From Wikipedia, the free encyclopedia
అమేలి 2001వ సంవత్సరంలో విడుదలైన ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీ చిత్రం. జీన్ పియర్ దర్శకత్వంలో అమేలి పాత్రలో ఆడ్రీ టాటౌ నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతోపాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ స్ర్కీన్ ప్లే, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ మ్యూజిక్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది.
Amélie | |
---|---|
దర్శకత్వం | జీన్ పియర్ |
స్క్రీన్ ప్లే | గిలియమ్ లారెన్ |
కథ |
|
నిర్మాత |
|
తారాగణం |
|
Narrated by | ఆండ్రీ డస్యోలియర్ |
ఛాయాగ్రహణం | బ్రూనో డెల్బన్నల్ |
కూర్పు | హెర్వ్ స్చ్నైడ్ |
సంగీతం | యన్ టైర్సెన్ |
పంపిణీదార్లు | యుజిసి ఫాక్స్ డిస్ట్రిబ్యూషన్ |
విడుదల తేదీs | 25 ఏప్రిల్ 2001 (ఫ్రాన్స్) 16 ఆగస్టు 2001 (జర్మనీ) |
సినిమా నిడివి | 123 నిముషాలు[1] |
దేశాలు | |
భాష | ఫ్రెంచి భాష |
బడ్జెట్ | $10 మిలియన్[2] |
బాక్సాఫీసు | $174.2 మిలియన్[2] |
చిన్నతనంలోనే కన్నతల్లిని కోల్పోయి, అత్యంత అసాధారణ మనుషుల మధ్య పెరిగిన అమ్మాయి చివరికి తన జీవితంలో ఆనందం ఎలా పొందిందన్నదే ఈ చిత్ర కథ. అమేలి పాత్ర ప్రధానంగా ఉన్న ఈ చిత్రంలో ఒక అమ్మాయి తన కలలు కన్న ప్రపంచం కోసం చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో సంతరించుకున్న కామెడీ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ నిలవడంతోపాటూ , అమేలి పాత్రలో ఆడ్రీ టాటౌ నటన ఆకట్టుకుంది. తను చేసిందే సరైనదనుకునే మనస్తత్వం గల అమ్మాయైన అమేలి తన నాన్న కారణంగా అణచివేయబడి, నెగటివ్ దృక్పథాన్ని ఏర్పర్చుకుంటుంది. తనకు నచ్చినట్లు ఉండాలని, ప్రేమతో కూడిన ఒక అద్భుతమైన ప్రపంచంలో జీవించాలని కలలు కంటూ, ప్రేమ కోసం ఆరాటపడిన అమేలి తను ఊహించుకున్న అద్భుతమైన లోకం దొరక్కపోవడంతో అమేలి ఏం చేసిందనేది చిత్రకథ.[3]
Seamless Wikipedia browsing. On steroids.