Remove ads
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
ఊనా హిమాచల్ ప్రదేశ్ లోని పట్టణం, ఊనా జిల్లాకు ముఖ్య పట్టణం. పట్టణ పాలన మునిసిపల్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. మున్సిపల్ కౌన్సిల్ కింద 11 వార్డులు ఉన్నాయి. సిక్కుల మొదటి గురువు గురు నానక్ వారసుల నివాసమైన కోట ఊనాలో ఉంది.[1]
ఊనా | |
---|---|
పట్టణం | |
Coordinates: 31.468°N 76.271°E | |
దేశం | India |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
జిల్లా | ఊనా |
Elevation | 369 మీ (1,211 అ.) |
జనాభా (2011) | |
• Total | 18,722 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఊనా పట్టణ జనాభా 18,722. అందులో 9,851 మంది పురుషులు, 8,871 మంది మహిళలు. అక్షరాస్యత 86.21%, ఇది రాష్ట్ర సగటు 82.80% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 88.84 కాగా, స్త్రీల అక్షరాస్యత 83.29%. ఆరేళ్ల లోపు పిల్లలు 1,954 మంది. జనాభా లింగ నిష్పత్తి 901 పిల్లల లింగ నిష్పత్తి 918. ప్రధానంగా మాట్లాడే భాషలు హిందీ, పంజాబీ.[2]
రహదారులు
పంజాబ్ సరిహద్దుల నుండి హిమాచల్ ప్రదేశ్ లోకి ప్రవేశించే ప్రధాన ప్రవేశ కేంద్రాలలో ఊనా ఒకటి. నేషనల్ హైవే 503, నేషనల్ హైవే 503 ఎ ద్వారా ఊనా నుండి రాష్ట్రం లోని, దేశం లోని మిగిలిన ప్రాంతాలను చేరుకోవచ్చు. [3]
రైల్వేలు
ఊనా హిమాచల్ రైల్వే స్టేషన్ నుండి చండీగఢ్, ఢిల్లీ లకు రైళ్ళు నడుస్తాయి. అంబాలా కంటోన్మెంటుకు కూడా రైలు సౌకర్యం ఉంది
విమానాశ్రయం
కాంగ్రా విమానాశ్రయం 114 కి.మీ. దూరం లోఉ, చండీగడ్ః అంతర్జాతీయ విమానశ్రయం 127 కి.మీ. దూరం లోనూ ఉన్నాయి
ఊనా 31.48°N 76.28°E నిర్దేశాంకాల వద్ద ఉంది. సముద్ర మట్తం నుండి ఇది 369 మీటర్ల ఎత్తున ఉంది. చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాల కంటే ఇది చల్లగా ఉన్నప్పటికీ, వేసవిలో ఉష్ణోగ్రతలు 45 °C (113 °F) వరకు చేరతాయి.[4]
శీతోష్ణస్థితి డేటా - Una (1985–2010, extremes 1985–2011) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 31.0 (87.8) |
34.2 (93.6) |
39.4 (102.9) |
43.2 (109.8) |
45.2 (113.4) |
45.2 (113.4) |
42.2 (108.0) |
38.4 (101.1) |
38.6 (101.5) |
35.6 (96.1) |
33.4 (92.1) |
28.2 (82.8) |
45.2 (113.4) |
సగటు అధిక °C (°F) | 19.9 (67.8) |
23.1 (73.6) |
28.1 (82.6) |
34.3 (93.7) |
37.8 (100.0) |
37.9 (100.2) |
33.8 (92.8) |
32.8 (91.0) |
32.8 (91.0) |
31.1 (88.0) |
27.4 (81.3) |
22.3 (72.1) |
30.1 (86.2) |
సగటు అల్ప °C (°F) | 3.2 (37.8) |
5.7 (42.3) |
9.4 (48.9) |
13.5 (56.3) |
18.2 (64.8) |
21.2 (70.2) |
22.1 (71.8) |
21.9 (71.4) |
20.1 (68.2) |
13.8 (56.8) |
8.2 (46.8) |
4.0 (39.2) |
13.4 (56.2) |
అత్యల్ప రికార్డు °C (°F) | −5.8 (21.6) |
−1.6 (29.1) |
3.0 (37.4) |
6.7 (44.1) |
8.6 (47.5) |
14.7 (58.5) |
17.0 (62.6) |
16.3 (61.3) |
13.2 (55.8) |
5.1 (41.2) |
1.8 (35.2) |
−2.4 (27.7) |
−5.8 (21.6) |
సగటు వర్షపాతం mm (inches) | 37.0 (1.46) |
42.4 (1.67) |
42.3 (1.67) |
24.9 (0.98) |
37.1 (1.46) |
89.6 (3.53) |
323.2 (12.72) |
320.3 (12.61) |
162.2 (6.39) |
21.1 (0.83) |
10.7 (0.42) |
20.4 (0.80) |
1,131.2 (44.54) |
సగటు వర్షపాతపు రోజులు | 2.4 | 3.4 | 3.3 | 1.6 | 2.7 | 5.5 | 11.6 | 11.6 | 5.8 | 1.2 | 0.9 | 1.2 | 51.2 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) | 65 | 63 | 57 | 42 | 41 | 49 | 68 | 72 | 67 | 61 | 58 | 61 | 59 |
Source: India Meteorological Department[5][6] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.