ఇండో యూరోపియను భాషలు ఒకే భాషా కుటుంబానికి చెందిన భాషలు. From Wikipedia, the free encyclopedia
ఇండో యూరోపియను భాషలు లేక సింధ ఐరోపా భాషలు ఒకే భాషా కుటుంబానికి చెందిన భాషలు. ఇవి చాలా కాలం క్రితం ఉండిన ఒకే మూలభాషనుండి వచ్చాయని భాషావేత్తల అభిప్రాయం. ప్రస్తుత ప్రపంచ భాషలలో ఇండో యూరోపియను భాషలు ప్రముఖమైన స్థానం కలిగి ఉన్నాయి. ఐరోపా, ఆసియా, అమెరికా ఖండాలలోని ప్రస్తుత భాషలలోని అన్ని ముఖ్యమైన భాషలన్నీఈ ఇండో యూరోపియను భాషా కుటుంబమునకు చెందినవే. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రముఖ ఐదు భాషలలో చైనీసు కాకుండా మిగిలిన నాలుగు భాషలూ ఈ కుటుంబానికి చెందినవి. ప్రస్తుతం ప్రపంచంలోని భాషలలో బెంగాలీ, ఇంగ్లీషు, ఫ్రెంచి, హిందీ, జర్మను, పోర్చుగీసు, రష్యను, స్పానిషు, వంటి అన్ని భాషలూ ఈ కుటుంబమునకు చెందినవి. ఇవే కాకుండా ఎన్నో చిన్న చిన్న భాషలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచములోని భాషాకుటుంబాలలో ఈ కుటుంబంలోని భాషలు అతి పెద్ద స్థానం కలిగి ఉన్నాయి. రెండవ అతి పెద్ద భాషా కుటుంబము చైనో-టిబెటిన్ భాషా కుటుంబము.
ఈ భాషా కుటుంబమును ఈ క్రింది ఉప కుటుంబాలుగా విభజించారు. (చారిత్రిక ప్రాధాన్యతానుసరణాక్రమం)
పైన చెప్పబడిన పది సంప్రదాయమైన ఉప కుటుంబములే కాకుండా, ఈ కుటుంబమునకు చెందిన చాలా చాలా భాషలు, ఉప-కుటుంబములు ఉండిఉండేవని భాషావేత్తల నమ్మకము. కానీ ఇవి అన్నీ లుప్తమై పొయినాయి. వీటి గురించిన సమాచారము బహు దుర్లభం. లుప్తమైపోయినవిగా భావిస్తున్న భాషలు, ఉప-కుటుంబములలో కొన్ని:
ఇవే కాకుండా ఇంకా చాలా ఇండో యూరోపియను భాషలు ఉండేవి, ప్రస్తుతము వాటి ఉనికి కూడా మనకు తెలీదు. చిన్న రైటియను భాష గురించిన పూర్తి ఆధారాలు లభించలేదు.
ఇంకా కొన్ని ఉపకుటుంబాలు కూడా చెప్తూ ఉంటారు. వాటిలో ఇటాలో-కెల్టిక్ మరియూ గ్రీకు ఆర్యను భాషలు ముఖ్యమైనవి, కానీ వీటిని ఎక్కువమంది విద్వాంసులు ఒప్పుకొనరు. అలాగే అనటోలియను మరియూ ఇతర ఇండో యూరోపియను భాషా వర్గాల మధ్య చెప్పుకోదగ్గ తేడాలు ఉన్నాయని చెబుతూ, ఇండో హిటైట్ అనే మహా భాషాకుటుంబాన్ని ప్రతిపాదించే ఓ సిద్దాంతము ఉంది.
ఇండో-యూరోపియన్ భాషా కుటుంబాన్ని తరచుగా "శతం", "కెంతం" వర్గాలుగా విభజిస్తారు. మూల భాషలోని కంఠ్య (velar) శబ్దాలు కాలానుగుణంగా వివిధ భాషలలో పొందిన మార్పులు ఈ విభజనకు ఆధారం. శతం భాషలలో స్వచ్ఛ కంఠ్య (velar) శబ్దాలకు కంఠోష్ఠ్య (labial velars) శబ్దాలకు మధ్య వ్యత్యాసం చెరిగి పోయి, కంఠ తాలవ్యాలు (palatal velars) ఉష్మీకరింపబడ్డాయి (assibilated). కెంతం భాషలలో మాత్రం స్వచ్ఛ కంఠ్య శబ్దాలకు (velars), కంఠ తాలవ్యాలకు (palatal velars) మధ్య వ్యత్యాసం లోపిస్తుంది. భౌగోళికంగా, "తూర్పు" వైపు వ్యాపించిన భాషలు శతం భాషలనీ (ఇండో-ఇరానియన్, బాల్తో-స్లావిక్ మొ.), " పశ్చిమ" భాషలు (జర్మానిక్, ఇటాలిక్, కెల్టిక్ మొ.) కెంతం భాషలనీ స్థూలంగా చెప్పవచ్చు. కానీ తూర్పున ఉన్న తోచారియన్, అనటోలియన్ భాషలలో కెంతం భాషా లక్షణాలే ఎక్కువ అని ఇక్కడ గమనించాలి. శతం-కెంతం వ్యవహార భేదక రేఖలు (isogloss) సరిగ్గా గ్రీకు (కెంతం భాష), అర్మేనియన్ (శతం భాష) భాషా సరిహద్దుల మీదుగా పయనిస్తాయి. గ్రీకు భాషలో శతం భాషల లక్షణాలు స్వల్పంగానైనా కనిపించడం విశేషం. కొన్ని భాషలు శతం-కెంతం విభజనకు లొంగవని కొంతమంది పండితుల అభిప్రాయము (అనటోలియన్, తోచారియన్, అల్బేనియన్ భాషలని వీరు ఉదాహరణలుగా పేర్కొనటం కద్దు). అంతే కాక, శతం-కెంతం భాషల వర్గ విభజనను ఉపకుటుంబ విభజనగా పరిగణించకూడదు: అంటే "మూల శతం", "మూల కెంతం" అనే భాషల నుండి మిగిలిన భాషలు ఉద్భవించాయని చెప్పరాదు. అప్పటికే (బహుశా క్రీస్తు పూర్వం 3వ సహస్రాబ్ది నాటికే) ప్రత్యేక భాషలుగా విడిపోయినా, పరస్పర సంపర్గం వల్ల ఈ ధ్వని పరిణామాలు (sound changes) ఒక భాష నుండి మరొక భాషకు వ్యాప్తి చెంది ఉండవచ్చునని భాషావేత్తల అభిప్రాయం.
కొందరు భాషావేత్తలు ఇండో-యూరోపియన్ భాషలు ఒక ఔపత్తిక (hypothetical) నోస్ట్రాటిక్ భాష లోని భాగమని ప్రతిపాదించి, ఈ ఇండో-యూరోపియన్ భాషలను ఇతర దక్షిణ కాకేషియన్, ఆట్లాంటిక్, యురాలిక్, ద్రవిడ, ఆఫ్రో-ఆసియా భాషాకుటుంబాలతో పోల్చి చూశారు. ఈ సిద్ధాంతం దీన్నే పోలిన జోసెఫ్ గ్రీన్ బెర్గ్ యూరాసియాటిక్ సిద్ధాతం, జాన్ కొలారుస్సో ప్రోటో-పాంటిక్ సిద్ధాంతాల్లాగనే వివాదాస్పదమైంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.