Remove ads
కేరళ జిల్లాల జాబితా From Wikipedia, the free encyclopedia
భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి పశ్చిమాన అరేబియా సముద్ర తీరం, దక్షిణం, తూర్పున తమిళనాడు, ఉత్తర, ఈశాన్యంలో కర్ణాటక సరిహద్దులుగా ఉన్నాయి. కేరళలోని పుదుచ్చేరి ఎన్‌క్లేవ్‌లోని మహే జిల్లా భాగం. పాలక్కాడ్ గ్యాప్ అని పిలువబడే సహజ పర్వత మార్గం ఉన్న పాలక్కాడ్ సమీపంలో మినహా పశ్చిమ కనుమలు దాదాపు నిరంతర పర్వత గోడగా ఏర్పడి ఉన్నాయి. ఇడుక్కి జిల్లా మొత్తం 4612 కిమీ 2 విస్తీర్ణంతో కేరళలో అతిపెద్ద జిల్లాగా గుర్తించబడింది.
కేరళ జిల్లాల జాబితా | |
---|---|
రకం | జిల్లాలు |
స్థానం | కేరళ |
సంఖ్య | 14 జిల్లాలు |
జనాభా వ్యాప్తి | వయనాడ్ – 846,637 (అత్యల్ప); మలప్పురం – 4,494,998 (అత్యధిక) |
విస్తీర్ణాల వ్యాప్తి | అలప్పుళ – 1,415 కిమీ2[convert: unknown unit] (చిన్నది); ఇడుక్కి – 4,612 కిమీ2[convert: unknown unit] (అతిపెద్ద) |
ప్రభుత్వం | కేరళ ప్రభుత్వం |
ఉప విభజన | కేరళ రెవెన్యూ విభాగాలు |
స్వతంత్ర భారతదేశం చిన్న రాష్ట్రాలను కలిపి ట్రావెన్కోర్, కొచ్చిన్ రాష్ట్రాలు కలిపి 1949 జూలై 1న ట్రావెన్కోర్-కొచ్చిన్ రాష్ట్రంగా ఏర్పడింది.అయితే, ఉత్తర మలబార్, దక్షిణ మలబార్ మద్రాసు రాష్ట్రంలోనే ఉన్నాయి..1956 నవంబరు 1 నాటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం భారతదేశంలోని నైరుతి మలబార్ తీరంలో మలయాళం మాట్లాడే భూభాగాలను ఏకం చేయడం ద్వారా కేరళ రాష్ట్ర స్థాయికి చేరింది.
కేరళ రాష్ట్రం లోని జిల్లాలను మూడు భాగాలుగా పేర్కొనబడింది.అవి కాసరగోడ్, కన్నూర్, వాయనాడ్, కోజికోడ్ జిల్లాలను ఉత్తర కేరళ జిల్లాలు; మలప్పురం, పాలక్కాడ్, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాలను మధ్య కేరళ జిల్లాలు; ఇడుక్కి, కొట్టాయం, అలప్పుజా, పతనంతిట్ట, కొల్లాం, తిరువనంతపురం జిల్లాలను దక్షిణ కేరళ జిల్లాలు. [1] కొచ్చిన్, ఉత్తర మలబార్, దక్షిణ మలబార్, ట్రావెన్కోర్లోని చారిత్రక ప్రాంతాలలో భాగంగా ఈ ప్రాంతీయ విభజన జరిగింది. ఉత్తర మలబార్ ప్రాంతం, కేరళలోని మిగిలిన ప్రాంతాల కంటే, సాంస్కృతికంగా విభిన్నంగా ఉంటుంది.ఇది పూర్తిగా ఉత్తర కేరళ జిల్లాలలో ఉంది. [2] దక్షిణ మలబార్, కొచ్చిన్ రాజ్యం ప్రాంతాలు, ఈ రెండూ చాలా చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక సారూప్యతలను పంచుకుంటాయి.ఇవి కలిసి మధ్య కేరళ జిల్లాలుగా ఉన్నాయి. [2] [3] ట్రావెన్కోర్ ప్రాంతం దక్షిణ కేరళలోని జిల్లాలలో విలీనం చేయబడింది. [4] ట్రావెన్కోర్ ప్రాంతం మళ్లీ ఉత్తర ట్రావెన్కోర్ (కొండ శ్రేణి) ( ఇడుక్కి ఎర్నాకులం చిన్న భాగం), సెంట్రల్ ట్రావెన్కోర్ (సెంట్రల్ రేంజ్) (పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం), దక్షిణ ట్రావెన్కోర్ (దక్షిణ శ్రేణి) (తిరువనంతపురం,కొల్లాం) అనే మూడు జోన్లుగా విభజించబడింది.)
కేరళలోని జిల్లాలకు తరచుగా జిల్లాలోని అతిపెద్ద పట్టణం లేదా నగరం పేరు పెట్టారు.కొన్ని జిల్లాల పేర్లు 1990లో ఆంగ్లీకరించబడిన పేర్ల నుండి వాటి స్థానిక పేర్లకు మార్చబడ్డాయి.
కేరళ రాష్ట్రం 14 జిల్లాలు, 78 తాలూకాలు, 152 కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లు, 941 గ్రామ పంచాయతీలు, 6 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలుగా విభజించబడింది.
జిల్లా పరిపాలన జిల్లా కలెక్టరుచే నిర్వహించబడుతుంది.అతను కేరళ కేడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిగా అయిఉంటాడు. కేరళ రాష్ట్ర ప్రభుత్వంచే నియమింపబడతాడు. క్రియాత్మకంగా జిల్లా పరిపాలన రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా నిర్వహించబడుతుంది, వీటిలో ప్రతి దాని స్వంత జిల్లా స్థాయి కార్యాలయం ఉంది. జిల్లా కలెక్టర్ జిల్లా పాలనాధికారి కార్యనిర్వాహక నాయకుడు, జిల్లాలోని వివిధ శాఖల జిల్లా అధికారులు అతని విధుల నిర్వహణలో పరిపాలనా పరంగా అతనికి సహాయ సహకారాలు, సలహాలను అందిస్తారు. జిల్లా కలెక్టరు ఉన్నత అధికారాలు, బాధ్యతలను కలిగి ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యకర్త. అతను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, జిల్లాలోని ప్రజలకు ప్రతినిధిగా ద్వంద్వ పాత్రను కలిగి ఉంటాడు. జిల్లా శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత అతని పర్వేక్షణలో ఉంటుంది.
కోడ్[5] | జిల్లా పేరు | ప్రధాన కార్యాలయం[6] | స్థాపన | జనాభా (2018)[7] | విస్తీర్ణం[8] | ఉపవిభాగాలు | పటంలో జిల్లా స్థానం |
---|---|---|---|---|---|---|---|
AL | ఆలప్పుళ జిల్లా | ఆలప్పుళ | 17 Aug 1957 ఆగష్టు[9] | 2,146,033 | 1,415 కి.మీ2 (546 చ. మై.) | ||
ER | ఎర్నాకుళం జిల్లా | కక్కనాడ్ (కొచ్చి) | 1 Apr 1958[10] | 3,427,659 | 2,924 కి.మీ2 (1,129 చ. మై.) | ||
ID | ఇడుక్కి జిల్లా | పైనావు (కేరళ) | 26 Jan 1972[12] | 1,093,156 | 4,612 కి.మీ2 (1,781 చ. మై.) |
|
|
KN | కన్నూరు జిల్లా | కన్నూర్ (కేరళ) | 1 Jan 1957[13] | 2,615,266 | 2,961 కి.మీ2 (1,143 చ. మై.) |
|
|
KS | కాసర్గోడ్ జిల్లా | కాసర్గోడ్ | 24 May 1984[14] | 1,390,894 | 1,989 కి.మీ2 (768 చ. మై.) |
|
|
KL | కొల్లాం జిల్లా | కొల్లాం | 1 Nov 1956[16] ( 1 July 1949)[17] |
2,659,431 | 2,483 కి.మీ2 (959 చ. మై.) |
|
|
KT | కొట్టాయం జిల్లా | కొట్టాయం | 1 Nov 1956[19] (1 July 1949 )[17] |
1,983,573 | 2,206 కి.మీ2 (852 చ. మై.) |
|
|
KZ | కోజికోడ్ జిల్లా | కోజికోడ్ | 1 Jan 1957[21] | 3,249,761 | 2,345 కి.మీ2 (905 చ. మై.) |
|
|
MA | మలప్పురం జిల్లా | మలప్పురం | 16 Jun 1969[23] | 4,494,998 | 3,554 కి.మీ2 (1,372 చ. మై.) |
|
|
PL | పాలక్కాడ్ జిల్లా | పాలక్కాడ్ | 1 Jan 1957[24] | 2,952,254 | 4,482 కి.మీ2 (1,731 చ. మై.) |
|
|
PT | పతనంతిట్ట జిల్లా | పతనంతిట్ట | 1 Nov 1982[26] | 1,172,212 | 2,652 కి.మీ2 (1,024 చ. మై.) |
|
|
TV | తిరువనంతపురం జిల్లా | తిరువనంతపురం | 1 Nov 1956[28] (1 July 1949)[17] |
3,355,148 | 2,189 కి.మీ2 (845 చ. మై.) |
|
|
TS | త్రిస్సూర్ జిల్లా | త్రిస్సూర్ | 1 Nov 1956[29] (1 Jul 1949) |
3,243,170 | 3,027 కి.మీ2 (1,169 చ. మై.) |
|
|
WA | వయనాడ్ జిల్లా | కల్పెట్టా | 1 Nov 1980[30] | 846,637 | 2,130 కి.మీ2 (820 చ. మై.) |
|
|
Total | 14 | 14 | 14 | 34,630,192 | 38,852 కి.మీ2 (15,001 చ. మై.) | 78 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.