ఉత్తరకాశి జిల్లా
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
ఉత్తరకాశీ జిల్లా ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని జిల్లాల్లో ఒకటి. ఇది గర్వాల్ డివిజన్లో భాగం. ఉత్తరకాశీ నగరం దాని ముఖ్యపట్టణం. జిల్లాలో బార్కోట్, దుండా, భట్వాడి, చిన్యాలిసౌర్, పురోలా, మోరీ అనే ఆరు తాలూకాలు ఉన్నాయి. ఉత్తరకాశీ జిల్లా 1960 ఫిబ్రవరి 24 న స్థాపించబడింది. జిల్లా లోని గంగోత్రి వద్ద భాగీరథి నది (గంగానది ప్రధాన ప్రవాహం) యమునోత్రి వద్ద యమునా నది ఉద్భవిస్తున్నాయి. ఈ రెండూ అత్యంత ముఖ్యమైన, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు. గంగోత్రికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఉత్తరకాశీ పట్టణం, హిందువులకు ముఖ్యమైన తీర్థయాత్రా స్థలం. జిల్లాకు ఉత్తరాన హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్, సిమ్లా జిల్లాలు, ఈశాన్య సరిహద్దులో టిబెట్, తూర్పున చమోలి జిల్లా, ఆగ్నేయంలో రుద్రప్రయాగ జిల్లా, దక్షిణ సరిహద్దులో టెహ్రీ గర్వాల్ జిల్లా, పశ్చిమాన డెహ్రాడూన్ జిల్లాలు ఉన్నాయి .
ఉత్తరకాశీ జిల్లా | |
---|---|
జిల్లా | |
Coordinates: 30.73°N 78.45°E | |
దేశం | India |
రాష్ట్రం | Uttarakhand |
డివిజను | గఢ్వాల్ |
Headquarters | ఉత్తరకాశీ |
విస్తీర్ణం | |
• Total | 8,016 కి.మీ2 (3,095 చ. మై) |
జనాభా | |
• Total | 3,30,086 |
• జనసాంద్రత | 41/కి.మీ2 (110/చ. మై.) |
భాషలు | |
• స్థానిక | గఢ్వాలీ, జాద్ |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | UK |
హిమానీనదం | ఎత్తు (మీ) |
---|---|
గంగోత్రి గ్లేసియర్ | 4,040 |
చతురంగి | 4,400 |
1 చతురంగి పేరు తెలియని TG | 5,120 |
కాళింది | 5,440 |
సీత | 5,400 |
సురలయ | 5,120 |
II చతురంగి పేరు తెలియని TG | 5,190 |
III చతురంగి పేరులేని TG | 4,980 |
వాసుకి | 4,800 |
భాగీరథి పర్వతం I | 6,512 |
భాగీరథి పర్వతం II | 6,556 |
భాగీరథి పర్వతం III | 6,195 |
భగీరథి పర్వతం IV | 6,625 |
స్వచ్ఛంద్ | 4,880 |
మియాండి | 4,980 |
సుమేరు | 4,900 |
ఘనోహిమ్ | 4,740 |
కీర్తి, దాని ఉప హిమానీ నదాలు (TG) | |
(ఎ) కీర్తి | 4,520 |
(బి) పేరు లేని TG | 4,570 |
(సి) II పేరులేని TG | 4,860 |
(డి) III పేరులేని TG | 4,860 |
నేరుగా భాగీరథి నదిలోకి ప్రవహించే హిమానీనదాలు | |
మైత్రి | 4,000 |
మేరు | 4,720 |
భృగుపంత్ | 3,720 |
మందా | 3,880 |
రక్తవర్ణ, దాని ఉప హిమానీనదాలు (TG) | |
(ఎ) రక్తవర్ణ | 4,500 |
(బి) తేలు | 5,040 |
(సి) శ్వేతాంబర్ | 4,760 |
(డి) పేరులేని TG | 5,100 |
(ఇ) II పేరులేని TG | 5,240 |
(యఫ్) నీలాంబర్ | 5,300 |
(జి) III పేరులేని TG | 5,200 |
(హచ్) పీలాపానీ | 5,080 |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఉత్తరకాశీ జిల్లా జనాభా 3,30,086, [2] ఇది బెలిజ్ దేశానికి దాదాపు సమానం.[3] ఇది భారతదేశంలోని 688 జిల్లాలలో జనాభా పరంగా 567వ స్థానంలో ఉంది.[2] జనసాంద్రత 41/చ.కి.మీ.[2] 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా వృద్ధి రేటు 11.75%.[2] లింగనిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 959 స్త్రీలు [2] జిల్లా అక్షరాస్యత రేటు 75.98%.[2]
2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లా జనాభాలో 88% మంది గర్వాలీ, 7.28% మంది హిందీ, 2.17% మంది నేపాలీ మొదటి భాషగా మాట్లాడతారు. వివిధ దేశీయ టిబెటిక్ భాషలు మాట్లాడేవారు జిల్లా జనాభాలో 2.59% మంది ఉంటారు.[4]
ఉత్తరకాశీ జిల్లా తెహ్రీ గఢ్వాల్ (లోక్సభ నియోజకవర్గం) పరిధిలోకి వస్తుంది.
జిల్లాలో ఆరు తహసీల్లు ఉన్నాయి. అవి: బార్కోట్, దుండా, భట్వాడి, చిన్యాలిసౌర్, పురోలా, మోరి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.