కోస్తా

From Wikipedia, the free encyclopedia

కోస్తా

కోస్తా లేదా తీరాంధ్ర ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంతం. కోస్తా అన్న తెలుగు మాట, కోస్ట్‌ అన్న ఇంగ్లీషు మాట కూడా 'కోస్తా' అన్న పోర్చుగీసు భాష నుండి పుట్టిందని ఒక అనుమానం ఉంది.

త్వరిత వాస్తవాలు కోస్తా, దేశం ...
కోస్తా
ప్రాంతం
Nickname: 
తీరాంధ్ర
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
Area
  Total
92,906 కి.మీ2 (35,871 చ. మై)
Population
 (2011)
  Total
3,41,93,868 [ఆధారం చూపాలి]
పెద్ద నగరాలు
మూసివేయి

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు (కోస్తాంధ్ర, రాయలసీమ) ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది.

సాధారణంగా కోస్తా జిల్లాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అంతర్భాగమే. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 వలన కొత్తగా ఏర్పడిన కొన్ని జిల్లాలకు తీర ప్రాంతం హద్దుగాలేదు కాని, ఉమ్మడి జిల్లాలో భాగం కావున వాటిని కోస్తా జిల్లాలుగా పరిగణించటం కొనసాగుతుంది.

బ్రిటీషు ప్రభుత్వం పాలన కింద ఉన్న జిల్లాలు కూడా కావున, ఉత్తారాంధ్ర జిల్లాలలతో పాటు, వీటికి సర్కారు జిల్లాలు అనే పదప్రయోగం వాడుకలోవుండేది. ఈ తొమ్మిది ఉమ్మడి జిల్లాలూ 972 కి.మీ. నిడివిగల బంగాళాఖాత తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. భారతదేశంలో గుజరాత్‌ తరువాత రెండవ పెద్ద తీర రేఖ ఉన్న రాష్ట్రం ఇది. గోదావరి, కృష్ణా, పెన్నానదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. వరి, చెరకు, కూర గాయలకు ప్రసిద్ధి గాంచింది. కోస్తా, రాయలసీమ ప్రజలు 1972లో జై ఆంధ్ర పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు.

ఇంకా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.