From Wikipedia, the free encyclopedia
గోండి భాష దక్షిణ-మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. ఆంధ్ర ప్రదేశ్ ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో మొత్తంగా, సుమారు ముప్పై లక్షల మంది, ఈ భాషని మాట్లాడుతున్నారు[1]. ఇది గోండులకి చెందిన భాషే అయినప్పటికీ, ప్రస్తుతం వారిలో సగంమంది మాత్రమే దీనిని మాట్లాడుతున్నారు.
గోండీ | ||
---|---|---|
: | ||
మాట్లాడే దేశాలు: | భారతదేశం | |
ప్రాంతం: | ఆంధ్ర ప్రదేశ్ ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, మధ్యప్రదేశ్,గుజరాత్ | |
మాట్లాడేవారి సంఖ్య: | 29 లక్షలు (మాతృభాష, భారత దేశం 2011) | |
భాషా కుటుంబము: | ద్రవిడ దక్షిణ-మధ్య గోండీ | |
వ్రాసే పద్ధతి: | గోండీ లిపి, తెలుగు లిపి, దేవనాగరి లిపి | |
అధికారిక స్థాయి | ||
అధికార భాష: | భారతదేశం | |
నియంత్రణ: | అధికారిక నియంత్రణ లేదు | |
భాషా సంజ్ఞలు | ||
ISO 639-1: | none | |
ISO 639-2: | gon | |
ISO 639-3: | either:ggo — దక్షిణ గోండిgno — ఉత్తర గోండి | |
గమనిక: ఈ పేజీలో IPA ఫోనెటిక్ సింబల్స్ Unicodeలో ఉన్నాయి. |
గోండీ భాషకు రేండు లిపులు ఉన్నాయి అవి గుంజాల గోండి లిపి మరియు మెస్రం గోండి లిపి
మెస్రం గోండి లిపిని ఉత్తర భారతదేశంలో వాడుకలో ఉంది మరియు దక్షిణ భారతదేశంలో గోండీ భాషకు ఉన్న తనదైన సొంత లిపి గుంజాల గోండి లిపి (ఆదిలాబాదు జిల్లా గుంజాల వద్ద). ఆంధ్రప్రదేశ్ ఓరియంటల్ మానుస్క్రిప్ట్స్ లైబ్రరీ అండ్ రిసెర్చ్ సెంటర్ యొక్క మాజీ డైరక్టర్ [[జయధీర్ తిరుమలరావు]] గారు, ఈ లిపిలోని అనేక వ్రాతప్రతులను సేకరించారు. గోండులలో ఈ లిపిని పునరుద్ధరించే ప్రయత్నాలు మొదలవుతున్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.