From Wikipedia, the free encyclopedia
కృష్ణ పరమాత్మ 1986 ఆగస్టు 29న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] శ్రీ పంచవటి చిత్రాలయ కంబైన్స్ పతాకంపై కొంగటి వెంకటేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, రాధిక నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.[3][4]
కృష్ణ పరమాత్మ | |
---|---|
దర్శకత్వం | విజయ నిర్మల |
నిర్మాత | కొంగటి వెంకటేశ్వరరావు |
తారాగణం | కృష్ణ, రాధిక |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | శ్రీ పంచవటి చిత్రాలయ కంబైన్స్ |
విడుదల తేదీs | 29 ఆగస్టు, 1986 |
సినిమా నిడివి | 141 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రాజకీయ నాయకులుగా, పెద్ద మనుషులుగా, శాంతి భద్రతలను పరిరక్షించే అధికారులుగా చెలామణి అవుతున్న కొందరు ఎన్నో అన్యాయాలకు పాల్పడుతూ, సంఘాన్ని దోచుకొంటూ వుండగా సైన్యంలో మేజర్ గా వున్న ఒక యువకుడు వచ్చి యువతను జాగృతం చేసి, స్వార్థపరుల ఆటకట్టించిన నేపథ్యంలో రూపొందిన సినిమా.
ఈ చిత్రానికి జె. వి. రాఘవులు సంగీతం అందించాడు.[5]
Seamless Wikipedia browsing. On steroids.