ఇల్లందకుంట మండలం (కరీంనగర్)

తెలంగాణ, కరీంనగర్ జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

ఇల్లందకుంట మండలం (కరీంనగర్)

ఇల్లందకుంట మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. ఈ మండలంలో 10 గ్రామాలున్నాయి. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన హుజూరాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది.మండల కేంద్రం ఇల్లందకుంట

త్వరిత వాస్తవాలు రాష్ట్రం, తెలంగాణ ...
ఇల్లందకుంట
  మండలం  
Thumb
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, ఇల్లందకుంట స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, ఇల్లందకుంట స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండల కేంద్రం ఇల్లందకుంట
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 97 km² (37.5 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 30,763
 - పురుషులు 15,458
 - స్త్రీలు 15,305
పిన్‌కోడ్ {{{pincode}}}
మూసివేయి

గణాంకాలు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 97 చ.కి.మీ. కాగా, జనాభా 30,763. జనాభాలో పురుషులు 15,458 కాగా, స్త్రీల సంఖ్య 15,305, మండలంలో 8,688 గృహాలున్నాయి.[3]

2016 లో ఏర్పడిన మండలం

లోగడ ఇల్లందకుంట గ్రామం కరీనగర్ జిల్లా, కరీంనగర్ రెవెన్యూ డివిజను పరిధిలోని జమ్మికుంట మండలానికి చెందింది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా (1+10) పది గ్రామాలు జమ్మికుంట మండలం నుండి విడగొట్టి ఇల్లందకుంట గ్రామాన్ని నూతన మండల కేంధ్రంగా కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. ఇల్లందకుంట
  2. కనగర్తి
  3. చిన్నకోమటిపల్లి
  4. టేకుర్తి
  5. పాతర్లపల్లి
  6. బుజునూర్
  7. మల్లియల్
  8. రాచపల్లి
  9. వంతడుపుల
  10. సిర్సేడు

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.