అరబ్బీ (అరబ్బీ : الْعَرَبيّة ) (అల్-అరబియ్య) లేదా (అరబ్బీవ్: عَرَبيْ ) అరబి / అరబీ / అరబ్బీ ) సామీ భాషాకుటుంబంలో సజీవంగానున్న అతి పెద్ద భాష. ఇది హీబ్రూ, అరమాయిక్ భాషలకు దగ్గరగా వుంటుంది. నవీన అరబ్బీ భాష 27 రకాలుగా అరబ్ భూభాగంలో మాట్లాడబడుచున్నది. భాషాపరంగా ఇస్లామీయ ప్రపంచంలో ఉపయోగించబడుచున్నది.
అరబ్బీ భాష العربية | ||
---|---|---|
అల్-అరబియ్య అరబ్బీ 'నస్ఖ్' లిపిలో వ్రాయబడినది: | ||
ఉచ్ఛారణ: | / అల్ అర బియ్ య / | |
మాట్లాడే దేశాలు: | అల్జీరియా, బహ్రయిన్, ఈజిప్టు, ఇరాక్, జోర్డాన్, కువైట్, లెబనాన్, లిబియా, మారిటానియా, మొరాకో, ఒమన్, పాలస్తీనా పాలస్తీనా ప్రాంతాలు, కతర్, సౌదీ అరేబియా, సూడాన్, సిరియా, ట్యునీషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పశ్చిమ సహారా, యెమన్, మెజారిటీగా; ఇస్లాం యొక్క సాహితీ భాష. | |
ప్రాంతం: | అరబ్ ప్రపంచం | |
మాట్లాడేవారి సంఖ్య: | ప్రాదేశికంగా 186 , 422 మిలియన్ మంది మాట్లాడేవారున్నారు.[1] According to Ethnologue, 246 million including second language speakers, (1999 est). | |
ర్యాంకు: | 2 [2] to 6[3] (native speakers) | |
భాషా కుటుంబము: | సామి పశ్చిమ సామి మధ్య సామి అరబ్బీ భాష | |
వ్రాసే పద్ధతి: | అరబ్బీ వర్ణమాల | |
అధికారిక స్థాయి | ||
అధికార భాష: | జాబితా
| |
నియంత్రణ: | ఈజిప్టు: కైరో లోని అరబ్బీ భాష అకాడెమి సిరియా: డెమాస్కస్ లోని అరబ్ అకాడెమి (అత్యంత ప్రాచీనమైన) | |
భాషా సంజ్ఞలు | ||
ISO 639-1: | ar | |
ISO 639-2: | ara | |
ISO 639-3: | ara — Arabic (generic) అరబ్బీ మాండలికాల ప్రత్యేక కోడులు చూడటానికి అరబ్బీ మండలికాలు అనే పేజికి వెళ్ళండి' | |
అరబ్బీ భాష ప్రధానంగా 'అధికారిక భాష' గల ప్రాంతాలు (ఆకుపచ్చ రంగులో) , అనేక భాషలలో ఒక భాషగా 'అరబ్బీ భాష' గల ప్రాంతాలు (నీలం రంగులో) | ||
గమనిక: ఈ పేజీలో IPA ఫోనెటిక్ సింబల్స్ Unicodeలో ఉన్నాయి. |
నవీన అరబ్బీ సాంస్కృతిక అరబ్బీ నుండి ఉధ్బవించింది, సా.శ. 6వ శతాబ్దంనుండి పురాతన ఉత్తర అరేబియా ప్రాంతంలో సాంస్కృతిక భాషగా విరాజిల్లిన అరబ్బీ 7వ శతాబ్దంలో సాంస్కృతిక, మతపరమైన భాషగా నేటికినీ వాడుకలోయున్నది.
అరబ్బీ భాష అనేకమైన తన పదాలను ఇతరభాషలకు ప్రసాదించింది. ముఖ్యంగా లాటిన్, ఐరోపా భాషలకు. దీనికి ప్రతిఫలంగా ఎన్నోభాషలనుండి పదాలను పొందింది. ఉర్దూ భాషలో కూడా అరబ్బీ పదాలు మెండుగా కనిపిస్తాయి.
భారతదేశంలో అరబ్బీ భాష
భారతదేశంలో అరబ్బీ భాష మాట్లాడేవారి సంఖ్య తక్కువగా వున్ననూ, ఈ భాష చదవడం, కొద్దిగా అర్థం చేసుకునేవారి సంఖ్య బాగా కనిపిస్తుంది. "ఇబాద" ప్రార్థనల కొరకు ముహమ్మద్ ప్రవక్త వాడిన భాష ఈ అరబ్బీ, కావున షరియాను అనుసరించే ముస్లింలు ఆచరించే నమాజు, దుఆలు ఈ భాషలోనే కానవస్తాయి. ముస్లింల ధార్మిక గ్రంథం అయినటువంటి ఖురాన్ ఈ భాషలోనే ఉన్నది కావున, ఖురాన్ పఠించే వారంతా 'అరబ్బీ భాష' (కనీసం పఠించుటకు) నేర్చుకుంటారు. భారతదేశంలో దాదాపు 50,000 మంది అరబ్బీ మాతృభాషగా గలవారున్నారని అంచనా. అంతేగాక, భారతదేశంలోని అనేక విశ్వవిద్యాలయాలలో అరబ్బీ భాష డిపార్ట్‌మెంట్లు గలవు. ఉదాహరణకు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం.
పదజాల ఉదాహరణాలు
తెలుగు | అరబ్బీ | తెలుగు లిప్యాంతరీకరణ | అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల |
---|---|---|---|
తెలుగు | |||
ఇంగ్లీషు | الإنكليزية | అల్-ఇంగ్లీజియా | /alingliːziːjah/ |
అవును | نعم | న'ఆమ్ | /naʕam/ |
లేదు | لا | లా | /laː/ |
స్వాగతం, నమస్తే | أهلاً (గ్రాంధికం "సుస్వాగతం") or مرحبًا (వ్యవహారికం) | అహ్‌లన్ లేదా మర్హబన్ | /ahlan/ తా /marħaban/ |
Goodbye | مع السلامة | మా అల్-సలామ | /maʕ assalaːmah/ (గ్రాంధికంగా 'శాంతి తో') |
దయచేసి | أرجوك | అర్‌జుక్ | /ʔardʒuːk/ |
ధన్యవాదాలు | شكرًا | షుక్రన్ | /ʃukran/ |
మీకు స్వాగతం / దయచేయండి | عفوًا | అఫ్‌వన్ | /ʕafwan/ |
మన్నించండి / క్షమించండి | آسف | ఆసిఫ్ | /ʔaːsif/ |
మీ పేరేమిటి? | ما إسمك | మా ఇస్‌ముక్ | /maː ismuka/ |
ఎంత? | بكام؟ | బికామ్? | /bikam/ |
నాకర్థం కాలేదు | لا أفهم | లా అఫ్‌హామ్ | /laː ʔafham/ |
నేను అరబ్బీ మాట్లాడలేను | لا أتكلم العربية | లా అతకల్లము అల్-అరబియా | /ʔanaː laː ʔatakallam ulʕarabijja/ |
నాకు తెలియదు | لا أعرف | లా ఆరిఫ్ | /laː ʔaʕarif/ |
నాకు ఆకలేస్తుంది | أنا جائع | అనా జాయినున్ | /ʔanaː dʒaʔiʕun/ |
నారింజ | برتقالي | బుర్తుఖాలి | /burtuqaːliː/ |
నలుపు | أسود | అస్వద్ | /ʔaswadu/ |
ఒకటి | واحد | వాహిద్ | /waːħid/ |
రెండు | إثنان | ఇత్నాన్ / ఇస్నాన్ | /iθnaːn/ |
మూడు | ثلاثة | సలాస | /θalaːθah/ |
నాలుగు | أربعة | అరబా | /ʔarbaʕa/ |
ఐదు | خمسة | ఖంసా | /xamsah/ |
వ్యాకరణం
నామవాచకం
అరబ్బీ భాషలో ప్రతి నామవాచకం పుల్లింగ, స్త్రీలింగాల్లో ఏదో ఒక లింగం కలిగి ఉంటుంది. జీవం ఉన్న ప్రాణుల గురించి మాట్లాడేటప్పుడు పుల్లింగం మగతనాన్ని సూచిస్తుది, స్త్రీలింగం ఆడతనాన్ని సూచిస్తుంది, కానీ వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు పదలింగానికీ నిజమైన లింగానికీ సంబంధం లేదు.
భగ్న బహువచనం
అరబ్బీ భాషలో చాలా నామవాచకాలకు "భగ్న బహువచనాలు" ఉంటాయి. అంటే ఇలాంటి పదాలకు బహువచనం సూచించడానికి చివరికి ఒక ప్రత్యయం చేర్చడానికి బదులు ఆ పదాల్లో అచ్చులు మార్చాలి. అరబ్బీ భాషలో షుమారు 50% నామవాచకాలకు భగ్న బహువచనం ఉంటుంది.
క్రియలు
ఇవీ చూడండి
- అరబ్బీ అక్షరమాల
- అరబ్బీ లిపీకళాకృతి
- అరబిక్ డిగ్లోస్సియా
- స్పానిష్ భాషపై అరబ్బీ ప్రభావం
- అరబ్బీ సాహిత్యము
- అరబిస్ట్
- నవీన వ్రాత అరబ్బీ నిఘంటువు
- ఇరాబ్
- ఆంగ్లభాషలో అరబ్బీ పదాలు
- అరబిక్ మూల ఫ్రెంచ్ పదాలు
- అభివాదాలు
- అరబ్బీ భాషలో ఇస్లామీయ పదజాలము
- అరబిక్ మూల పోర్చుగీసు పదాలు
- టర్కిష్ భాషలో అరబ్బీ మూల పదాలు
- సాహిత్య అరబిక్
- అరబ్బీ భాష రకాలు
పాదపీఠికలు
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.