Remove ads
From Wikipedia, the free encyclopedia
కె.హెచ్.మునియప్ప కర్ణాటాక రాష్ట్రమునకు చెందిన రాజకీయ నాయకుడు. 10, 11, 12, 13, 14, 15, 16 వ లోక్సభ సభ్యుడు. ఇతను కర్నాటక లోని కోలార్ నియోజకవర్గం (ఎస్.సి) నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున్ గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
కె.హెచ్.మునియప్ప | |||
కేంద్ర సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 28 అక్టోబర్ 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
---|---|---|---|
ముందు | వాయలార్ రవి | ||
నియోజకవర్గం | కోలార్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | కోలార్, కర్నాటక | 1948 మార్చి 7||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | ఎం. నాగరత్నమ్మ | ||
సంతానం | 1 కుమారుడు, 4 కుమార్తె | ||
నివాసం | బెంగుళూరు | ||
మతం | హిందూ | ||
వెబ్సైటు | www.khmuniyappa.com | ||
మూలం | biodata website |
మునియప్ప 7 మార్చి 1948 వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లా కంబద హళ్ళిలో జన్మించాడు. ఇతడి తల్లి దండ్రులు: శ్రీమతి వెంకట్మ ., శ్రీ హనుమప్ప.
ఇతడు బెంగళూరు విశ్వ విద్యాలయం నుండి బి.ఎ. ఎల్.ఎల్.బి పట్టా పొందాడు. కొంతకాలము న్యాయవాద వృత్తిని స్వీకరించాడు., సామాజిక కార్యకర్తగా పనిచేశాడు.
మునియప్ప 22 జూన్ నెల 1978 వ సంవత్సరంలో నాగరత్నమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు కలరు.
ఇతడు 1991 లో 10 వ లోక్ సభకు కాంగ్రెస్ పార్టీతరపున లోక్ సభలో సభ్యుడయ్యాడు. 1994 లో అఖిల భారత కాంగ్రెస్ కు జాయింట్ సెక్రట్రెటరీగా వ్యవహరించాడు. 1996 లో తిరిగి 11 వ లోక్ సభకు ఎన్నికయ్యాడు. 1998 లో 12 వ లోక్ సభకు ఎన్నియ్యాడు. 13 వ లోక్ సభకు కూడా వరుసగా నాలుగవ సారి కూడా ఎన్నికయ్యాడు. 2004 లో కూడా 14 వ లోక్ సభకు ఎన్నికయి కేంద్రంలో నౌకా రవాణ మంత్రిగా పనిచేశాడు. 2009 లో 15 వ లోక్ సభకు ఎన్నికయి కేంద్రంలో రైల్వే శాఖా మంత్రిగా పనిచేశాడు.[1][2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.