Remove ads
From Wikipedia, the free encyclopedia
అమరచింత పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] అమరచింత పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం లోని దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
అమరచింత పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 16.4773605°N 77.7223162°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వనపర్తి |
మండలం | అమరచింత |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | మంగమ్మ |
- వైస్ చైర్పర్సన్ | జిఎస్ గోపి |
వైశాల్యము | |
- మొత్తం | 19.82 km² (7.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 11,225 |
- పురుషుల సంఖ్య | 5,540 |
- స్త్రీల సంఖ్య | 5,685 |
- గృహాల సంఖ్య | 2,576 |
పిన్ కోడ్ - 509130 | |
Area code(s) | ఎస్.టి.డి కోడ్ - 08504 |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న అమరచింత, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
అమరచింత 19.82 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16.374°N 77.772°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 140 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం వనపర్తి నుండి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 11225 మంది కాగా, అందులో 5540 మంది పురుషులు, 5685 మంది మహిళలు ఉన్నారు. 2576 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 10 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం మంగమ్మ చైర్‌పర్సన్‌గా, జిఎస్ గోపి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.