Remove ads
తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు From Wikipedia, the free encyclopedia
కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
కసిరెడ్డి నారాయణ రెడ్డి | |||
ఎమ్మెల్యే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 03 డిసెంబర్ 2023 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | కల్వకుర్తి | ||
---|---|---|---|
శాసనసమండలి సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 5 జనవరి 2016 - 08 డిసెంబర్ 2023 | |||
నియోజకవర్గం | స్థానిక సంస్థల నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 18 జనవరి 1964 ఖానాపూర్ గ్రామం, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం [1] | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలంగాణ రాష్ట్ర సమితి (2016 - 2023 అక్టోబర్ 01) | ||
తల్లిదండ్రులు | కసిరెడ్డి దుర్గారెడ్డి, కిష్టమ్మ | ||
జీవిత భాగస్వామి | మాధవి | ||
సంతానం | దుర్గాప్రసాద్ & కృష్ణ వంశీధర్‌రెడ్డి | ||
నివాసం | వెంకటాద్రినగర్, ఆస్మాన్ ఘడ్, మలక్‌పేట్, హైదరాబాద్ |
కసిరెడ్డి నారాయణరెడ్డి 1964 జనవరి 18లో తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం, ఖానాపూర్ గ్రామం లో కసిరెడ్డి దుర్గారెడ్డి, కిష్టమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఖానాపూర్ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు చుక్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలో, తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. కసిరెడ్డి నారాయణరెడ్డి షాద్‌నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు, హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసి, రాజస్థాన్‌లోని సింగానియా యూనివర్సిటీ నుండి ఎంటెక్ పూర్తి చేశాడు.
కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఖర్చుల కోసం టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ట్యూషన్ చెప్పేవాడు. ఆ సమయంలోనే ఒక స్కూల్ పెట్టాలని ఆలోచన ఏర్పడడంతో, ఎంటెక్ పూర్తి చేశాక 1986–87లో హైదరాబాద్ దిల్సుఖ్నగర్ లో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 64 బ్రిలియంట్ గ్రామాల్ స్కూళ్లను ఏర్పాటు చేశాడు. ఆయనకు మూడు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
కసిరెడ్డి నారాయణరెడ్డి 2014లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి టికెట్ ఆశించాడు, టికెట్ రాకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచాడు. నారాయణరెడ్డి 2016లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన 2016లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందాడు.[2] నారాయణరెడ్డి 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ టికెట్ ఆశించాడు, కానీ టికెట్ దక్కలేదు.[3][4]
తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండవసారి ఆయన పేరును టిఆర్ఎస్ అధిష్టానం 2021 నవంబరు 22న ఖరారు చేసింది. ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవంబరు 23న నామినేషన్ పత్రాలు దాఖలు చేశాడు.[5] ఆయన మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై నవంబరు 26న గెలుపు పత్రాన్ని అందుకున్నాడు.[6] కసిరెడ్డి నారాయణరెడ్డి 2021 జనవరి 27న ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు.[7]
కసిరెడ్డి నారాయణరెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించగా, ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు తిరిగి సీటు కేటాయించడంతో అసంతృప్తితో ఆయన 2023 అక్టోబరు 01న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి[8][9], 2023 అక్టోబరు 01న న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాడు.[10]
ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి[11] తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై 5410 స్వల్ప మెజారిటీతో గెలిచాడు.[12] ఆయన కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో డిసెంబర్ 08న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు.[13]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.