జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు చలనచిత్రం. From Wikipedia, the free encyclopedia
ఆటాడుకుందాం రా 2016, ఆగస్టు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్, సోనమ్ బజ్వా ప్రధాన పాత్రల్లో నటించారు.[1]
ఆటాడుకుందాం రా | |
---|---|
దర్శకత్వం | జి. నాగేశ్వరరెడ్డి |
స్క్రీన్ ప్లే | శ్రీధర్ సీపన |
నిర్మాత | నాగ సుశీల చింతలపూడి శ్రీనివాసరావు |
తారాగణం | అనుమోలు సుశాంత్ సోనమ్ బజ్వా |
ఛాయాగ్రహణం | దాశరథి సీవేంద్ర |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | శ్రీనాగ్ ప్రొడక్షన్ |
విడుదల తేదీ | 19 ఆగస్టు 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
విజయరామ్ (మురళి శర్మ), ఆనంద్ ప్రసాద్ (ఆనంద్) ఎంతో స్నేహంగా ఉంటారు. ఆనంద్ సలహాల వల్ల విజయరామ్ కు వ్యాపారాల్లో లాభం వచ్చి కోట్లు సంపాదిస్తాడు. అదిచూసి సహించక విజయరామ్ శత్రువు శాంతారామ్ మోసం చేస్తాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆ మోసం ఆనంద్పై పడుతుంది. దీంతో విజయరామ్, ఆనంద్ ఇద్దరూ విడిపోతారు. ఇరవై సంవత్సరాల తర్వాత కూడా కష్టాల్లో ఉన్న విజయరామ్ కుటుంబాన్ని శాంతారామ్ ఏదోరకంగా హింసిస్తూనే ఉంటాడు.
ఈ సమయంలోనే విజయరామ్కి అల్లుడైన కార్తీక్ (సుశాంత్) అమెరికా నుంచి ఓ పనిమీద ఇండియా వస్తాడు. విజయరామ్కి అతడి చెల్లెలన్నా, ఆ కుటుంబం అన్నా నచ్చదు. అలాంటి మనిషికి కార్తీక్ ఎలా దగ్గరయ్యాడు? కష్టాల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకున్నాడూ? అతడు నిజంగానే విజయరామ్కి మేనల్లుడా? కేవలం మేనల్లుడిగా నటించడానికి వచ్చాడా? ఆనంద్ ప్రసాద్ ఏమైపోయాడూ? ఈ కథలో సుశాంత్ ప్రియురాలు శృతి (సోనమ్ భజ్వా) ఎవరూ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.
దేవదాసు సినిమాలోని "పల్లెకు పోదాం" అనేపాట ఈ చిత్రంకోసం మళ్ళీ వాడుకున్నారు.[2]
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక "సెలబ్రిటీల పేర్లను వాణిజ్యం పరంగా ఉపయోగించుకువడానికి ఈ చిత్రం మంచి ఉదాహరణ" అని పేర్కొంది.[3] "ఈ టైం మిషన్ లోకి అడుగుపెట్టడానికి బదులుగా అక్కినేని నాగేశ్వరరావు లేదా నాగార్జున నటించిన పాత సినిమాలను చూడండి" అని ది హిందూ పత్రికలో రాశారు.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.