ఖాజాల్ జిల్లా
మిజోరాం రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో ఒక జిల్లా. From Wikipedia, the free encyclopedia
Remove ads
మిజోరాం రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో ఒక జిల్లా. From Wikipedia, the free encyclopedia
ఖాజాల్ జిల్లా, మిజోరాం రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో ఒక జిల్లా. 2019, జూన్ 3న ఈ ఖాజాల్ జిల్లా ఏర్పాటు చేయబడింది.[1]
జిల్లా ప్రధాన కార్యాలయం ఖాజాల్ పేరును జిల్లాకు పెట్టారు.
ఈ జిల్లాలో ఉత్తర చంఫై, హ్రాంగ్టూర్జో, లెంగ్టెంగ్, తుయిచాంగ్ అనే 4 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో 28 పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి.[2] ఖాజాల్ పట్టణంలో సుమారు 3వేల కుటుంబాలు ఉన్నాయి, సుమారు 14,000 మంది నివసిస్తున్నారు.[3] ఖాజాల్ జిల్లాలో సుమారు 7,372 కుటుంబాలు ఉన్నాయి, ఇందులో 36,381 మంది నివసిస్తున్నారు.
ఖాజాల్ జిల్లాలోని ప్రధాన పట్టణాలు, గ్రామాలు:
ఖాజాల్ జిల్లాలో మితమైన వాతావరణం ఉంటుంది. శీతాకాలంలో 0-20 డిగ్రీల ఉష్ణోగ్రత, వేసవికాంలో 15-30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.
ఖాజాల్ పట్టణం, ఐజాల్ నగరాల మధ్య 152 కి.మీ.ల దూరం ఉంది. ఖాజాల్ నుండి బస్సు, సుమో, హెలికాప్టర్ వంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.[4]
ఈ జిల్లాకు ఉత్తరం వైపు సెర్ఛిప్ జిల్లా, దక్షిణం వైపు లవంగ్త్లై జిల్లా, ఆగ్నేయం వైపు సైహ జిల్లా, తూర్పు వైపు మయన్మార్ రాష్ట్రం ఉన్నాయి. ఖాజాల్ పట్టణం, జిల్లా పరిపాలనా ప్రధాన కేంద్రంగా ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.