Remove ads

ఉత్తర సిక్కిం భారతీయ రాష్ట్రాలలో ఒకటైన సిక్కిం రాష్ట్రంలోని 4 జిల్లాలలో ఒకటి. జిల్లాకు కేంద్రంగా మంగన్ నగరం ఉంది. ఇది దేశంలోని 640 జిల్లాలలో జనసాంద్రతలో 7వ స్థానంలో ఉంది.[1] 2013 నుండి సి.పి ధాకల్ జిల్లాకు కలెక్టరుగా నియమితుడయ్యాడు. [2]

త్వరిత వాస్తవాలు మంగన్ జిల్లా, రాష్ట్రం ...
మంగన్ జిల్లా
సిక్కిం రాష్ట్ర జిల్లా
Thumb
Thumb
సిక్కింలోని ప్రాంతం ఉనికి
రాష్ట్రంసిక్కిం
దేశంభారతదేశం
ముఖ్య పట్టణంమంగన్
విస్తీర్ణం
  Total4,226 కి.మీ2 (1,632 చ. మై)
Elevation
610 మీ (2,000 అ.)
జనాభా
 (2011)
  Total43,354
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Websitehttp://nsikkim.gov.in
మూసివేయి

భౌగోళికం

సిక్కిం రాష్ట్రంలోని 4 జిల్లాలలో ఉత్తర సిక్కిం జిల్లా విశాలమైనది. జిల్లాలోని భూమి దట్టంగా చెట్లతో నిండిన పర్వతప్రాంతంగా ఉంది. ఉత్తర తంద్రా ప్రాతంవైపు ప్రవతశ్రేణులు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ప్రధానరహదారి పక్కన కనిపించే పలు జలపాత దృశ్యాలు ప్రదృశాన్ని అతిసుందరంగా మార్చివేస్తూ ఉంటుంది. నిటారుగా ఉండే లోయలు అధికంగా ఉన్నందున కొండచరియలు విరిగిపడే ప్రమాదం అధికంగా ఉంటుంది. పర్వతశిఖరాలలో ఉండే మంచు కరిగడం, భారీవర్షాల కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. రాష్ట్రంలోని అత్యధికమైన ప్రజలు జిల్లా కేంద్రమైన మాంగన్ (సముద్రమట్టానికి 2000 అడుగుల ఎత్తు) సమీపంలో నివసిస్తుంటారు. జిల్లా ఉత్తరదిశలో చెట్లు అధికంగా ఉంటాయి. ఉష్ణోగ్రత 25 నుండి - 40 సెల్షియస్ ఉంటుంది. 6,000 మీటర్ల ఎత్తున ఉండే ప్రదేశంలో ఉష్ణోగ్రత అత్యల్పంగా ఉంటుంది. 8,000 మీ ఎత్తైన " కాంచన్‌జంగా " అత్యంత ఎత్తైన ప్రదేశంగా భావించవచ్చు. ఈ శిఖరం తూర్పు సరిహద్దులో నేపాల్ సరిహద్దు ఉంటుంది. సింఘిక్ నగరం నుండి దీనిని చూడవచ్చు.

  • జిల్లాలో " కాంచన్‌జంగా నేషనల్ పార్క్ " అభయారణ్యంలో కొంత భాగం ఉంది.
Remove ads

ఆర్ధికం

మాంగన్ ప్రపంచ యాలుకల రాజధానిగా (కార్డిమం రాజధాని ) గా గుర్తింపు పొందింది. జిల్లా వాతావరణం, భౌగోళిక పరిస్థితులు యాలుకలను పండించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో అధికంగా జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నందువలన ఇక్కడ విద్యుత్తు నిరాటంకంగా లభ్యమౌతుంది. ఎత్తైన కొండచరియలు, ఎత్తైన ప్రదేశంలో అనేకంగా ఉన్న సరసుల కారణంగా జలవిద్యుత్తు ఉత్పత్తికి అనుకూలంగా ఉంది. 2006లో పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ భారతదేశంలోని జిల్లాలలో (640) దారిద్యరేఖకు దిగువన ఉన్న 250 జిల్లాలలో ఉత్తర సిక్కిం జిల్లా ఒకటిగా గుర్తించింది. ప్రస్తుతం ఉత్తర సిక్కిం జిల్లా " బ్యాక్‌గ్రౌండ్ రీజియంస్ గ్రాంట్ ఫండ్ పోగ్రాం " (బి.ఆర్.గి.ఎఫ్) నుండి నిధులు అందుకుంటుంది.[3]

Remove ads

పర్యాటకం

సిక్కిం రాష్ట్రం లోని అత్యధిక భాగం పర్యాటకులను అనుమతించరు. ఈ ప్రాంతాలను సందర్శించాలంటే ప్రత్యేక పరిమితులు అవసరం ఉంటుంది. చైనా సరిహద్దులలో ఉండే భూభాగంలో సైనిక పర్యవేక్షణ అత్యధికంగా ఉంటుంది. ఈ ప్రాంత సౌందర్యానికి ఆకర్షితులౌతూ కఠిన నిషేధాలను అనుసరిస్తూ పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. అధికసంఖ్యలో పర్యాటకుల రాక ఒక్కోసారి పర్వతాలతో నిండిన పర్యావరణానికి అధికంగా హాని కలిగించే విషయమని భావిస్తున్నారు.[4]

పాలనా విభాగాలు

ఉత్తర సిక్కిం 2 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది:[5]

పేరు ముఖ్య పట్టణం గ్రామాల సంఖ్య[6] ప్రదేశం
చుంగ్తాంగ్ ఉప విభాగంచుంగ్తాంగ్9
Thumb
మంగన్ ఉప విభాగంమంగన్46
Thumb

చిత్రమాలిక

మూలాలు

Remove ads

వెలుపలి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads