కొవ్వూరు మండలం
ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
కొవ్వూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిపశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం.[3] ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి,అందులో ఒకటి నిర్జన గ్రామం. గోదావరి నదీ తీరాన నెలకొన్న సుందరమైన ఆధ్యాత్మిక పట్టణం, కొవ్వూరు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణాలలో ఒకటి. చారిత్రక, సాహిత్య ప్రాధాన్యత ఉన్న రాజమహేంద్రి (రాజమండ్రి) గోదావరి నదికి ఒకవైపున ఉండగా, దానికి ఎదురుగా రెండవ వైపున కొవ్వూరు ఉంది. మండలవ్యవస్థ రావడానికి పూర్వం కొవ్వూరు ఒక తాలూకా కేంద్రంగా ఉండేది. గోదావరి పుష్కరాల సమయం ఇక్కడ చాలా విశేషం. వాడపల్లి మీదుగా రాజమండ్రి వెళ్ళుతున్నప్పుడు గోదావరి దాటడానికి రైలు-రోడ్డు వంతెన, కొత్త రైలు వంతెనలు ఇక్కడే ప్రారంభం అవుతాయి.OSM గతిశీల పటం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 17.017°N 81.732°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి జిల్లా |
మండల కేంద్రం | కొవ్వూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 112 కి.మీ2 (43 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 1,08,445 |
• సాంద్రత | 970/కి.మీ2 (2,500/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1031 |
మండలం లోని పట్టణాలు
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
- డేచెర్ల
- ఇసుకపట్లపంగిడి
- ధర్మవరం
- దొమ్మేరు
- పెనకనమెట్ట
- చిడిపి
- కుమారదేవం
- అరికిరేవుల
- నందమూరు
- పశివేదల
- వేములూరు
- తోగుమ్మి
- వాడపల్లి
- మద్దూరు
- మద్దూర్లంక
నిర్జన గ్రామాలు
- Chigurulanka (Q15700366)
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.