ప్రపంచ భాషలు
From Wikipedia, the free encyclopedia
ప్రపంచ భాష అనేది అంతర్జాతీయంగా మాట్లాడే ఒక భాష. దీనిని అనేక మంది ద్వితీయ భాషగా నేర్చుకుంటారు. ప్రపంచ భాష మాట్లాడేవారి సంఖ్య (స్థానిక లేదా రెండవ భాషగా మాట్లాడేవారు) మీదే కాక, దాని యొక్క భౌగోళిక పంపిణీ, అంతర్జాతీయ సంస్థలు, దౌత్య సంబంధాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ విధానంలో, ప్రధాన ప్రపంచ భాషల మీద ఆధిపత్యం యూరోపియన్ భాషలకు కలదు. చారిత్రక యూరోపియన్ సామ్రాజ్యవాదం, వలసవాదం యొక్క సమయం దీనికి కారణం.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే భాష ఆంగ్లము, దీనిని 1.8 బిలియన్ కంటే ఎక్కువ మంది మాట్లాడతారు. అరబిక్ యొక్క అంతర్జాతీయ ఖ్యాతి దాని మధ్యయుగ ఇస్లామిక్ విజయాలు, మధ్య తూర్పు, ఉత్తర ఆఫ్రికా యొక్క తదుపరి అరబైజేషన్ ముఖ్య కారణాలు, ముస్లిం మతం కమ్యూనిటీలకు ఇది ఒక ప్రార్థనా భాష. సాంప్రదాయక చైనీస్ 20వ శతాబ్దం వరకు ఫార్ ఈస్ట్ ఏష్యాకు ఒక ముఖ్యమైన చారిత్రక సంధాన భాషగా ఉండేది. ప్రామాణిక చైనీస్ సాంప్రదాయక చైనీస్కు ప్రత్యక్ష భర్తీ. చైనాలో పరప్సరం అర్థం కాని భాషలు మాట్లాడే వాళ్ళ మధ్య ఒక సాధారణంగా మాట్లాడే భాషగా ఉపయోగపడుతున్నది.
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.