ఉదల్గురి జిల్లా

అస్సాం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

ఉదల్గురి జిల్లా

ఉదల్గురి జిల్లా, (అస్సాం: ওদালগুৰি জিলা) భారతదేశం, అస్సాం రాష్ట్రం లోని జిల్లా. ఉదల్గురి పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది.

త్వరిత వాస్తవాలు ఉదల్గురి జిల్లా, దేశం ...
ఉదల్గురి జిల్లా
Thumb
పనేరి టీ గార్డెన్
Thumb
Map of Udalguri District
దేశంభారత దేశము
Stateఅసోం
ప్రధాన కార్యాలయంUdalguri
Time zoneUTC+05:30 (Indian Standard Time)
Websiteudalguri.gov.in
మూసివేయి

పేరువెనుక చరిత్ర

జిల్లా కేంద్రమైన ఉదల్గురి పేరు జిల్లా పేరుగా ఉంది. ఉదల్గురి పేరు గురించి 3 కథనాలు ఉన్నాయి. మొదటిది ఓడల్ (ఒక చెట్టు), గురి (వేర్లు లేక పరిసరాలు). ఒడల్ చెట్లు అధికంగా ఉన్న ప్రాంతంలో ఊరు అభివృద్ధి చెందింది కనుక ఈ ఊరికి ఈ పేరు వచ్చింది. మరొక కథనంలో ఉద్దాలక మహర్షి ఆశ్రమం ఉన్న ప్రదేశం కనుక ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. ఇంకొక కథనం అనుసరించి బోడో భాషలో " ఓడో గురి " అంటే విశాలమైన మెత్తని మట్టి కలిగిన ప్రాంతమని అర్ధం.

చరిత్ర

ఉదల్గురి జిల్లా 2004 జూన్ 14 న ఏర్పడింది.[1] బోడోలాండ్‌లోని 4 జిల్లాలలో ఇది ఒకటి. దర్రాంగ్ జిల్లాలో కొంత భూభాగం విడదీసి ఈ జిల్లా రూపొందిద్దుకుంది.[1] ప్రస్తుత జిల్లా ప్రాంతం ఉదల్గురి ఉపవిభాగంగా ఉంటూ వచ్చింది. జిల్లాలో హిందువులు, క్రైస్తవులు, ముస్లిములు అధికసంఖ్యలో ఉన్నారు. 1980 వరకూ ఇది చాలా ప్రశాంతమైన ప్రాంతంగా ఉంటూ వచ్చింది. తరువాత తరచుగా మతసంఘర్షణలు చోటుచేసుకున్నాయి. అస్సాం రాష్ట్రంలోని స్వాతంత్ర్యపోరాటవీరులలో ఒకరైన జొజారాం శర్మ ఈ జిల్లాలో నివసించాడు. జిల్లాలో ఒక పురాతనమైన ప్రార్థనా మందిరం (అస్సామీయుల ప్రార్ధానా ప్రదేశం) ఉంది. అలాగే ఉదల్గురిలో పురాతన హనుమాన్ ఆలయం ఉంది. అలాగే పురాతన బాప్టిస్ట్ క్రైస్తవ చర్చి ఉంది.

2001 లో గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 832 769.[2]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత. 497 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 9.8% [2]
స్త్రీ పురుష నిష్పత్తి. 966:1000[2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 66.6%
జాతియ సరాసరి (72%) కంటే.
మూసివేయి
  • అస్సామీ ప్రజలలో బోర్పెటియా, బోడో, కోచ్ రాజ్‌బొంగ్షి, రాభా, సయోటల్, మార్వారి, బెంగాలి హిదువులు, ఇతర ప్రజలు ఉన్నారు.

భౌగోళికం,

ఈ జిల్లా ఉత్తర సరిహద్దులో భూటాన్, పశ్చిమ కమెంగ్ జిల్లా అరుణాచల్ ప్రదేశ్, తూర్పు సరిహద్దులో సోనిత్‌పూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో దర్రాంగ్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో బక్సా జిల్లా ఉంది. జిల్లా వైశాల్యం 1852చ.కి.మీ.[3]

అభయారణ్యాలు

  • మనస్ నేషనల్ పార్క్ (కొంత భాగం)

విభాగాలు

  • జిల్లా 2 ఉపవిభాగాలుగా విశిపోయింది: ఉదల్గురి, భెర్గావ్.
  • ఉపవిభాగాలు అదనంగా 9 రెవెన్యూ సర్కిల్స్‌గా విడివడ్డాయి: ఉదల్గురి, మజ్‌బాత్, హరిసింగ.కలైగావ్, ఖొయిర్బరి, డాల్గావ్, పతెరీఘాట్, మంగళ్డై, ధెకైజులి.
  • 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: పనెరి, మజ్బాత్, ఉదల్గురి.
  • ఇవన్నీ మంగళడై పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.

వృక్షజాలం , జంతుజాలం

1990లో ఉదల్గురి జిల్లాలో " మనస్ నేషనల్ పార్క్ " స్థాపించబడింది.[4] ఇది ఈ పార్కును ఇతర 4 జిల్లాలతో పంచుకుంటుంది.

మూలాలు

వెలుపలి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.