Remove ads
From Wikipedia, the free encyclopedia
గోవింద్ సాగర్ సరస్సు హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ జిల్లాలో ఉన్న ఒక జలాశయం. ఇది భాక్రా డ్యామ్ ద్వారా ఏర్పడింది.[2]
గోవింద్ సాగర్ సరస్సు | |
---|---|
ప్రదేశం | ఊనా జిల్లా,బిలాస్ పూర్,హిమాచల్ ప్రదేశ్ |
అక్షాంశ,రేఖాంశాలు | 31°25′N 76°30′E |
రకం | సాగునీరు |
సరస్సులోకి ప్రవాహం | 4.4- 8.0 million cusecs |
వెలుపలికి ప్రవాహం | 4.9- 7.0 million cusecs |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ట లోతు | 163.07 మీ. (535.0 అ.) |
7,501,775 acre⋅ft (9.25 కి.మీ3)[1] | |
ప్రాంతాలు | ఊనా జిల్లా,బిలాస్ పూర్ |
మూలాలు | FAO |
ఈ జలాశయం సట్లెజ్ నదిపై ఉంది. పదవ సిక్కు గురువు [[గురు గోవింద సింగ్|గురు గోవింద్ సింగ్]] గౌరవార్థం ఈ సరస్సుకు అతడి పేరు పెట్టబడింది. ఇది ప్రపంచంలోని ఎత్తైన గురుత్వాకర్షణ గల ఆనకట్టలలో ఒకటి, భాక్రా డామ్ ద్వారా అమెరికన్ డ్యామ్-బిల్డర్, హార్వే స్లోకం పర్యవేక్షణలో, 1955 లో దీని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1962 లో నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి.[3] [4]
56 కిలోమీటర్ల పొడవు, దాదాపు 3 కిలోమీటర్ల వెడల్పుతో గోవింద్ సాగర్ సరస్సు ఉంది.
చేపలు పట్టడం అనేది ఇక్కడి సాధారణ ప్రక్రియ. ఇది సుమారు యాభై ఒకటి జాతులు, ఉప జాతులను కలిగి ఉంది. బంగనా డెరో, టోర్ పుటిటోరా, స్పెరటా సీడ్ఘాలా, మిర్రర్ కార్ప్ వంటి మొదలైన చేపలు ఇక్కడ కనిపించే సాధారణ జాతులు.
ఈ సరస్సు డైరెక్టరేట్ టూరిజం, సివిల్ ఏవియేషన్ వంటి అనుబంధ క్రీడల సహకారంతో పలు రకాల నీటి-క్రీడా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఇక్కడ సర్ఫింగ్, వాటర్-స్కీయింగ్, కయాకింగ్, రోయింగ్, కానోయింగ్, వైట్ వాటర్ రివర్ రాఫ్టింగ్ వంటివి చేయవచ్చు. వీటిని నేర్చుకోవడం కోసం అక్కడ ఉండటానికి హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ ప్రత్యేక వసతి కూడా కల్పిస్తుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.