ఊర్మిళ (రామాయణం)
రామాయణంలో జనక మహారాజు కూతురు, లక్ష్మణుని భార్య. From Wikipedia, the free encyclopedia
ఊర్మిళ రామాయణంలో జనక మహారాజు కూతురు, లక్ష్మణుని భార్య. వీరికి అంగద, చంద్రకేతు అని ఇద్దరు కుమారులు.
ఊర్మిళ | |
---|---|
![]() దశరధుని నలుగురు కుమారులు (వివాహం తరువాత) | |
సమాచారం | |
దాంపత్యభాగస్వామి | లక్ష్మణుడు |
పిల్లలు | అంగద, చంద్రకేతు[1] |
బంధువులు | సీత (అక్క) మాందవి, సుతకీర్తి (బంధువులు) |
వివాహం
సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్ళి చేశారని వాల్మీకి రామాయణంలో ఉంది. శ్రీరాముడు, సీతలతో లక్ష్మణుడు అరణ్యవాసం వెళ్తున్నప్పుడు అతనితోపాటు ఊర్మిల కూడా అడవికి వెళ్ళడానికి సిద్ధంకాగా, తన వృద్ధాప్య తల్లిదండ్రులను చూసుకోవటానికి అయోధ్యలోనే ఉండమని లక్ష్మణుడు కోరాడు.
నిద్ర
భర్త అరణ్య వాసానికి బయలుదేరడంతో భర్త అభిమతాన్ని, అంతరంగాన్ని గుర్తించిన ఊర్మిళ అయోధ్యలోనే ఉండిపోయింది. రాత్రివేళలో అడవిలో సీతారాములకు రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుండడంతో 'తన కర్తవ్యానికి ఆటంకం కలిగించొద్దని, అన్నావదినల సేవకోసం వచ్చిన తనను ఈ పద్నాలుగేళ్లు విడిచిపెట్టమని' నిద్ర దేవతని వేడుకుంటాడు. నిద్ర దేవత అంగీకరించి 'నిద్ర ప్రకృతి ధర్మమని, తన నిద్రను ఎవరికైనా పంచాలని' కోరడంతో 'తన పద్నాలుగేళ్ళ నిద్రను తన భార్య ఊర్మిళకు ప్రసాదించి, ఆమెకు తన అభిప్రాయం తెలియజేస్తే తప్పక అంగీకరిస్తుందని' లక్ష్మణుడు చెప్తాడు. భర్త కోరిక ప్రకారం ఊర్మిళాదేవి సంతోషంగా నిద్రను పంచుకుంటుంది. అలా నిద్రను ఊర్మిళ స్వీకరించడంతో లక్ష్మణుడికి మేఘనాథుని సంహరించే అవకాశం దక్కింది.[2] ఈ పద్నాలుగేళ్ళ నిద్ర ఊర్మిళాదేవి నిద్ర అంటారు.[3]
పాత్ర చిత్రణ
ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. ఊర్మిళ పాత్రకు ఆదికవి వాల్మీకి సముచితమైన స్థానాన్ని ఇవ్వకుండా ఉపేక్షించినాడని పలువురు విమర్శకుల అభిప్రాయము. అయితే రామాయణాన్ని అనువదించిన ఇతర కవులు ఊర్మిళ త్యాగమయ జీవితాన్ని అత్యంత సహజసుందరంగా చిత్రించారు.
దేవాలయం
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో లక్ష్మణుడు, ఉర్మిళ ఆలయం ఉంది. సా.శ. 1870లో అప్పటి భరత్‌పూర్ పాలకుడు బల్వంత్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. దీనిని భరత్‌పూర్ రాష్ట్ర రాజ కుటుంబం రాజ ఆలయంగా పరిగణిస్తారు.[4]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.