ఆకివీడు నగరపంచాయితీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన మున్సిపాలిటీ. ఈ పురపాలక సంఘం నరసాపురం లోక్సభ నియోజకవర్గం లోని, ఉండి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.ఇది నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధికి చెందినది.
ఆకివీడు | |
స్థాపన | 2021 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
చరిత్ర
ఆకివీడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నగర పంచాయతీ. ఇది సమీప పట్టణమైన ఏలూరు నుండి 49 కి.మీ. దూరంలో ఉంది. ఈ నగర పంచాయతీ 2021 లో 20 వార్డులతో ఏర్పాటు చేశారు.[1]
భౌగోళికం
ఆకివీడు నగరపంచాయితీ16.6000°N 81.3833°E అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది.ఇది సమీప పట్టణమైన భీమవరం నుండి 18 కి. మీ. దూరంలోను, సముద్ర తీరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి నుండి 122 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ 20,869 ఇళ్లతో, మొత్తం జనాభా 73,889. అందులో పురుషులు 36778, స్త్రీలు 37,111 మంది ఉన్నారు.అక్షరాస్యత కలిగిన వారు 47,757 సగటు అక్షరాస్యత 71.57%, వీరిలో 24,953 మంది పురుషులు, 22,804 మంది స్త్రీలు ఉన్నారు.[2][3]
పౌర పరిపాలన
పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.