From Wikipedia, the free encyclopedia
కలి యుగం (దేవనాగరి: कलियुग) హిందూ పురాణాలననుసరించి మహాయుగములోని చివరి, నాలుగవ యుగం. ఇది ప్రస్తుతం నడుస్తున్న యుగం. వేదాల ననుసరించి యుగాలు నాలుగు,
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కలి యుగం కాల పరిమాణం 432000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి. హిందూ, బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంత ప్రకారం సా.శ.పూ. 3102 ఫిబ్రవరి 13 (00:00) కలియుగం ప్రారంభమైంది. [1] కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారంను చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడు .
కలియుగం 5,126 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. ప్రస్తుత సా.శ.2025 సంవత్సరానికి ఇంకా 4,26,874 సంవత్సరాలు మిగిలివుంది. సా.శ. 428,899లో అంతమవుతుంది.[2]
కలియుగంలో అంతా అధర్మమే. అంతా అన్యాయమే. మంచి వాళ్ళకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుడిని తలచుకొనే వారే కనిపించరు. సంసారంలో భార్యాభర్తలు, ధనధాన్యాలు లాంటి వన్నీ సులభంగా సమకూరతాయి.
Seamless Wikipedia browsing. On steroids.