Remove ads
From Wikipedia, the free encyclopedia
అందరికీ మొనగాడు 1971, ఫిబ్రవరి 13న విడుదలైన తెలుగు సినిమా. ఎం.మల్లికార్జునరావు స్వీయదర్శకత్వంలో శ్రీ పద్మావతీ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించాడు.[1] ఘట్టమనేని కృష్ణ, భారతి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహదేవన్ సమకూర్చారు.
అందరికీ మొనగాడు (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.మల్లికార్జునరావు |
---|---|
తారాగణం | కృష్ణ, భారతి, ముక్కామల, ప్రభాకర రెడ్డి, రాజబాబు, విజయలలిత, జ్యోతిలక్ష్మి, గుమ్మడి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ పద్మావతీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఈ చిత్రంలోని పాటలను ఆరుద్ర రచించగా కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చాడు.[2]
డాక్టర్ రాజా అనే సైంటిస్టు తయారు చేస్తున్న అమూల్యమైన పరిశోధనా పత్రాలను స్వాయత్తం చేసుకోవాలని సర్దార్ అనే దేశద్రోహి ప్రయత్నిస్తూ ఉంటాడు. రాజా వద్ద సెక్రెటరీగా పనిచేస్తున్న విమల అనే అమ్మాయి ఆ దేశద్రోహుల ముఠా చేతుల్లో చిక్కి రాజా పరిశోధనల ఫార్ములాను అందజేసి వారి చేతుల్లోనే బలై పోయింది. ఆ దేశద్రోహుల ముఠాను కనిపెట్టి వారిని మట్టుపెట్టడానికి కేంద్ర అపరాధ పరిశోధక శాఖ గోపి అనే గూఢచారి 116 ను నియమిస్తుంది. గోపి విమల చెల్లెలు లీలను రాజా వద్ద సెక్రెటరీగా నియమించి తద్వారా ఆ ముఠాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈలోగా వారిద్దరూ ప్రేమలో పడతారు. క్షణక్షణానికీ ప్రాణాపాయ ఘటనలను ఎదుర్కొంటారు. వారిద్దరూ సర్దార్‌ను, అతని ముఠాను ఎలా ఎదుర్కొన్నారన్నదే మిగిలిన సినిమా.[3][4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.