Remove ads
నికోబార్ జిల్లా పరిపాలనా కెేంద్రం From Wikipedia, the free encyclopedia
కార్ నికోబార్, నికోబార్ దీవులకు ఉత్తరాన ఉంది. ఇది భారత కేంద్రపాలిత ప్రాంత భూభాగమైన అండమాన్ నికోబార్ దీవులుకు చెందిన మూడు జిల్లాల పరిపాలనా కేంద్రాలలో నికోబార్ జిల్లా పరిపాలనా కెేంద్రం.[3]
భూగోళశాస్త్రం | |
---|---|
ప్రదేశం | బంగాళాఖాతం |
అక్షాంశ,రేఖాంశాలు | 9.17°N 92.78°E |
ద్వీపసమూహం | నికోబార్ (అండమాన్ నికోబార్ దీవులు) |
ప్రక్కన గల జలాశయాలు | హిందూ మహాసముద్రం |
మొత్తం ద్వీపాలు | 1 |
ముఖ్యమైన ద్వీపాలు |
|
విస్తీర్ణం | 126.9 కి.మీ2 (49.0 చ. మై.)[1] |
పొడవు | 15 km (9.3 mi) |
వెడల్పు | 12 km (7.5 mi) |
తీరరేఖ | 51 km (31.7 mi) |
అత్యధిక ఎత్తు | 10 m (30 ft) |
నిర్వహణ | |
జిల్లా | నికోబార్ |
ద్వీపాల సముదాయం | నికోబార్ దీవులు |
భారతదేశ ఉప విభాగం | కార్ నికోబార్ ఉపవిభాగం |
తాలూకా | కార్ నికోబార్ తాలూకా |
అతిపెద్ద ప్రాంతము | మలక్కా (pop. 1637) |
జనాభా వివరాలు | |
జనాభా | 17841 (2014) |
జన సాంద్రత | 140.5 /km2 (363.9 /sq mi) |
జాతి సమూహాలు | హిందూ, నికోబారీస్ ప్రజలు |
అదనపు సమాచారం | |
పిన్‌కోడ్ సంఖ్య | 744301 |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 03192 |
ISO కోడ్ | IN-AN-00[2] |
అక్షరాస్యత | 84.4% |
సగటు వేసవికాల ఉష్ణోగ్రత | 30.2 °C (86.4 °F) |
సగటు శీతాకాల ఉష్ణోగ్రత | 23.0 °C (73.4 °F) |
లింగ నిష్పత్తి | 1.2♂/♀ |
జనాభా కోడ్ | 35.638.0001 |
అధికార భాషలు | హిందీ, ఆంగ్లం, తమిళం కార్ భాష (ప్రాంతీయ) |
ఈ ప్రాంతంలోని సముద్రపు ప్రయాణీకులు ఈ ద్వీపాన్ని "నగ్న ఉత్తర భూమి" అని పిలుస్తారు.దీనిని ప్రత్యక్ష పూర్వీకులు పిలిచే పూర్వ పేరు కార్ నక్కావర్ అని పిలిచేవారు.ప్రస్తుత పేరు కార్ నికోబార్. 2004 హిందూ మహాసముద్రం భూకంపం వల్ల సంభవించిన నీటి ప్రళయం (సునామీ) కారణంగా ఈ ద్వీపం తీవ్రంగా ప్రభావితమైంది, దాని ఫలితంగా ఇది అనేక మరణాలకు గురైంది. మౌలిక సదుపాయాలను కూడా దెబ్బతీసింది.
2004 హిందూ మహాసముద్రం భూకంపం కేంద్రం నుండి 750 కి.మీ (750 మైళ్లు) దూరంలో ప్రభావం చూపి, దాని తరువాత వచ్చిన సునామీ నికోబార్ దీవులను గొప్ప శక్తితో 30 అడుగులు (9 మీ) ఎత్తుతో తాకినట్లు ప్రత్యక్ష సాక్షులు నివేదించారు. 2004 డిసెంబరు 30 నాటికి క్షతగాత్రుల సంఖ్య తెలియదు, కానీ ఎక్కువ ఉన్నట్లు అంచనావేసారు. ఒక ప్రాణాలతో బయటబడివ వ్యక్తి అసోసియేటెడ్ ప్రెస్‌తో ఇలా అన్నాడు: " నిలబడి ఉన్న ఒక గుడిసె కూడా లేదు. అన్నీ శిధిలమైనవి. చాలా మంది ప్రజలు తీరం నుండి వెళ్లిపోయారు భారత ప్రభుత్వం ఇక్కడ తాత్కాలిక ఆశ్రయాలు, వారి ప్రతి ప్రాధమిక అవసరాలకు రాయితీ వంటి అనేక సహాయ కార్యక్రమాలను చేసింది అని తెలిపాడు "
కార్ నికోబార్ లిటిల్ అండమాన్, నాన్కౌరీల మధ్య ఉంది. పది-డిగ్రీల ఛానెల్‌కు దక్షిణంగా ఉన్నప్రాంతంలో కార్ నికోబార్ ప్రధాన కార్యాలయం ఉంది. కార్ నికోబార్ ఉత్తరాన కొన్ని కొండలు లోపలి భాగంలో చిన్న కొండ ప్రాంతాలుగా ఉండటం మినహా, మిగతా సముద్ర ప్రాంతం చాలా చదరంగా ఉంటుంది.ఇది ఒక వెండినిపోలే తీరప్రాంతం.ఇసుక, బంకమట్టితోకూడి మొక్కలు పెరిగే ప్రాంతంగా ఉంటుంది.[4] ఇదిచుట్టూ గర్జించే సముద్రంతో మంత్రముగ్ధులను చేసే తీర ప్రాంతాలతో, కొబ్బరిచెట్ల ఆకుల సమూహాలతో కప్పబడిన ఒక చదునైన సారవంతమైన ద్వీపంగా ఉంటుంది. ఉత్తర మధ్య అండమాన్, దక్షిణ అండమాన్లతో పోలిస్తే, కార్ నికోబార్ ఒక చిన్న ద్వీపం, ఇది కేవలం 126.చ. కి.మీ (49.0 చ.మైళ్లు) మాత్రమే కలిగి ఉంది.ఇక్కడి నేల వ్యవసాయ పంటల పెరుగుదలకు ఆటంకం కలిగించే అధిక ఇసుక, బంకమట్టితో ఉంటుంది.కార్ నికోబార్ ప్రాంతం తోటల పంటలకు అనుకూలంగా ఉంటుంది.కొబ్బరి, అరేకా గింజలు ఇక్కడ ప్రధాన ఉత్పత్తులు, వీటిని ఈ ప్రాంతంలో విరివిగా పండిస్తారు.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కార్ నికోబార్ ద్వీపంలో 4250 గృహాలు ఉన్నాయి. సమర్థవంతమైన అక్షరాస్యత రేటు (అనగా 6 అంతకంటే తక్కువ వయస్సు గల పిల్లలను మినహాయించి జనాభా అక్షరాస్యత రేటు) 100%గా ఉంది. పట్టణ మొత్తం జనాభా 17841 మందికాగా, వారిలో పురుషులు 9735 మంది ఉండగా, స్త్రీలు 8106 మంది ఉన్నారు.6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు 1929 మంది ఉన్నారు,వారిలో బాలురు 982 మంది, బాలికలు 947 మంది ఉన్నారు.షెడ్యూల్డ్ కులం 0,షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు మొత్తం 15027మంది ఉన్నారు.వారిలో పురుషులు 7659 మంది ఉండగా,స్త్రీలు 7368 మంది ఉన్నారు.మొత్తం జనాభాలో 6 సంవత్సరాల వయస్సుగల పిల్లలు పోను మొత్తం అక్షరాస్యులు 12627 మందికాగా,వారిలో పురుషులు 7436మంది ఉండగా,స్త్రీలు 5191 మంది ఉన్నారు.మొత్తం జనాభాలో కార్మికులు (అన్ని రకాలుకు చెందిన వారు) 8844 మంది ఉండగా,వారిలో పురుషులు 5964కాగా,స్త్రీలు 2880 మంది ఉన్నారు.[5]
కార్ నికోబార్, పొరుగున ఉన్న బాటిమల్వ్ ద్వీపంతో పాటు, ఇది ఒక తహసీల్ . జిల్లాలోని మిగతా అన్ని ద్వీపాలను నిర్వహించడానికి నాన్కౌరీ, కాంప్‌బెల్ బే మరో రెండు తహసిల్స్ ఉన్నాయి . పరిపాలనా రాజధాని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కార్ నికోబార్ ఎయిర్ ఫోర్స్ బేస్ దగ్గర ఉంది, దీనిని 'హెడ్ క్వార్టర్స్' అని పిలుస్తారు, ఇది ఈ చిన్న ద్వీపంలో కొన్ని షాపులు, హాస్పిటల్, బ్యాంక్, పోస్టాఫీసు, పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం, డిప్యూటీ కమిషనర్ కార్యాలయం, కొన్ని ఇతర ప్రభుత్వ కార్యాలయాలు. కార్ నికోబార్ అధికారిక పిన్ కోడ్ 744301.[6] కార్ నికోబార్ వైశాల్యం నికోబార్ సమూహం విస్తీర్ణంలో 7% కన్నా తక్కువ అయినప్పటికీ, 2011 జనాభా లెక్కల ప్రకారం దాని జనాభా [7] 17841 మొత్తం నికోబార్ జనాభాలో 48%గా ఉంది.
కార్ నికోబార్ దీవులలో నికోబార్స్ మధ్య, దక్షిణ ద్వీపాలలో ఆధిపత్యం వహించే సతత హరిత అడవులు లేవు.[8] ద్వీపంలో ఎక్కువ భాగం కొబ్బరి తోటలతో విస్తరించి ఉంది, సహజ వృక్షజాలం అంతర్గత ప్రాంతాలలో మాత్రమే ఉంది.
కార్ నికోబార్ జిల్లా ప్రధాన కార్యాలయం 260 కి.మీ. (162 మై.) పోర్ట్ బ్లెయిర్ నుండి. పోర్ట్ బ్లెయిర్, నికోబార్ జిల్లా మధ్య ఓడ సేవ అందుబాటులో ఉంది. సాధారణంగా ఓడ వారంలో రెండుసార్లు లభిస్తుంది. పోర్ట్ బ్లెయిర్‌లోని షిప్పింగ్ సర్వీసెస్ (03192-245555) డైరెక్టర్ కార్యాలయం నుండి ఓడ టికెట్ పొందవచ్చు.[9] అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అడ్మినిస్ట్రేషన్ భారత వైమానిక దళ సహకారంతో పోర్ట్ బ్లెయిర్ , వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, కాంప్‌బెల్ బే, కార్ నికోబార్ ఎయిర్ ఫోర్స్ బేస్ మధ్య చార్టర్ సేవలను నిర్వహిస్తున్నాయి. కార్ నికోబార్, పోర్ట్ బ్లెయిర్, నికోబార్ జిల్లాలోని ఇతర ద్వీపాల మధ్య పవన్ హన్స్ హెలికాప్టర్ సాధారణ సేవ కూడా అందుబాటులో ఉంది.
కార్ నికోబార్ ద్వీపం ఇది భూమధ్యరేఖ నుండి కేవలం 9 డిగ్రీలలో ఉన్నందున వాతావరణ పరంగా ఉష్ణమండలంగా ఉంటుంది.వార్షిక వర్షపాతం 400 ఎంఎం. ద్వీపంలో గత పదేళ్ల సమాచారం ప్రకారం సగటుసాపేక్ష ఆర్ద్రత 79%, సగటు గరిష్ట ఉష్ణోగ్రత 30.20 సి, కనిష్ట ఉష్ణోగ్రత 23.00 సి. అని సూచిస్తుంది
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.