కె.కె.బిర్లాగా ప్రసిద్ధిచెందిన డా. కృష్ణ కుమార్ బిర్లా (నవంబర్ 11, 1918 - ఆగష్టు 30, 2008) బిర్లా కుటుంబానికి చెందిన సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త. కృష్ణ కుమార్ బిర్లా కంటే కె కె బాబు గానే ఆయన అందరికి పరిచయస్తుడు. ఘణశ్యామ్ దాస్ బిర్లా పెద్ద కొడుకు అయిన కె.కె.బిర్లా రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేసారు. 1990లో భారత ప్రభుత్వము ప్రవేశపెట్టబోయిన ఆర్థిక సంస్కరణలను సమర్ధించిన కొద్దిమంది పారిశ్రామికవేత్తలలో ఈయన ఒకరు. 1991లో హిందీ సాహిత్యాన్ని ప్రోత్సహించుటకు కె కె బిర్లా సంస్థను స్థాపించారు. ప్రతిష్ఠాత్మక బిట్స్ పిలానికి ఛాన్సలర్ (సంచాలకుని) గా కూడా పనిచేసి ఉన్నాడు.

త్వరిత వాస్తవాలు కృష్ణ కుమార్ బిర్లా, జననం ...
కృష్ణ కుమార్ బిర్లా
Thumb
కృష్ణ కుమార్ బిర్లా
జననంకృష్ణ కుమార్ బిర్లా
నవంబర్ 11, 1918
మరణంఆగష్టు 30, 2008
ఇతర పేర్లుకె కె బాబు
ప్రసిద్ధిసుప్రసిద్ధ పారిశ్రామికవేత్త
మూసివేయి

నలభైకి పైగా కంపెనీలు కె కె బిర్లా గ్రూపు ఛత్రంలో ఉన్నాయి. చక్కెర, ఎరువులు, భారీ ఇంజనీరింగ్, వస్త్రాలు, నౌకా రవాణా, వార్తా పత్రికలు వంటి విభిన్న రంగాల్లో కె కె బిర్లా ప్రవేశించి ప్రభావితం చేసారు.

వీరి కుమార్తె పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభనా భార్తియా.

జీవితం

1918 నవంబరు 12 న  రాజస్థాన్ లోని పిలానీలో  కృష్ణ కుమార్ బిర్లా జన్మించాడు. తల్లి  మహా దేవి, తండ్రి ఘనశ్యామ్ దాస్ బిర్లా. కె కె బిర్లా కు  ఇద్దరు సోదరులు ఉన్నారు.  ఘనశ్యామ్ దాస్ బిర్లా మహాత్మా గాంధీ అనుచరుడు. కె కె  బిర్లా 1939 లో లాహోర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ పట్టా పొందాడు.  మరుసటి సంవత్సరం భారతదేశ చక్కెర పరిశ్రమ అభివృద్ధి కి  వెళ్లి,  టెక్స్ టైల్స్, ఇంజినీరింగ్, షిప్పింగ్, ఫెర్టిలైజర్స్ పై ఆసక్తి పెంచుకుని వ్యాపారాన్ని విస్తరించాడు. తన తండ్రి ఊహకు తగినట్లు  దేశ నిర్మాణానికి తోడ్పడటం పరిశ్రమ కర్తవ్యమని భావించే వాడు.బిర్లా  అభిప్రాయాలు వారి అంతస్తుకు ఉన్నట్లు గాకుండా, సమాజ పరంగా  ప్రగతిశీలమైనవి. కె కె  బిర్లా కు మహిళల సమానత్వంపై ఎంతో  బలమైన నమ్మకం ఉండి,  ఆయన కుటుంబ సంప్రదాయాన్ని ఉల్లంఘించి, తన వ్యాపారాలను ( కంపెనీలను)  తన ముగ్గురు కూతుళ్లకు అప్పగించారు.ఆయనకు కుమార్తెలు నందిని నోపానీ, జ్యోతి పొద్దార్, శోభన భాటియా (హిందూస్థాన్ టైమ్స్ వైస్ చైర్మన్, ఎడిటోరియల్ డైరెక్టర్), పలువురు మనవరాళ్లు ఉన్నారు. బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా, ఇండియన్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ కు నేతృత్వం వహించాడు[1] .

పరిశ్రమల స్థాపన

కృష్ణ కుమార్ బిర్లా ఒక దార్శనికుడు, ప్రగతిశీల భావాలు ఉన్న వ్యక్తి, కె.కె.బిర్లా గ్రూపును భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి కి ఎంత గానో తోడ్పడ్డాడు. అతని పరిశ్రమలలో పేరొందిన వాటిలో ఎరువులు( ఫెర్టీ లైజర్స్), సమాచార (మీడియా), బట్టల పరిశ్రమ (టెక్స్ టైల్స్) చక్కెర కర్మాగారాలు,రవాణా,భారీ ఇంజినీరింగ్, ఈపీసీ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫర్నీచర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోఉన్నాయి. అతని నాయకత్వంలో గ్రూప్ 1967 లో గోవాలోని జువారీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా ఎరువుల వ్యాపారంలోకి ప్రవేశించి, జువారీ ఆగ్రో కెమికల్స్ స్థాపనకు దారితీసింది. డాక్టర్ కెకె బిర్లా 1984 నుండి 2002 వరకు వరుసగా మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఉండి, పార్లమెంటులోని అనేక కమిటీలలో పనిచేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ సెంట్రల్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఫిక్కీ), ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్, పలు క్రీడా సమాఖ్యలకు డాక్టర్ బిర్లా నేతృత్వం వహించాడు.

డాక్టర్ కె.కె.బిర్లా పిలానీలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) ఛాన్సలర్ గా ఉన్నాడు. బిట్స్ కు పిలానీ, గోవా, హైదరాబాద్ లలో నాలుగు క్యాంపస్ లు ఉన్నాయి, కె.కె.బిర్లా ఫౌండేషన్ ను స్థాపించాడు,  ఈ ఫౌండేషన్  సాహిత్యం, శాస్త్రీయ పరిశోధన, భారతీయ తత్వశాస్త్రం, కళ, సంస్కృతి,  క్రీడలలో ఉత్తమ ప్రతిభకు వార్షిక అవార్డులను ప్రదానం చేస్తుంది. వైజ్ఞానిక, చారిత్రక, సాంస్కృతిక అంశాల్లో పరిశోధనలు చేసే కె.కె.బిర్లా అకాడమీని స్థాపించాడు[2][3].

సమాజ సేవలు

కె.కె.బిర్లా మెమోరియల్ సొసైటీ విద్య, గ్రామీణాభివృద్ధి, ఉపాధి, నేల, నీటి ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో సమాజాలకు (కమ్యూనిటీలకు) సహాయం చేయడం జరుగుతున్నది. ఈ సొసైటీ రాష్ట్ర, గ్రామ స్థాయిలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది, రైతులు గరిష్ట నేల , నీటి ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవడంలో సహాయపడుతుంది. సమాజంలోని అణగారిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడం, మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ సంస్థ లక్ష్యం. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలను సొసైటీ నడుపుతున్నది [4].

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.