కిమిడి కళా వెంకటరావు

From Wikipedia, the free encyclopedia

కిమిడి కళా వెంకటరావు

కిమిడి కళావెంకటరావు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు.[1] అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగానికి అధ్యక్షునిగా నియమింపబడ్డాడు.[2]

త్వరిత వాస్తవాలు కిమిడి కళావెంకటరావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం ...
కిమిడి కళావెంకటరావు
కళావెంకటరావు
Thumb
కిమిడి కళావెంకటరావు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం
Incumbent
Assumed office
8 జూన్ 2014 - ప్రస్తుతం
అంతకు ముందు వారుమీసాల నీలకంఠం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
ఉణుకూరు శాసనసభ నియోజకవర్గం
In office
1983–1994
అంతకు ముందు వారుబాబూ పరాంకుశం ముదిలి
తరువాత వారుపాలవలస రాజశేఖరం
In office
2004–2009
అంతకు ముందు వారుకిమిడి గణపతిరావు
తరువాత వారునియోజకవర్గ విలీనం
వ్యక్తిగత వివరాలు
జననం (1952-07-01) 1 జూలై 1952 (age 72)
రేగిడి శ్రీకాకుళం జిల్లా
రాజకీయ పార్టీతెలుగు దేశం
జీవిత భాగస్వామిచంద్రమౌళి
సంతానంకెవిఎస్‌ఆర్ మల్లిక్ నాయుడు, కె సాయిమిమి, ఎ యశస్విని
తల్లిదండ్రులుసూరపునాయుడు (తండ్రి)
అన్నపూర్ణమ్మ (తల్లి)
నివాసంరేగిడి, శ్రీకాకుళం జిల్లా
కళాశాలమహారాజా కళాశాల, విజయనగరం
వృత్తివ్యవసాయం
మూసివేయి

జీవిత విశేషాలు

కిమిడి కళావెంకటరావు శ్రీకాకుళం జిల్లా రేగిడి గ్రామ వాస్తవ్యుడు. అతను 1952 జూలై 1న జన్మించాడు. బి.ఎ., బి.ఎల్ డిగ్రీలను చదివాడు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పార్టీలోకి చేరాడు. 1983, 1985, 1989, 2004 ఎన్నికలలో ఉణుకూరు శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు శాసన సభ్యునిగా తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందాడు. తెలుగుదేశం ప్రభుత్వాలలో వాణిజ్యపన్నులు, పురపాలక, హోం శాఖలలో మంత్రిగా పనిచేసాడు. తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1998 నుండి 2004 వరకు రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించాడు.[3] 2009 శాసనసభ ఎన్నికలలో చిరంజీవి నేతృత్వంవహించిన ప్రజారాజ్యం పార్టీలోకి చేరాడు.[4] 2009లో ఉణుకూరు నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలలో విలీనం అయ్యేసరికి అతను ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మీసాల నీలకంఠం చేతిలో ఓడిపోయాడు. తిరిగి తెలుగుదేశం పార్టీలోనికి రావాలని ఉన్నా కొన్ని కారణాల మూలంగా రాలేకపోయాడు. 2012 నుండి ప్రజారాజ్యం పార్టీని వదిలిపెట్టి 2 సంవత్సరముల పాటు ఏ రాజకీయపార్టీలో క్రయాశీలకంగా వ్యవహరించలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు[5][6][7]

నిర్వహించిన పదవులు

  • పురపాలక శాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
  • వాణిజ్యపన్నుల శాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
  • హోం శాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
  • శక్తి వనరుల శాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.[8]
  • రాజ్యసభ సభ్యుడు

మూలాలు

బయటి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.