Remove ads
భారతీయ-అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు From Wikipedia, the free encyclopedia
సి.ఆర్.రావుగా పేరొందిన కల్యంపూడి రాధాకృష్ణారావు (1920 సెప్టెంబరు 10 - 2023 ఆగస్టు 22) గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు. ఆయన అమెరికన్ భారతీయుడు. ఆయన పెన్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్ గా చేసాడు. అతనికి ఎన్నో గౌరవ పురస్కరాలు, డిగ్రీ పట్టాలు, గౌరవాలు అందాయి. వాటిలో 2002కు గానూ యూఎస్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ చెప్పుకోదగింది. ది అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ ప్రకారం ఇతను "ఒక చారిత్రక వ్యక్తి.[2] ఇతని పనితనం గణాంకశాస్త్రాన్నే కాక ఎకనమిక్స్, జెనెటిక్స్, జియాలజీ, నేషనల్ ప్లానింగ్, డెమొగ్రఫీ, బయోమెట్రీ , మెడిసిన్ వంటి శాస్త్రాలను ప్రభావితం చేస్తోంది." టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇతడు భారతదేశపు పది మంది నిత్య శాస్త్రజ్ఞులలో ఒకడు.[3] [4]
కల్యంపూడి రాధాకృష్ణారావు | |
---|---|
జననం | 1920 సెప్టెంబరు 10 హదగళి, మైసూరు రాజ్యం, బ్రిటీషు ఇండియా |
మరణం | 2023 ఆగస్టు 22 102) బఫెలో, న్యూయార్క్, యు.ఎస్. | (వయసు
నివాసం | భారతదేశం, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా |
పౌరసత్వం | అమెరికా[1] |
రంగములు | గణితశాస్త్రం , గణాంకశాస్త్రం |
వృత్తిసంస్థలు | భారత గణాంకశాస్త్ర సంస్థ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పెన్న్ స్టేట్ విశ్వవిద్యాలయం స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, బఫెలో |
చదువుకున్న సంస్థలు | ఆంధ్ర విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం కింగ్స్ కళాశాల, కేంబ్రిడ్జి |
పరిశోధనా సలహాదారుడు(లు) | రోనాల్డ్ ఫిషర్ |
డాక్టొరల్ విద్యార్థులు | Radha Laha V. S. Varadarajan S. R. Srinivasa Varadhan |
ప్రసిద్ధి | క్రేమర్–రావు పరిమితి రావు-బ్లాక్‌వెల్ సిద్ధాంతం Orthogonal arrays Score test |
ముఖ్యమైన పురస్కారాలు | పద్మవిభూషణ్ National Medal of Science S. S. Bhatnagar Prize Guy Medal (Silver 1965, Gold 2011) |
రాధాకృష్ణారావు 1920 సెప్టెంబరు 10న బళ్ళారి జిల్లాలోని హదగళిలో తెలుగు కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి పోలీసు ఇనస్పెక్టరుగా అక్కడ పనిచేసేవాడు. నూజివీడు, నందిగామ గ్రామాల్లో ఆయన చదివాడు. విశాఖపట్నంలో స్కూల్ ఫైనల్ నుండి డిగ్రీ వరకు స్కాలర్‌షిప్ తో విద్యాభ్యాసం చేసాడు. ఏ తరగతిలోనూ ఫస్టు ర్యాంకు మిస్ కాలేదు. బి.ఎ (ఆనర్స్) పూర్తి చేసాడు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో ఎం.ఎస్.సి డిగ్రీని పొందాడు. విశాఖపట్నం నుండి కలకత్తా వెళ్ళి ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో చేరాడు. 1943లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.[2] ప్రపంచంలో గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ మొట్టమొదట పొందిన కొద్దిమంది వ్యక్తులలో ఆయన ఒకరు.[ఆధారం చూపాలి]ఆయన ఆ విశ్వవిద్యాలయంలో మొదటి ర్యాంకును సాధించాడు. ఆ సంస్థలోనే లెక్చరర్ గా ఉద్యోగం చేసాడు. ఆ సమయంలో ఎన్నో పరిశోధనలు చేసాడు. ఆ పరిశోధనలతో భాగంగానే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు కొనసాగించే అవకాశాన్ని అందుకున్నాడు. ఆయన పరిశోధనాంశములతో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంకు చెందిన ప్రెస్ ఒక గ్రంథ రచనను వెలువరించింది. అప్పటికి ఈయన వయస్సు 26 యేండ్లు మాత్రమే.
ఆయన 2023 ఆగస్టు 22న న్యూయార్క్‌లోని బఫెలోలో 102 సంవత్సరాల వయస్సులో మరణించాడు.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.