కల్పెట్టా, భారతదేశం, కేరళ రాష్ట్రం, వాయనాడ్ జిల్లాలో ఒక ప్రధాన నగరం.ఇది పురపాలక సంఘం.కల్పెట్ట వాయనాడ్ జిల్లా ప్రధానకార్యాలయం.[2] అలాగే వైతిరి తాలూకా ప్రధాన కార్యాలయం.ఇది దట్టమైన కాఫీ ,టీ తోటల పర్వతాలతో చుట్టుముట్టబడి సందడిగా ఉండే పట్టణం. సముద్ర మట్టానికి సుమారు 780 మీటర్ల ఎత్తులో కోజికోడ్ - మైసూర్ జాతీయ రహదారి -766 (గతంలో ఎన్ఎచ్ 212) పై ఉంది. కల్పేట కోజికోడ్ నుండి 72 కిమీ, మైసూర్ నుండి 140 కి.మీ.దూరంలో ఉంది. జిల్లా పరిపాలనా రాజధానిగా కాకుండా, జిల్లాలో కేంద్ర స్థానం, అత్యధికంగా సందర్శించే పర్యాటక ప్రదేశాలకు సమీపంలో ఉండటం వల్ల వయనాడ్‌లో కల్పెట్ట పర్యాటక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. కల్పెట్ట నగరం లోపల, చుట్టుపక్కల మంచి సంఖ్యలో హోటళ్లు, రిసార్ట్‌లు ఉన్నాయి.
Kalpetta | |
---|---|
Municipality | |
Coordinates: 11.622550°N 76.081252°E | |
Country | India |
రాష్ట్రం | Kerala |
జిల్లా | Wayanad |
విస్తీర్ణం | |
• Total | 40.74 కి.మీ2 (15.73 చ. మై) |
Elevation | 780 మీ (2,560 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 31,580 |
• జనసాంద్రత | 780/కి.మీ2 (2,000/చ. మై.) |
Languages | |
• Official | Malayalam, English |
Time zone | UTC+05:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 673121 (Kalpetta Head PO), 673122 (Kalpetta North) |
Telephone code | +91 4936 |
Vehicle registration | KL-12 |
Website | http://www.kalpettamunicipality.in |
చరిత్ర
వాయనాడ్‌లో భారత స్వాతంత్య్ర ఉద్యమం మొదట కల్పెట్ట ప్రారంభమైంది.1921లో ధర్మరాజ అయ్యర్ నేతృత్వంలో మొదటి రాజకీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కెపి కేశవ మీనన్,ఎకె గోపాలన్ పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు కూడా అదే సమయంలో జరిగింది.మహాత్మా గాంధీ 1934 జనవరి 14న కల్పెట్ట సందర్శించాడు [3] 1980 నవంబరు 1న వాయనాడ్ జిల్లా ఏర్పడినప్పుడు కల్పెట్ట ప్రధాన కార్యాలయంగా మారింది. కల్పెట్ట జిల్లా కేంద్రంగా మారినప్పుడు గ్రామ పంచాయతీగా ఉంది.ఇది 1990 ఏప్రిల్ 1 న పురపాలక సంఘ స్థాయిని పొందింది.
జనాభా గణాంకాలు
కల్పెట్ట వాయనాడ్ జిల్లాలోని వైత్తిరి తాలూకాలో ఉన్న ఒక పురపాలకసంఘ నగరం. కల్పెట్ట నగరం పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 7,519 కుటుంబాలు నివసిస్తున్నాయి. కల్పేట మొత్తం జనాభా 31,580 అందులో 15,401 మంది పురుషులు కాగా, 16,179 మంది స్త్రీలు ఉన్నారు. కల్పేట సగటు లింగ నిష్పత్తి 1,051. కల్పేట నగరంలో 0-6 సంవత్సరాల వయస్సు లోపు గల పిల్లల జనాభా 3597, ఇది మొత్తం జనాభాలో 11% గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 1836 మంది మగ పిల్లలుఉండగా, 1761 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 959, ఇది సగటు లింగ నిష్పత్తి (1,051) కంటే తక్కువ. అక్షరాస్యత రేటు 91.2%. దీనిని వాయనాడ్ జిల్లాలో 89% అక్షరాస్యతతో పోలిస్తే కల్పెట్టలో ఎక్కువ అక్షరాస్యత ఉంది. కల్పెట్టలో పురుషుల అక్షరాస్యత రేటు 94.13% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 88.4%గా ఉంది.[4]
ప్రజలు
జిల్లా కేంద్రం కావడంతో కల్పెట్ట పట్టణంలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అంతేకాకుండా, మాధ్యమిక సంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, తదితర జిల్లా స్థాయి కార్యాలయాలు కల్పెట్టలో పని చేస్తున్నాయి.కేరళలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే కల్పెట్టలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సామరస్యంగా జీవిస్తున్నారు. కల్పెట్టలో గణనీయమైన జైనులు జనాభా ఉంది.
రవాణా
ఇతర కేరళ, పొరుగున ఉన్న దక్షిణ భారత నగరాలతో కల్పెట్ట నగరానికి చాలా మంచి రోడ్లు అనుసంధాన సౌకర్యాలు ఉన్నాయి. జాతీయ రహదారి 766 కల్పెట్టను కోజికోడ్, మైసూర్‌లతో కలుపుతుంది. రాష్ట్ర రహదారులు కల్పెట్టను తమిళనాడులోని ఊటీ, కర్ణాటకలోని మడికేరితో కలుపుతాయి.కేరళ రాష్ట్ర సరిహద్దు అయిన వయనాడ్ జిల్లా సరిహద్దును దాటి జాతీయ రహదారి 766లో మైసూర్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి 766 బందీపూర్ జాతీయ ఉద్యానవనం గుండా వెళుతుంది. 2009 నుండి ఈ మార్గంలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రి ప్రయాణం నిషేధం విధించబడింది [5] ప్రత్యామ్నాయ మార్గం కల్పెట్ట వద్ద జాతీయ రహదారి 766 నుండి బయలుదేరి, మనంతవాడి, కుట్ట, గోనికొప్పల్, హున్సూర్ మీదుగా మైసూర్ వెళ్లవచ్చు. కల్పెట్ట నుండి 90 కి.మీ.దూరంలో విమానాశ్రయం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం, కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం 100 కి.మీ.దూరంలో ఉన్నాయి.
పర్యాటక ఆకర్షణలు
- మహాత్మా గాంధీ మ్యూజియం
- మైలడిప్పర
- పూకోడ్ సరస్సు
- ఎన్ ఊరు గిరిజన వారసత్వ గ్రామం
- అనంతనాథ్ స్వామి ఆలయం
- లక్కిడి వ్యూ పాయింట్
- చెంబ్రా శిఖరం
- సూచిపర జలపాతం
- కాంతన్‌పర జలపాతం
- 900 కాండి
- కురుంబలకోట కొండ
- బాణాసుర సాగర్ ఆనకట్ట
ఆర్థిక వ్యవస్థ
మిల్మా (కేరళ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్) వాయనాడ్ డెయిరీ కల్పేట పురపాలక సంఘ పరిమితుల్లోని చుజాలిలో ఉంది.కల్పేటలో కిన్‌ఫ్రా స్థాపించిన ఒకరకమైన చిన్న పారిశ్రామికవాడ ఉంది.ఈ పార్క్ నుండి అనేక చిన్న తరహా పరిశ్రమలు పనిచేస్తున్నాయి.ఇటీవలి సంవత్సరాలలో పర్యాటక, వైద్య పరిశ్రమలు బాగా వృద్ధి చెందాయి విజృంభించింది.ఇది వయనాడ్ అంతటా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన రిసార్ట్‌లకు దారితీసింది.వైత్తిరి తాలూకాలోని కల్పెట్ట పరిసర ప్రాంతాలలో అత్యధికంగా హోటళ్లు, రిసార్ట్‌లు ఉన్నాయి.
చదువు
- కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ, పూకోడ్ (కల్పెట్ట నుండి14 కిమీ)
- పూకోడ్‌లోని కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ (కల్పెట్ట నుండి 14 కిమీ)
- లక్కిడిలో ఉన్న ఓరియంటల్ స్కూల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (కల్పెట్ట నుండి 15 కిమీ)
- మెప్పాడిలో ఉన్న డిఎం. విమ్స్ మెడికల్ కాలేజీ, వయనాడ్ జిల్లాలో ఉన్న ఏకైక వైద్య కళాశాల. కల్పెట్ట నుండి 15 కిమీ
- కాలేజ్ ఆఫ్ డైరీ సైన్స్ అండ్ టెక్నాలజీ, పూకోడ్ డెయిరీ సైన్స్ & టెక్నాలజీలో బి.టెక్. డిగ్రీ కోర్సును అందిస్తోంది
- మెప్పాడిలో ఉన్నడిఎం. విమ్స్ నర్సింగ్ కళాశాల
- కేంద్రీయ విద్యాలయ, కల్పెట్ట
- ఎస్కె..ఎం.జె హయ్యర్ సెకండరీ స్కూల్, కల్పెట్ట
- డి పాల్ పబ్లిక్ స్కూల్, కల్పెట్ట
- ఎన్ఎస్ఎస్ హయ్యర్ సెకండరీ స్కూల్, కల్పెట్ట
- ఎచ్.ఐ.ఎం.అప్పర్ స్కూల్, కల్పెట్ట
- ప్రభుత్వం కళాశాల, వెల్లరంకున్ను, కల్పెట్ట.
- సెయింట్: జోసెఫ్ కాన్వెంట్ స్కూల్, కల్పెట్ట.
- జవహర్ నవోదయ, కల్పెట్ట
- ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, కల్పెట్ట
ప్రముఖ వ్యక్తులు
- కల్పెట్ట నారాయణన్ - భారతీయ కవి, నవలా రచయిత
- అబూ సలీం - నటుడు
- ఎం.పీ. వీరేంద్ర కుమార్ - రచయిత, రాజకీయవేత్త
- అను సితార - నటి
- సన్నీ వేన్ - నటుడు
- మిధున్ మాన్యువల్ థామస్ - సినిమా రచయిత, దర్శకుడు
చిత్రమాలిక
- జైన దేవాలయం, కల్పెట్ట, కేరళ
- గ్రామ పంచాయితీ కార్యాలయం, కల్పేట బ్లాకు, కున్నతిదావక
- కరపుజా డ్యామ్ అడ్వెంచర్ పార్క్, గార్డెన్, కల్పెట్ట -1
- కరపుజా డ్యామ్ అడ్వెంచర్ పార్క్, గార్డెన్, కల్పెట్ట-2
- కల్పెట్ట నారాయణన్
- ఎస్.కె.ఎం,జె. హయ్యర్ సెకండరీ స్కూల్, కల్పత్తా
- జైన మందిరం, కల్పెట్ట
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.