అతిథి

From Wikipedia, the free encyclopedia

అతిథి
Remove ads

అతిథి 2007లో విడుదలైన ఒక తెలుగు సినిమా. మహేష్ బాబు హీరోగా నటించాడు. ఈ సినిమాకు ముందు విడుదలైన మహేష్ బాబు సినిమా పోకిరి తెలుగు చలన చిత్ర రంగంలో సంచలనాత్మక విజయం సాధించగా, వెంటనే వచ్చిన సైనికుడు చిత్రం భాక్సాఫీస్ దగ్గర విఫలమైన నేపథ్యంలో ఈ సినిమా విడుదలయ్యింది. "థమ్సప్" శీతల పానీయాల ప్రకటనలకు ఈ సినిమాలోని హీరో పాత్రను వాడారు.

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
Remove ads

కథ

ఢిల్లీలో ఒక కుర్రవాడు బెలూన్లు అమ్ముకుంటుంటాడు. అతడు ఒక పాపకు బెలూన్ ఇచ్చిన తరువాత జరిగే ఘటనలవల్ల ఆ పాప కుటుంబం ఆ కుర్రవాడిని తమ ఇంటికి "అతిథి"గా ఆహ్వానిస్తారు. ఒకమారు కొందరు దుండగులు ఆ పాప తల్లిదండ్రులను చంపగా ఆ నేరం అతిథిపై పడుతుంది. అతను అరెస్టవుతాడు. ఆ పాప కూడా అతనిని అసహ్యించుకుంటుంది.

Thumb
అభిమానుల పోస్టరు

14 సంవత్సరాల తరువాత అతిథి (ఇప్పుడు మహేష్ బాబు) జైలునుండి విడుదలయ్యాక అమృత (అమృతారావు) అనే యువతికి పరిచయమౌతాడు. వారి మధ్య ప్రేమ పెరిగింది. అయితే ఆమె తల్లిదండ్రులే ఇంతకు ముందుకు హత్య చేయబడ్డారని, అందువల్ల ఆ యువతి ఇప్పటికీ "అతిథి"ని ద్వేషిస్తున్నదనీ అతనికి తెలుస్తుంది. హైదరాబాదు చేరిన అమృతను చంపాలని ఆ పాత రౌడీ విలన్ కైజర్ ప్రయత్నిస్తున్నాడని హీరో తెలుసుకుంటాడు. అంతే కాకుండా నిజాయితీ పరునిగా పేరుపడ్డ ఒక పోలీసు ఆఫీసర్, గూండా లీడర్ కైజర్ ఒకరేనని కూడా హీరో తెలుసుకుంటాడు.

ఆ విలన్ హీరోయిన్‌ను ఎత్తుకుపోతాడు. అతనినుండి హీరోయన్‌ను రక్షించుకోవడం పతాక సన్నివేశం.

Remove ads

పాటలు

మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో 6 పాటలున్నాయి. ఆడియో విడుదల సెప్టెంబరు 27, 2007న జరిగింది.

  • ఖబడ్దారనీ - నవీన్, రాహుల్ నంబియార్ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • గొన గొన గోనన్నగోనా - నవీన్, రీటా , రచన: చంద్రబోస్
  • సత్యం ఏమిటో - దీపు, ఉషా , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • ఖిలాడి కూనా - కార్తీక్, రీటా , రచన: విశ్వా
  • రాత్రైనా ఓకే, నాకు పగలైనా ఓకే - రంజిత్, అనుష్కా (ఈ పాట బాగా విజయవంతమయ్యింది) రచన: భాస్కర భట్ల
  • వాల్లా వాల్లా - రాహుల్ నంబియార్, ధర్మా , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
Remove ads

బయటి లింకులు

మూలాలు, వనరులు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads