Remove ads
కేరళ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఆలప్పుళ జిల్లా, భారతదేశం లోని కేరళ రాష్ట్రానికి చెందిన జిల్లా.[5] ఇది 1957 ఆగస్టు 17న అలెప్పీ జిల్లాగా ఏర్పడింది, 1990 లో దీని పేరు ఆలప్పుళ గా [6] మార్చారు. ఇది కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో అతి చిన్న జిల్లా.[7] జిల్లా కేంద్రం అలెప్పీ పట్టణం 2012 లో ఆలప్పుజ్పగా పేరు మార్చారు, అయినప్పటికీ అలెప్పి అనే పేరు జనాల వాడుకలో ఉంద. కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో ఆలప్పుళ ఒకటి. (మలయాళం: ആലപ്പുഴ). 1957 ఆగస్టు 17న ఇది అలెప్పి జిల్లాగా అవతరించింది. 1990లో జిల్లా పేరు అధికారికంగా ఆళపుళాగా మార్చబడింది. ఈ జిల్లా కొబ్బరి పీచు ఉత్పత్తి సంస్థలకు పేరొందింది. కేరళాలోని కొబ్బరి పీచు సంస్థలన్నీ ఆలప్పుళ లోనూ, పరిసర ప్రాంతాలలోనూ ఉన్నాయి. ఈ జిల్లా రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక గమ్యాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. జిల్లాలో కమ్యూనిస్టు పార్టీకి ఆదరణ అధికంగా ఉంది. ఈ జిల్లా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగానూ పోరాడిన పున్నప్ర-వయలార్ పుట్టినిల్లు.
Alappuzha district
Alleppey district | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
District | ||||||||
Clockwise from top: Kettuvallam, Thottappally, Alappuzha Beach, Infopark Campus, Cherthala, Alappuzha Bypass, and Krishnapuram Palace at Kayamkulam. | ||||||||
Nickname: | ||||||||
Coordinates: 9.49°N 76.49°E | ||||||||
Country | India | |||||||
State | Kerala | |||||||
ముఖ్యపట్టణం | Alappuzha | |||||||
Government | ||||||||
• District Collector | Haritha V Kumar, IAS[2] | |||||||
విస్తీర్ణం | ||||||||
• Total | 1,414 కి.మీ2 (546 చ. మై) | |||||||
జనాభా (2011) | ||||||||
• Total | 21,27,789 | |||||||
• జనసాంద్రత | 1,500/కి.మీ2 (3,900/చ. మై.) | |||||||
Languages | ||||||||
• Official | Malayalam, English | |||||||
Time zone | UTC+05:30 (భా.ప్రా.కా) | |||||||
ISO 3166 code | IN-KL | |||||||
Vehicle registration | KL-04 Alappuzha, KL-29 Kayamkulam, KL-30 Chengannur, KL-31 Mavelikara, KL-32 Cherthala, KL-66 Kuttanad | |||||||
HDI (2005) | 0.794[4] ( High) | |||||||
Website | alappuzha.nic.in |
ఆలప్పుళ పట్టణం 18వ శతాబ్దపు రాజు కేశవదాసు హయాంలో అభివృద్ధి రూపు దిద్దుకుంది, అయితే దీనికి కేరళ శాస్త్రీయ సాహిత్యంలో ఆలప్పుళ జిల్లా కేరళ బియ్యం గిన్నెగా చెప్పకునే కుట్టనాడ్ సంఘం ప్రసిద్ధి చెందింది. సా.శ.పూ., మధ్య యుగాలలో గ్రీసు రోమ్లతో ఆలప్పుళ వాణిజ్య సంబంధాలు కలిగి ఉంది. చేరా రాజవంశం కుట్టనాడ్ పట్టణంలో నివసించారు, ప్రజలు వారిని కుట్టువాన్ అని పిలిచేవారు. జిల్లా చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు దేవాలయాలలో గుహలలో, శిలా శాసనాలపై, స్మారక చిహ్నాల రూపాల్లో, అలాగే జున్ను నూలి సందేశం వంటి సాహిత్య రచనలలో పొందుపర్చిఉన్నాయి. చెంగన్నూర్ వ్యాకరణ పండితుడు శక్తిభద్రుడు రచించిన ఆచార్య చూడమని సంస్కృత నాటకం ఆ కాలపు సాహిత్య రచన.
2011 జనాభా లెక్కల ప్రకారం కేరళలోని అలప్పుజా జిల్లాలో మొత్తం జనాభా 2,127,789. వీరిలో 1,013,142 మంది పురుషులు కాగా, 1,114,647 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో మొత్తం 535,958 కుటుంబాలు నివసిస్తున్నాయి. జిల్లా సగటు లింగ నిష్పత్తి 1,100. మొత్తం జనాభాలో 54% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 46% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 95.7% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 95.8% ఉంది. అలాగే అలప్పుజా జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 1000: 1,094 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 1000: 1,108 గా ఉంది అలప్పుజా జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1,92,046, ఇది మొత్తం జనాభాలో 9% ఉఁది. 0-6 ఏళ్లలోపు మగ పిల్లలు 98,444 మంది ఉండగా, ఆడ పిల్లలు 93602 మంది ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది బాలలకు 951 మంది బాలికలు ఉన్నారు. ఇది అలప్పుజా జిల్లా సగటు లింగ నిష్పత్తి (1,100) కంటే తక్కువ. జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 95.72%. అలప్పుజా జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 87.9%, స్త్రీల అక్షరాస్యత రేటు 86.33%.[8]
ఆలప్పుళ నగరం ఈ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయాలను కలిగి ఉంది. ఈ జిల్లాను రెండు రెవెన్యూ డివిజన్లుగా విభజించారు, అవి ఆలప్పుళ, చెంగనూరు.[7]
జిల్లాలో మున్సిపాలిటీలు ఆలప్పుళ, చెర్తలా, చెంగన్నూర్, కయంకుళం, మవెలిక్కర.
ఆలప్పుళ రెవెన్యూ డివిజన్:
చెంగన్నూర్ రెవెన్యూ డివిజన్:
ఆలప్పుళ జిల్లాలో రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి
అలప్పుజ, మావెలికర.
ఆలప్పుళ జిల్లాలో తొమ్మిది శాసనసభ స్థానాలు ఉన్నాయి.[9]
క్ర.సం. లేదు | నియోజకవర్గం | సభ్యుడు | పార్టీ | కూటమి |
---|---|---|---|---|
1 | అరూర్ | దలీమా | సిపిఐ (ఎం) | |
2 | చేర్తల | పి. ప్రసాద్ | సిపిఐ | |
3 | అలప్పుజా | పిపి చితరంజన్ | సిపిఐ (ఎం) | |
4 | అంబలపుజ | హెచ్. సలాం | సిపిఐ (ఎం) | |
5 | కుట్టనాడ్ | థామస్ కె. థామస్ | NCP | |
6 | హరిపాడ్ | రమేష్ చెన్నితల | INC | |
7 | కాయంకుళం | ప్రతిబా హరి | సిపిఐ (ఎం) | |
8 | మావెలికరా | ఆర్. రాజేష్ | సిపిఐ (ఎం) | |
9 | చెంగన్నూర్ | సాజి చెరియన్ | సిపిఐ (ఎం) |
2011 భారత జనగణనల ప్రకారం ఈ జిల్లాలో హిందూ జనాభా 68.64%, క్రిస్టియన్ (ఆర్థడాక్స్, లాటిన్ కాథలిక్‌లు మెజారిటీ) 20.45, ముస్లింల జనభ10.55 గా ఉంది.
ఈ ప్రాంతానికి రోడ్డు రైలు అలాగే వైమానిక రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
దేశంలోనే అతి పొడవాటి జాతీయ రహదారి 66 ఈ జిల్లా నుండి వెళ్తుంది. ఈ రహదారి పన్వేల్ నుండి కన్యాకుమారి వరకు ఉంది, దీని గుండా ముంబై, ఉడుపి, కన్నూర్, కోజికోడ్, ఎర్నాకులం, కొల్లం ఇంకా త్రివేండ్రం వంటి పట్టణాలకు ఇక్కడ నుండి రవాణా సదుపాయం అందుబాటులో ఉంది.[10]
ఆలప్పుళ జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్లు ఉన్నాయి.
పాత నిర్మాణం: - ఆలప్పుళ జిల్లాలో పాత నమోదు సంఖ్యలు ఉన్నాయి: -
ఆలప్పుళ జిల్లాలోని కుట్టనాడులో విస్తారంగా జలమార్గాలు ఉన్నాయి. కుట్టనాడు వరిపొలాలకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడి వ్యవసాయి వరిపండించడానికి ముఖ్యత్వం ఇస్తుంటారు. ఇది ఒకప్పుడు " కేరళత్తిన్ నెల్లర " (రైస్ బౌల్ ఆఫ్ కేరళ) అని అంటారు. వ్యవసాయ ఖర్చులు అధికం ఔతున్న కారణంగా వ్యవసాయం తీవ్రంగా బాధించబడుతుంది. వరిపొలాలు ప్రద్తుతం తక్కువ పెట్టుబడితో పండే ఇతర పంటలను పండిస్తున్నారు. కుట్టనాడు కవి సార్వభౌముడు " తకళి శివశంకర పిళ్ళై " స్వస్థలం.
ఆలప్పుళ జిల్లాలలో మతపరమైన ఉత్సవాలలో పండనిలం శివరాత్రి ఒకటి. పండనిలం పరబ్రహ్మ ఆలయంలో ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఆలయం మావెలిక్కరకు 16 కి.మీ దూరంలో ఉన్న పండనిలం గ్రామంలో ఉంది. ఈ ప్రదేశం ఉత్సవగ్రామంగా గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో వృశ్చిక మహోత్సవం, ఇరుపదియేట్టమోణం వంటి పలు ఉత్సవాలను సంవత్సరమంతా నిర్వహించబడుతుంటాయి. మతసమైక్యతకు పండనిలం నిదర్శనంగా ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.