అనుముల వెంకటశేషకవి

From Wikipedia, the free encyclopedia

అనుముల వెంకటశేషకవి (జ: 1907,ఆగష్టు 8) నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ శతావధాని.

జీవిత విశేషాలు

ఇతడు 1907,ఆగష్టు 8న నెల్లూరు జిల్లాలోని చింతపూడు గ్రామంలో జన్మించాడు.[1] ఈయనకు చిన్నతనం నుండే అవధాన శక్తి అబ్బినది.నెల్లూరులో స్కూలు ఫైనల్ చేస్తుండగానే మొట్టమొదట అష్టావధానం చేశారీయన. తరువాత చదువుకోవాలని రాజమండ్రి వెళ్ళారు. రాజమహేంద్ర వరంలో ఇరవై యేండ్లు కూడా లేని ఈయన శతావధానానికి అందరూ ఆశ్చర్య పోయేవారు. ఇతడు నంద్యాలలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఇతనికి సంస్కృతాంధ్రాలతో పాటు దక్షిణ భారతదేశ భాషలలో పరిచయం ఉంది. ఇతడు అధ్యాపకునిగా పనిచేశాడు. లండన్‌లోని హెచ్.ఆర్.ఇ.ఎస్. సభ్యుడు. ఈయన మూడుసార్లు మాత్రమే శతావధానం చేశారు. తర్వాత ఆయన అష్టావధానాలే చేస్తూ వచ్చారు. ఆయన శతాధికంగా అష్టావధానాలు చేశారు.

సంస్థానాల సందర్శనం

ఇతవై యేట నుండి సంస్థానాలలో సాహిత్య విహారం చేయటం మొదలు పెట్టారు. సంస్థానాలు పోయిన తర్వాత సారస్వతానికి మరీ దీనస్థితి సంభవించింది. ఇప్పతి అకాడమీల కంటే అప్పటి సంస్థానాలే ఎంతో నయం అని అంటూండేవారాయన. ఆయన మొట్టమొదట "దైవం దిన్నె" సంస్థాన ప్రవేశం చేశారు.ఆయన ప్రతిభకు రాజమందిరాతిధ్యం, పండిత గోష్ఠి భాగదేయం కలిగాయి.

రచనలు

శేషకవి తన పద్నాలుగవ యేటనే రెండు నాటకాలు వ్రాసి ప్రచురించారు. మొదటిది "అభినవ తారాశశాంక విజయం", రెండవది "సత్యనారాయణ మహత్మ్యం". "చింతాదేవి" తొలి పద్య కృతి. "తెలుగు రాణి" తొలి నవల. "లలితాంజలి", "వివేకానంద" పద్య కృతులు అముద్రితాలు. "పోతన" నవల కూడా అముద్రితం గానే ఉండిపోయింది. సంస్కృతాంధ్ర, హిందీ, కన్నడ భాషల్లో నిష్ణాతులైన శేషకవికి సంస్కృతంలో బిల్హణ, కాళిదాసులూ, ఆంగ్లంలో షెల్లీ, కీట్స్, హిందీలో ప్రేమ్‌చంద్లు అభిమానులు. ఈయన శ్రీ ఆది శంకరాచార్యులు వ్రాసిన వివేకచూడామణి గ్రంథాన్ని తెలుగు అనువాదం చేశారు. ఇంకా ఇతడు ప్రగతి (గేయాలు), నీతికథానిధి, వేళాకోళం(నాటిక), సువర్ణరేఖలు (కథాసంపుటి) రచించాడు.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.