Remove ads
From Wikipedia, the free encyclopedia
దేవదాసి అంటే గుడి లోని దేవుడి ఉత్సవాలలో నాట్య సేవ చేస్తూ జీవితాంతం అవివాహిత గానే ఉండే స్త్రీ. సతి, బాల్యవివాహాలు, గణాచారి, లాంటి సాంఘిక దురాచారం. భారతదేశంలో ప్రధాన సాంఘిక దురాచారంగా ఉన్న ఈ వ్యవస్థ తెలంగాణ సమాజంలో కూడా కనపడుతుంది. దేవదాసి వ్యవస్థ దక్షిణ భారతదేశంలో ఒక్క కేరళలో తప్ప అన్ని రాష్ట్రాలలో విభిన్న రూపాల్లో కొనసాగుతున్నది. నరబలికి బదులుగా దేవాలయాలకు అమ్మాయిలను సమర్పించే దురాచారమే దేవదాసి వ్యవస్థ. గ్రామంలో అన్ని అరిష్టాలు, అనర్థాలకు మూల కారణం గ్రామ దేవతలకు ఆగ్రహం కలగడమే అని నమ్మి గ్రామ దేవతలను శాంతింపచేయడానికి అమ్మాయిలను దేవుళ్లకు అర్పించడం జరిగేది. మతం ముసుగులో ఉన్నత కులస్తులు ఆధీన వర్గంలోని స్త్రీలను దోపిడీ చేసే ప్రక్రియ ఇది. స్వాములు వివాహేతర లైంగికవాంఛలను తీర్చడం కోసం పూజారులకు లైంగిక సంతృప్తి చేకూర్చడం కోసం ఏర్పడ్డ సామాజిక దురాచారమే ఈ దేవదాసి వ్యవస్థ.[1][2][3][4]
మత సంబంధిత వ్యభిచారం భారతదేశంతోపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో కనపడుతుంది. దక్షిణ ఐరోపా, ఏషియా మైనర్, ఈజిప్టు, మెసపటోమియాలో ఈ దురాచారం ఉంది. గ్రీసు చరిత్రకారుడు హెరిడోటస్ బాబిలోనియాలోని మైలిట్టా దేవాలయంలో స్త్రీల శీలాన్ని అర్పించారని తన రచనల్లో తెలిపారు. లూసియన్ అనే రోమన్ రచయిత ఫోనియాలో ఇటువంటి ఆచారం ఉన్నట్లు రాశాడు. పొనీషియా, కానన్, పేఫస్, సైప్రస్ మొదలైన దేశాల్లో మాతృదేవతారాదన ప్రధానంగా అమల్లో ఉంది. ఈ దేవతను ఎస్టార్ట్, అఘారెత్, ఎస్ట్రేట్ వంటి పేర్లతో పిలుచుకొంటారు. అరేబియాలో అలాట్, ఆల్-ఉజ్జా వంటి సామాజిక దురాచారాలు మత సంబంధిత వ్యవహారాలతో ముడిపడి ఉన్నాయని టాని పెంజర్ పేర్కొన్నాడు. పశ్చిమాఫ్రికాలోని అనేక దేశాల్లో మతపరమైన వ్యభిచారం ఉన్నట్లు హెరిడోటస్ తన రచనల్లో పేర్కొన్నాడు.[5][6]
భారతదేశ చరిత్రలో జోగిని, దేవదాసి వ్యవస్థల నేపథ్యం విభిన్న కోణాల్లో, దశల్లో కనపడుతుంది. జోగిని, దేవదాసి వ్యవస్థలు వైష్ణవ సంప్రదాయంలో కనపడతాయి. కాళిదాసు కీర్తనలో మాతంగి అంటే దళిత స్త్రీ అని అర్థం. మాతంగి రూపాన్ని మహాదివ్య సరస్వతిగా అభివర్ణించారు. సా.శ. 3వ శతాబ్దానికి చెందిన జోగి మరణశాసనం జోగిని వ్యవస్థ గురించి వివరిస్తుంది. వాత్సాయనుడి కామసూత్రాల్లో వీరు వివిధ కళల్లో నైపుణ్యంగలవారని, గణిక, విలాసవతి పేర్లతో ఈ సంప్రదాయాన్ని కొనసాగించేవారని పేర్కొన్నారు. దేవదాసి అనే పదాన్ని ఆర్యులు వినియోగించిన వైదిక ధర్మాచరణ నుంచి తీసుకొన్నారు.నాడు అనార్యులను, అవర్ణులను దస్యులు అని పిలిచేవారు.దేవాలయాల్లో పరిచారికలుగా ఉండే వీరిని దేవదాసి అని పిలిచేవారు.దేవదాసి వ్యవస్థ భారతదేశమంతటా ఉందని హ్యుయాన్‌త్సాంగ్ పేర్కొన్నారు. చరిత్రను నిశితంగా పరిశీలిస్తే స్త్రీలను దేవతలు, యోగిని, శక్తిమాత, డాకిణి, షాకిని, జోగినిగా పిలిచేవారని తెలుస్తున్నది. యోగం, యాగం, యజ్ఞం కలిగిన స్త్రీలను యోగినులుగా ఆరాధించేవారు. భారతీయ సంప్రదాయంలోని 64 కళల్లో నాట్యం విలక్షణ సాంస్కృతిక జీవన విధానంగా గుర్తింపు పొందింది. రాజులు తమ రాజమందిరాల్లో మద్యం తాగుతూ నాట్యగత్తెల నాట్యాన్ని ఆస్వాదిస్తూ విందులు, వినోదాలు జరుపుకొనేవారు.దేవాలయాల్లో పండుగలు, ఉత్సవాలు జరిగేటప్పుడు నాట్యాలకు అధిక ప్రాధాన్యమిచ్చేవారు. కాళిదాసు తన మేఘదూత కావ్యంలో ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బాలికలను చిన్న వయసులోనే దేవతలు, దేవుళ్లకు సమర్పించే సంప్రదాయం ఉందని పేర్కొన్నారు. సా.శ. 10వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్, తంజావూరు సంస్థానాల్లో 400 మందికిపైగా దేవదాసీలు ఉండేవారని, దేవాలయాల్లో పూజారుల తర్వాత స్థానం దేవదాసి లేదా జోగినులదే అని అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యింది.
సామాజిక దురాచారాలైన జోగిని, దేవదాసి వ్యవస్థలు తెలంగాణ సమాజంలో నేటికీ కనపడటం బాధాకరమైన విషయం. తెలంగాణను చారిత్రకంగా పరిశీలిస్తే భౌగోళికంగా తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా మహాసముద్రం వరకు విస్తరించి ఉండేది. దీంతో ఈ దురాచారాలు ఆ కాలంలో చోళ రాజ్యంలో సర్వసాధారణంగా కనపడేవి. జోగిని, దేవదాసీలను దేవర్ అడిగళర్ అని పిలిచేవారు. ఈ పేరుకు అర్థం దేవతలకు బానిస. జగన్నాథ దేవాలయంలో వీరిని మహారి అని పిలిచేవారు. దీనికి అర్థం మోహన నారి. అంటే సమ్మోహనానికి మన్మథ క్రీడలకు ఇష్టపడిన, ప్రేరేపించే స్త్రీ దేవదాసిగా మారుతుంది. ఫ్రెంచ్ మత గురువు అబుదుబేయ్ (1792-1823) రచించిన హిందూ మానర్స్, కస్టమ్స్ అండ్ సెర్మనీస్ గ్రంథంలో శైవమతాన్ని ఆచరించిన కాకతీయ, రెడ్డి రాజులు, వెలమరాజుల కాలంలో జోగిని వ్యవస్థ ఉన్నట్లుగా పేర్కొన్నాడు.
మంజులవాగ్విలాసం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి అని కాళిదాసు కీర్తించిన మాతంగి మహావిద్య సరస్వతీ అవతారం. అటువంటి దేవదాసీల ఉన్నత స్థానం క్రమక్రమంగా దిగజారింది. ఈ సంప్రదాయం ప్రకారం ఒక వంశంలోని స్త్రీలలో తరానికొక్కరి చొప్పున గుడిలోని దేవుడికి "పెళ్ళి" చేసేవారు. ఆ స్త్రీ జీవితాంతం అవివాహితగా ఉండి, దేవాలయం నిర్వహణ చూస్తూ, భరతనాట్యం ప్రదర్శిస్తూ గడపాలి. జోగినులు ప్రతి శుక్రవారం, మంగళవారం స్నానం చేసి ఎల్లమ్మ దేవత గుడి కడగాలి. పూజలు చేయాలి. ఆ రెండు రోజులు ఒక్కపూటే భోజనం చేయాలి. మాంసం ముట్టుకోరాదు. వారంలో ఆరెండు రోజులే ఊర్లో యాచించి, వారమంతా గడపాలి. బస్వినులు సోమవారం, శనివారం పూజ చేయాలి.వికలాంగులు, అత్యాచారానికి గురైన వారిని జోగినులుగా మారుస్తున్నారు. ఒక కుటుంబంలో జోగిని చనిపోతే శవానికి మరో జోగినితో పెళ్ళి చేస్తారు. అప్పుడు ఒకరు పూనకం నిండి, ఆ కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఎవరు జోగినిగా కొనసాగాలో పేరు చెబుతారు. మరణించిన జోగినీ తల్లి అయితే ఆమె పెద్దకోడలు లేదా చిన్న కోడలు నగ్నంగా శరీరమంతా వేపాకు కట్టుకుని, ఎల్లమ్మ ఆలయం చుట్టూ తిరగాలి. అక్కడే కొత్త తెల్లచీర కట్టుకుని జోగినిగా కొనసాగాలి.జోగినుల పిల్లలు తండ్రి పేరు విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏ దేవుడి పేరునో తండ్రి పేరుగా చెబుతున్నారు. తండ్రి పేరు లేదని పాఠశాలలో చేర్చుకోకపోవడంతో చదువు మానేసిన పిల్లలున్నారు.[7]
జోగినుల వ్యవస్థ నిర్మూలనకు 'ఆశ్రయ్ ' సంస్థ, ఆంధ్రప్రదేశ్ జోగినీ వ్యవస్థ వ్యతిరేక సంఘటన (ఎపిజెవివిఎస్) కృషి చేస్తున్నాయి.వాటి ఆశయాలు:
జోగిని వ్యవస్థ జోగిని వ్యవస్థ భూస్వామ్య విధాన అవశేషంగా, మతం, ఆచారం పేరుతో నిమ్న వర్గాలకు చెందిన స్త్రీలను సామాజిక వ్యభిచారం పేరుతో దింపేవారని సామాజిక శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 75 శాతం జోగినులు షెడ్యూల్డ్ కులాలకు చెందినవారే ఉండేవారు. పేదరికం, నిరక్షరాస్యత, అమాయకత్వం వారిని భూస్వామికి దాసీలుగా చేస్తుంది. ఇదే వ్యవస్థ వారిని జోగినులుగా మారుస్తుంది. సంప్రదాయం, మతం పేరుతో సామాజిక అనుమతితో జోగినులను వ్యభిచార వృత్తిలోకి దింపేవారు. ఒకసారి దేవతకు అర్పితమైన జోగినులు జీవితాంతం దుర్భర జీవితాన్ని గడపాల్సిందే. జోగినుల సంప్రదాయం మూఢనమ్మకాల విష వలయంలో చిక్కుకున్నది. మొక్కుబడి పేరుతో దళిత స్త్రీలను దేవతలకు సమర్పించడం అనంతరం జీవితాంతం సమాజం సొత్తుగా, అందరికి ఆనందాన్ని పంచుతూ తాను విషాదంలో జీవితాన్ని గడపటం జోగిని వ్యవస్థలో విషాద అంశం. జోగినిగా మార్చడానికి కుటుంబంకానీ, గ్రామంలోకానీ ఏర్పడ్డ అరిష్టమే ప్రధాన కారణం. గ్రామంలో అంటువ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భవిష్యత్తులో ఏదో ప్రమాదం పొంచి ఉందని భావించి దీన్ని ఎదుర్కోడానికి గ్రామంలో నిమ్న కులానికి చెందిన కన్యకు దేవుళ్లతో వివాహం జరిపేవారు. వీరినే జోగినులుగా పిలిచేవారు.
జోగుపట్టం గ్రామానికి అరిష్టం వచ్చినప్పుడు గ్రామదేవతకు మొక్కుబడి చెల్లించడానికి వివాహం కానీ ఆడపిల్లను గ్రామానికి దత్తత ఇవ్వడం అనే సంప్రదాయం నుంచి జోగిని వ్యవస్థ ప్రారంభమైంది. సాధారణంగా ఒకే కుటుంబానికి చెందిన స్త్రీలను జోగినులుగా మారుస్తారు. అమ్మాయిని జోగినిగా మార్చే కార్యక్రమాన్ని జోగుపట్టం అంటారు. అమ్మాయిని ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయానికి తీసుకెళ్తారు. బ్రాహ్మణేతర పూజారైన పోతరాజు (గ్రామదేవతల తమ్ముడిగా భావిస్తారు) మంగళ సూత్రధారణే కాకుండా గావుపట్టు అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాడు. ఈ సమయంలో పోతరాజు మేక, గొర్రె, కోడిని కానీ పంటితో కొరికి మొండెం నుంచి తలను వేరు చేస్తాడు. ఈ తంతు ముగిసినప్పటి నుంచి జోగిని నిత్యసుమంగళిగా మారుతుంది. వీరికి వైధవ్యం ఉండదు. జోగిని ఆ గ్రామంలోని అందరి యువకుల సొత్తుగా (ఉంపుడుగత్తె) మారిపోతుంది. జోగుపట్టంలో అమ్మాయిని పసుపు నీళ్లలో ముంచి, పసుపు చీర కట్టి, తలనిండా పూలు, ఎర్రటి బొట్టుపెట్టి నూతన వధువుగా అలంకరిస్తారు. గ్రామపెద్ద, భూస్వాములుగాని మొదటగా ఆమెతో సంసార ప్రక్రియలో పాల్గొంటారు. దీనినే కన్నెరికం అని వ్యవహరిస్తారు. దీనికిగాను ఆమెకు కానుకలు లభిస్తాయి. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. (కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయంలో జోగినులను శివసత్తులు అంటారు)
జోగిని వ్యవస్థ - విషాద జీవితం
జోగిని జీవితం విషాదం కావడానికి ఆధారాలు
(శాయమ్మ) నోటికి తాళం వేస్తారు. ఇదే ప్రాంతంలో జరిగే జనుంపల్లి జాతరలో జోగిని శరీరమంతా పసుపు రాసి, వేపాకులు కట్టి ఆమెను ఒక స్తంభానికి కట్టివేస్తారు. (దీనిని సిడి అంటారు)
జోగిని వ్యవస్థ నిర్మూలన దిశగా చర్యలు:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.