షెడ్యూల్డు కులాలు అనగా (ఎస్సీల్లో) చేర్చడానికి రాజ్యాంగం ప్రకారం ఉండవలసిన అర్హత - ‘సాంప్రదాయ అంటరానితనం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యంత సాంఘిక, ఆర్థిక వెనుకబాటుతనానికి గురికావడం. ప్రసుతం ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాలో 61 కులాలున్నాయి: ఒక్కోకులానికి సంప్రదాయకంగా ఒక్కో వృత్తి ఉంది. ఎస్సీలను బీసీల మాదిరిగానే 4 భాగాలుగా ఎ, బి, సి, డి గ్రూపులుగా విభజిస్తూ 1997 జూన్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు నెం. 68, 69లను విడుదలయ్యాయి. మాల మహానాడు సుప్రీం కోర్టులో సవాలు చేయగా, 2004 నవంబరు 5న వర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలేదనీ, ఈ చర్య పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంతోనే సాధ్యమనీ ప్రకటిస్తూ జి.ఒ.ను రద్దు చేసింది.