస్తోంది. ఈ కాలంలో ఆయన సాగించిన సైనిక పోరాటాల గురించి వ్రాతపూర్వక ఆధారాలు లేవు. వాయవ్యంలో ఆయన సామ్రాజ్యంలో ప్రస్తుత ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను భూభాగాలు ఉన్నాయి. ఎందుకంటే మొదటి సెలూకసు నికేటరు ప్రస్తుత కాబూలు, బలూచిస్తానుకు తూర్పున ఉన్న అన్ని భూభాగాలను చంద్రగుప్తుడికి ఇచ్చాడు.[79]
రుద్రదామను 2 వ శతాబ్దపు జునాగ ad ్ శిలాశాసనం పశ్చిమాన నేటి గుజరాతు వరకు చంద్రగుప్తుడి పాలన విస్తరించినట్లు ధ్రువీకరించబడింది. ఈ ప్రాంతంలోని సుదర్శన సరస్సును చంద్రగుప్తుడి రాజప్రతినిధి వైశ్య పుష్యగుప్తుడు ఆరంభించినట్లు శాసనం పేర్కొంది. ఈ ప్రాంతం మీద మౌర్యుల నియంత్రణ అదే శిలమీద ఉన్న అశోకుడి శాసనం ద్వారా మరింత ధ్రువీకరించబడింది. గుజరాతు నుండి ఆయన రాజధాని పాటలీపుత్ర మధ్య ఉన్న మధ్య భారతదేశంలోని మాల్వా ప్రాంతాన్ని చంద్రగుప్తుడు నియంత్రించాడని కూడా ఇది సూచిస్తుంది.[80]
చంద్రగుప్తుడు సాధించిన ఇతర విజయాల గురించి అనిశ్చితి ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని దక్కను ప్రాంతంలో.[80] తన మనవడు అశోకుడు పాలన సమయంలో (సి. సాధారణ యుగానికి ముందు/BCE 268) ఈ సామ్రాజ్యం దక్షిణాన ప్రస్తుత కర్ణాటక వరకు విస్తరించింది. కాబట్టి దక్షిణ విజయాలు చంద్రగుప్తుడు లేదా అతని కుమారుడు బిందుసారుడు కారణమని చెప్పవచ్చు. చంద్రగుప్తుడు కర్ణాకటలో పునరుద్ధరించిన తన జీవితాన్ని అంతం చేసిన జైన సంప్రదాయ గ్రంథాల ఆధారాలు సరైనవని భావిస్తే చంద్రగుప్తుడు దక్షిణ ఆక్రమణను ప్రారంభించినట్లు తెలుస్తుంది.[81]
మౌర్యులు భారత ఉపఖండంలో ఇప్పటివరకు అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటి నిర్మించారు.[30][1][82]
మౌర్య వంశపు కాలం | ||||||||||||
చక్రవర్తి | రాజ్యకాల ఆరంభం | పరిసమాప్తి | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
చంద్రగుప్త మౌర్యుడు | BCE. 322 | BCE. 298 | ||||||||||
బిందుసారుడు | BCE 297 | BCE 272 | ||||||||||
అశోకుడు | BCE 273 | BCE. 232 | ||||||||||
దశరథుడు | BCE 232 | BCE 224 | ||||||||||
సంప్రాతి | BCE 224 | BCE 215 | ||||||||||
శాలిసూక | BCE 215 | BCE 202 | ||||||||||
దేవవర్మన్ | BCE 202 | BCE 195 | ||||||||||
శతధన్వాన్ | BCE 195 | BCE 187 | ||||||||||
బృహద్రథుడు | BCE 187 | BCE 185 |
భారతదేశంలో ఎక్కువ భాగాన్ని ఏకం చేసిన తరువాత చంద్రగుప్తుడు, చాణక్యుడు, పెద్ద ఆర్థిక, రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్టాడు. పాటలీపుత్ర (ప్రస్తుత పాట్నా) నుండి చంద్రగుప్తుడు బలమైన కేంద్ర పరిపాలనను స్థాపించాడు.[83] చంద్రగుప్త మౌర్యుడు చాణక్య గ్రంథం " అర్థశాస్త్రం "లో వివరించిన గణాంకాలు, ఆర్థిక విధానాలను వర్తింపజేశారు.[82][84][85] చంద్రగుప్తుడి గురించి వివిధ భారతీయ చారిత్రాత్మక, పురాణ, హాజియోగ్రాఫికు సాహిత్యంలో వివిధ రచనలు ఉన్నాయి. కాని ఆల్చిను, ఎర్డోసి ఈ వాదనలు అనుమానస్పదమైనవని భావిస్తున్నారు. సాక్ష్యం గ్రంథాలకు మాత్రమే పరిమితం కాకుండా తరువాతి శతాబ్ధాలలో పురావస్తు ప్రదేశాలలో జరిపిన పరిశోధనలలో ఎపిగ్రఫీ, నామిస్మాటికు డేటా లభించాయి. " (హిందూ) అర్థశాస్త్రం, ఇతర రెండు ప్రధాన వనరులు (బౌద్ధ) అశోకుడి శాసనాలు, (గ్రీకు) మెగాస్టీనీసు వచనం మధ్య చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి." [86] మౌర్యచంద్రగుప్తుడి పాలన నిర్మాణాత్మక పరిపాలన; చంద్రగుప్తునికి మంత్రుల మండలి (అమాత్య) ఉండేది. చాణక్య అతని ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
[87][88] మెగాస్టీనెసు చంద్రగుప్తుడి రాజసభలో గ్రీకు రాయబారిగా నాలుగు సంవత్సరాలు పనిచేశాడు.[31] ఈ సామ్రాజ్యం భూభాగాలుగా (జనపద), ప్రాంతీయ శక్తి కేంద్రాలు కోటలతో (దుర్గా) రక్షించబడ్డాయి. రాజ్య కార్యకలాపాలకు ఖజానా (కోసా) తో నిధులు సమకూర్చబడ్డాయి. [89]
చంద్రగుప్తుడి పాలనలో, ఆయన రాజవంశం సమయంలో బౌద్ధమతం, జైన మతం, అజీవకా బ్రాహ్మణిజం సంప్రదాయాలు ప్రాముఖ్యతను సంతరించుకోవడంతో భారతదేశంలో అనేక మతాలు అభివృద్ధి చెందాయి.[3][90]
చంద్రగుప్తుడి పాలనలో సామ్రాజ్యం నీటిపారుదల, దేవాలయాలు, గనులు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలను నిర్మించబడ్డాయి. ఇది బలమైన ఆర్థిక వ్యవస్థకు దారితీసింది.[91][92] పురాతన ఎపిగ్రాఫికలు సాక్ష్యాలు చాణుక్యుడి సలహా ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు పౌర జనాభాకు, సైన్యానికి ఆహార సరఫరాను నిర్ధారించడానికి భారత ఉపఖండంలో అనేక నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధిలో భాగంగా జలాశయాలు, నీటికాలువల నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసారు. ఈ కార్యక్రమాల విధానాన్ని ఆయన రాజవంశ వారసులు కొనసాగించారు.[86] వ్యవసాయంలో ప్రాంతీయ శ్రేయస్సు ఆయన ప్రభుత్వ అధికారులకు అవసరమైన విధుల్లో ఒకటి.[93] 400 సంవత్సరాల తరువాత గుజరాతులో కనుగొనబడిన రుద్రదామను శాసనాలు చంద్రగుప్తుడు, అశోకుడు నిర్మించిన నీటిపారుదల మౌలిక సదుపాయాలను మరమ్మతులు చేసి విస్తరించబడ్డాయి.[94] చంద్రగుప్తుడు రాజ్యం గనులు, తయారీ కేంద్రాలు, వస్తువుల వర్తకం కొరకు కూడళ్ళను కూడా ప్రారంభించింది. ఆయన పాలన భారత ఉపఖండంలో వస్తువులను రవాణా చేయడానికి భూ మార్గాలను అభివృద్ధి చేసింది. నీటి రవాణాను ప్రాధాన్యత తగ్గిస్తూ చంద్రగుప్తుడు "బండ్లకు అనువైన రహదారులను" విస్తరించాడు. వీటిలో ప్యాకు జంతువులకు మాత్రమే అనువైన ఇరుకైన దారులకు ప్రాధాన్యత ఇచ్చాడు. [95]
కౌశికు రాయ్ అభిప్రాయం ఆధారంగా చంద్రగుప్తుడితో ప్రారంభమైన మౌర్య రాజవంశం పాలకులు "గొప్ప రహదారి నిర్మించేవారు". [92] గ్రీకు రాయబారి మెగాస్టీనెసు ఈ సంప్రదాయం చంద్రగుప్తుడు ఆరంభించాడు కనుక ఈ ఘనత ఆయనకే చెందుతుందని పేర్కొన్నాడు. బీహారులోని చంద్రగుప్తుడి రాజధాని పాటలీపుత్రను తాను అధ్యయనం చేసిన వాయవ్యంలోని తక్షశిలను అనుసంధానించే వెయ్యి మైళ్ల పొడవైన రహదారిని పూర్తి చేశాడు. ఈ సంప్రదాయానికి జమ చేసిన ఇతర ప్రధాన వ్యూహాత్మక రహదారి మౌలిక సదుపాయాలు పాటలీపుత్ర నుండి వివిధ దిశలలో వ్యాపించి నేపాలు, కపిలావస్తు, డెహ్రాడూను, మీర్జాపూరు, ఒడిశా, ఆంధ్ర, [-అయోమయ నివృత్తి పేజీకి వెళ్తున్న ఈ లింకును సవరించాలి-] కర్ణాటకతో కలుపుతున్నాయి.[92] రాయ్ అభిప్రాయం ఆధారంగా ఈ రహదారుల అనుసంధానం వాణిజ్యాన్ని అభివృద్ధి చేసింది. సైన్యాన్ని వేగంగా, సమర్ధవంతంగా తరలించడానికి సహాయపడింది. [92]
చంద్రగుప్తుడు, చాణక్యుడు ఆయుధాల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించి వాటిని ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉంచారు. అయినప్పటికీ గనులను నిర్వహించడానికి, ఈ కేంద్రాలకు సరఫరా చేయడానికి పోటీపడుతున్న ప్రైవేటు పార్టీలను ప్రభుత్వం ప్రోత్సహించింది. [101] వారు ధర్మం (నైతికత) సాధనకు ఆర్థిక శ్రేయస్సు అవసరమని భావించారు. దౌత్యంతో యుద్ధాన్ని నివారించే విధానాన్ని అవలంబించారు. ఇంకా అర్థశాస్త్రంలో దాని ప్రయోజనాలను, రాజ్యరక్షణకొరకు సైన్యాన్ని నిరంతరం యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు.[102][103]
చంద్రగుప్తుడి కాలంలో కళలు వాస్తుశిల్పం సాక్ష్యాలు ఎక్కువగా మెగాస్టీసు రచనలకు, కౌటిల్య అర్ధశాస్త్రం వంటి గ్రంథాలకు పరిమితం. స్మారక స్తంభాల మీద శాసనాలు, శిల్పాలు అతని మనవడు అశోకకు ఆపాదించబడ్డాయి. ఈ గ్రంథాలు నగరాలు, ప్రజా కార్యక్రమాలు, సంపన్నమైన నిర్మాణాన్ని సూచిస్తున్నాయి. అయితే వీటి చారిత్రకత ప్రశ్నార్థకంగా ఉన్నాయి.[104]
గంగా నది ఒడ్డున భూస్థాపితం అయిన దీదర్గంజు యక్షి 1917 లో నిర్వహించబడిన ఆధునిక యుగంలో పురావస్తు పరిశోధనలలో కనుగొనబడ్డాయి.[96][97] ఇవి అసాధారణమైన శిల్పకళా సాధనను సూచిస్తున్నాయి. ఈ ప్రదేశం సాధారణ యుగానికి ముందు/BCE 3 వ శతాబ్దానికి చెందినవని విద్యావేత్తలు భావిస్తున్నారు.[96][97] భావించినప్పటికీ తరువాత సాధారణ యుగానికి ముందు/BCE 2 వ శతాబ్దం - కుషాను శకం (సా.శ. 1 వ -4 వ శతాబ్దం) వంటి తేదీలు కూడా ప్రతిపాదించబడ్డాయి. అలెగ్జాండరు ది గ్రేట్ యుద్ధం చేసిన సంవత్సరాలలో చంద్రగుప్తా మౌర్యుడి రాజవంశంతో ముడిపడి ఉన్న కళను గ్రీకుల నుండి, పశ్చిమ ఆసియా నుండి నేర్చుకున్నారని పోటీ సిద్ధాంతాలు చెబుతున్నాయి; ఈ కళాఖండాలు పాత స్వదేశీ భారతీయ సంప్రదాయానికి చెందినవి. ఫ్రెడెరికు ఆషరు అభిప్రాయం ఆధారంగా, "మనకు ఖచ్చితమైన సమాధానాలు ఉన్నట్లు చెప్పలేము; చాలా కళల మాదిరిగానే, ఒకే సమాధానం లేదా వివరణ లేదని గుర్తించాలి".[105]
స్ట్రాబో రచనలలో మనుగడ సాగించిన మెగాస్టీనెసు ఇచ్చిన నివేదిక ఆధారంగా చంద్రగుప్త శిబిరంలో ఉన్నప్పుడు 40,000 మందితో కలిసి ఉండేవారు. ఇంత పెద్ద సంఖ్యలో రక్షణవ్యవస్థతో పరిపాలన మంచి క్రమాన్ని కొనసాగించింది. దొంగతనాలు చాలా అరుదుగా ఉండేవి.[80]
చంద్రగుప్తుడు కఠినమైన పాలకుడని జస్టిను సూచిస్తున్నాడు. జస్టిను అభిప్రాయం ఆధారంగా, మునుపటి దౌర్జన్య పాలకులను పడగొట్టి చంద్రగుప్తుడు అధికారంలోకి వచ్చాడు. కాని ఆయన అణచివేత పాలకుడు అయ్యాడు.[80]
సాధ్యమైన తిరుగుబాట్ల గురించి చంద్రగుప్తుడు చాలా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. స్ట్రాబో అభిప్రాయం ఆధారంగా మెగాస్టీసు మూలం, చంద్రగుప్తుడికి కాపలాగా ఆడ బానిసలు ఉన్నారు. కుట్రదారులను గందరగోళపరిచేందుకు రాజు తరచుగా పడకగదులను మార్చాడు. అతను కొన్ని పనుల కోసం మాత్రమే తన రాజభవనాన్ని విడిచిపెట్టాడు: సైనిక యాత్రలకు వెళ్లడం, న్యాయం కోసం తన సభను సందర్శించడం, త్యాగాలు చేయడం, వేడుకలు, వేట కొరకు, వేడుకల సమయంలో, ఆయన సురక్షితమైన రక్షణవలయం మద్య ఉపస్థితమై ఉండేవాడు. వేటలో ఆయన చుట్టూ మహిళా అంగరక్షకులు ఉన్నారు.[106]
జైన వృత్తాంతాల ప్రకారం 12 సంవత్సరాల కరువు చంద్రగుప్తుడిని ఎంతగానో కదిలించింది. ఫలితంగా ప్రస్తుత కర్ణాటకలో జైన సన్యాసిగా పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నాడు.[106] ఈ జైన వృత్తాంతాలు 1,200 సంవత్సరాల తరువాత వ్రాయబడ్డాయి. హరిషేన వ్రాసిన బృహకథ కోనా (సా.శ 931), రత్నానంది వ్రాసిన భద్రాబాహు చరిత (సా.శ. 1450), మునివంశాభ్యుదయ (సా.శ1680), రాజవళి కాథే వంటి గ్రంథాలలో కనిపిస్తాయి. జైన సంప్రదాయం ప్రకారం, చంద్రగుప్తుడు తన కుమారుడు బిందుసారకు అనుకూలంగా తన సింహాసనాన్ని త్యజించి, జైన గురువు భద్రాబాహును దక్షిణ భారతదేశానికి అనుసరించాడు. [107][108][109] సల్లెఖాన జైన అభ్యాసం ఆధారంగా మరణానికి ముందు ఉండటానికి ముందు ఆయన చాలా సంవత్సరాలు శ్రావణబెలగోల వద్ద సన్యాసిగా నివసించినట్లు చెబుతారు. [110][111][112][113]
గ్రంథాలతో పాటు 7 వ -15 వ శతాబ్దానికి చెందిన అనేక జైన స్మారక శాసనాలు భద్రాబాహు, చంద్రగుప్తులు ఇద్దరినీ కలిసి సూచిస్తాయి. చంద్రగుప్త సన్యాసం చేసినట్లు పేర్కొన్న కొండను ఇప్పుడు చంద్రగిరి కొండ అని పిలుస్తారు; చంద్రగుప్తా బసాది అనే ఆలయం అక్కడ ఉంది.[114] ఈ సాక్ష్యం చాలా కాలం తరువాత వెలువడినది, చారిత్రకంగా నిరూపితం కానప్పటికీ చరిత్రకారుడు ముఖర్జీ తన తరువాతి జీవితంలో చంద్రగుప్తుడు జైన మతంలోకి మారిపోయాడనే ఆలోచనను నిరూపించడానికి ఆధారాలు లేవని అభిప్రాయపడ్డారు. ముఖర్జీ విన్సెంటు స్మితును ఉటంకిస్తూ చంద్రగుప్తా జైనమతంలోకి మారడం చిన్న వయస్సులో ఆయన ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడే పదవీ విరమణ, ఆకస్మిక నిష్క్రమణకు తగిన వివరణను ఇస్తుందని నిర్ధారించారు.[110][115] చరిత్రకారులు ఇర్ఫాను హబీబు, వివేకానందు అభిప్రాయం ఆధారంగా జైన కథనం "సాధ్యం కానిది, నమ్మశక్యం కానిది" కథ భావించబడింది.[106] జైన ఇతిహాసాల ఆధారంగా చంద్రగుప్తుడి మంత్రి చాణక్యుడు కూడా ఒక జైనుడు.[106] పాటలీపుత్రలోని జైన సమాజానికి, రాజ న్యాయస్థానానికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని హిందూ గ్రంథాలు గుర్తించాయి. బ్రాహ్మణిజంలో విజేత అయిన చాణక్యుడు - జైనులను తన దూతలుగా నియమించాడు. ఇది చంద్రగుప్తుడి జైన ఆలోచన ప్రభావాన్ని పరోక్షంగా నిర్ధారిస్తుంది.[116] చంద్రగుప్తుడు సింహాసనాన్ని విడిచిపెట్టడం (సి. సాధారణ యుగానికి ముందు/BCE 298), ఆయన మరణం సి. సాధారణ యుగానికి ముందు/BCE 297.[42]
చాణక్యుని సహాయంతో చంద్రగుప్తుడు అనేకమంది మగధ రాజులను, చంద్రవంశం వారిని ఓడించాడు.
కర్నాటకలోని శరవణబెళగొళ లోని చంద్రగిరి కొండ మీద చంద్రగుప్త మౌర్యుడి ఒక స్మారక చిహ్నం ఉంకిలో ఉంది.[117] భారతీయ పోస్టలు సర్వీసు " స్మారక పోస్టల్ స్టాంపు " విడుదల చేసింది.[118]
ఇంతకు ముందు ఉన్నవారు: నంద వంశం |
మౌర్య చక్రవర్తి 322BCE—298BCE |
తరువాత వచ్చినవారు: బిందుసారుడు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.