ఉదల్గురి

అస్సాం రాష్ట్రంలోని ఉదల్గురి జిల్లా ముఖ్య పట్టణం. From Wikipedia, the free encyclopedia

ఉదల్గురి, అస్సాం రాష్ట్రంలోని ఉదల్గురి జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

త్వరిత వాస్తవాలు ఉదల్గురి, దేశం ...
ఉదల్గురి
పట్టణం
Thumb
ఉదల్గురి
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
Thumb
ఉదల్గురి
ఉదల్గురి (India)
Coordinates: 26.7452°N 92.0962°E / 26.7452; 92.0962
దేశం భారతదేశం
రాష్ట్రంఅస్సాం
జిల్లాఉదల్గురి
Government
  Bodyఉదల్గురి పురపాలక సంస్థ
విస్తీర్ణం
  Total4.69 కి.మీ2 (1.81 చ. మై)
Elevation
180 మీ (590 అ.)
జనాభా
 (2011)
  Total15,279
భాషలు
  అధికారికబోడో భాష
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
784509
టెలిఫోన్ కోడ్03711 XXXXXX
Vehicle registrationఏఎస్-27
మూసివేయి

పద వివరణ

ఉదల్గురి అనే పేరు 'ఓడాల్ చెట్టు' నుండి వచ్చిందని కొందరు, ఉద్దలక్ ముని అనే రుషి ఇక్కడ ఉన్నందున ఈ ప్రాంతానికి ఉదలగురి అనే పేరు వచ్చిందని మరికొందరి చరిత్రకారుల అభిప్రాయం. 'ఓర్డ్లా+ గుంద్రీ' (ఓర్డలగుంద్రి > ఓర్డలగుండి > ఒడాల్గురి > ఉదలగురి) అనే రెండు బోడో భాష పదాల నుండి వచ్చిందని మరికొందరి నమ్మకం. బోడో ప్రజలు ఇప్పటికీ దీనిని ఓదల్‌గురి అని పిలుస్తారు. బోడో భాషలో 'ఓర్డ్లా' అంటే విశాలమైనదని, 'గుంద్రీ' అంటే పొడి వస్తువని అర్థం.[1]

భౌగోళికం

ఉదల్గురి పట్టణం 26.7452°N 92.0962°E / 26.7452; 92.0962 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[2] ఇది సముద్ర మట్టానికి 180 మీటర్ల (590 అడుగుల) ఎత్తులో ఉంది. పట్టణ విస్తీర్ణం 4.69 చ.కి.మీ. (1.81 చ.మై.) ఉంది.

జనాభా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఉదల్గురి పట్టణంలో 15,279 జనాభా ఉంది. ఈ జనాభాలో పురుషులు 52% మంది, స్త్రీలు 48% మంది ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 74% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 80% కాగా, స్త్రీ అక్షరాస్యత 67%గా ఉంది. పట్టణ జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[1]

రాజకీయాలు

ఉదల్గురి పట్టణం, మంగల్‌దాయి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోఉంది.[3]

మూలాలు

ఇతర లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.