ఆండ్రీ ఆడమ్స్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, కోచ్ From Wikipedia, the free encyclopedia

ఆండ్రీ ఆడమ్స్

ఆండ్రీ ర్యాన్ ఆడమ్స్ (జననం 1975, జూలై 17) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, కోచ్. కరేబియన్ సంతతికి చెందిన ఆడిమ్స్[1] న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన న్యూజీలాండ్ మొదటి టీ20లో ఆడినందుకు ప్రసిద్ది చెందాడు, అక్కడ ఇతనికి క్యాప్ నంబర్ 1 లభించింది.

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
ఆండ్రీ ఆడమ్స్
Thumb
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆండ్రీ ర్యాన్ ఆడమ్స్
పుట్టిన తేదీ (1975-07-17) 17 జూలై 1975 (age 49)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 219)2002 మార్చి 30 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 122)2001 ఏప్రిల్ 10 - శ్రీలంక తో
చివరి వన్‌డే2007 జనవరి 6 - శ్రీలంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.41
తొలి T20I (క్యాప్ 1)2005 ఫిబ్రవరి 17 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2006 డిసెంబరు 26 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1997/98–2012/13Auckland
2001Herefordshire
2004–2006ఎసెక్స్
2007–2014నాటింగ్‌హామ్‌షైర్
2008Kolkata Tigers
2012Khulna Royal
2015హాంప్‌షైర్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 1 42 173 165
చేసిన పరుగులు 18 419 4,540 1,504
బ్యాటింగు సగటు 9.00 17.45 21.31 16.71
100లు/50లు 0/0 0/0 3/18 0/1
అత్యుత్తమ స్కోరు 11 45 124 90*
వేసిన బంతులు 190 1,885 33,380 7,561
వికెట్లు 6 53 692 209
బౌలింగు సగటు 17.50 31.00 23.95 28.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 27 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 5 0
అత్యుత్తమ బౌలింగు 3/44 5/22 7/32 5/7
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 8/– 114/– 40/–
మూలం: ESPNcricinfo, 2016 ఆగస్టు 19
మూసివేయి

ప్రారంభ జీవితం, వృత్తి

ఆండ్రీ ఆడమ్స్ 1975, జూలై 17న న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్‌లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

2002 మార్చిలో న్యూజీలాండ్ తరఫున ఆడమ్స్ అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. 2003 ప్రపంచ కప్‌లో ఆడాడు, కానీ త్వరలోనే మళ్ళీ తన స్థానాన్ని కోల్పోయాడు. 2004 నాట్‌వెస్ట్ సిరీస్ చివరిలో ఇంగ్లాండ్‌లో న్యూజీలాండ్ వన్డే జట్టుకు చాలా ఆలస్యంగా కాల్-అప్ వచ్చింది. తరువాత వేసవిలో మిగిలిన కాలానికి ఎసెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతను 2005, 2006 సీజన్లలో ఉన్నాడు.

న్యూజీలాండ్ దేశీయ ఫస్ట్-క్లాస్ స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో 18.78 సగటుతో 32 వికెట్లు సాధించాడు. 39.75 సగటుతో 318 పరుగులు చేశాడు.

కోచింగ్

2015లో ఆడమ్స్ 2015/16 సీజన్‌కు బౌలింగ్ కోచ్‌గా ఆక్లాండ్ క్రికెట్ క్లబ్‌లో చేరాడు. 2016/17కి ఆడమ్స్ ఆక్లాండ్ ప్రధాన కోచ్‌గా ఉంటాడు.[3]

మూలాలు

బాహ్య లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.